స్వామి వివేకానంద జీవితం ఎంతో మందికి ఆదర్శ ప్రాయమని ప్రధాని మోదీ అన్నారు. వికసిత్ భారత్ యుంగ్ లీడర్స్ 2026 ముగింపు కార్యక్రమానికి మోదీ హాజరయ్యారు. యువత రిస్క్ తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడకూడదని మీ విజయం దేశాన్ని కొత్త శిఖరాలకు చేరుస్తుందని తెలిపారు. 2047 వికసిత్ భారత్ ప్రయాణం దేశ అభివృద్ధికి ఎంతో కీలకమన్నారు.
2014లో తాను ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వారిలో అక్కడున్న వారిలో చాలామంది చిన్నపిల్లలని అక్కడి యువతనుద్దేశించి మోదీ మాట్లాడారు. ప్రస్తుతం స్కిల్ డెవలప్‌మెంట్ సెక్టార్‌లో అనేక మార్పులు తెచ్చామని ఐఐటీలను కూడా అప్‌గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు. యవత చాలా యాక్టివ్‌గా ఉండాలని ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ యువతకు సూచించారు. నేడు స్వామివివేకానంద జయంతి ఈ రోజును భారత్ జాతీయ యువజన దినంగా జరపుకుంటుంది.


