ఉడిపి, సాక్షి, : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం కర్ణాటకలోని ఉడిపిలో లక్ష కంఠ గీత పారాయణ కార్యక్రమానికి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉడుపిలోని శ్రీ కృష్ణ మఠాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.అంతకుముందు ప్రధాని మోదీ రోడ్‌షో నిర్వహించారు.
కృష్ణుడి గర్భగుడి ముందు ఉన్న సువర్ణ తీర్థ మంటపాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా పవిత్ర కనక కవచం (బంగారు కవచం )ను అందించారు. ఇది పవిత్ర కనకదాసు శ్రీ కృష్ణుడి దర్శనం పొందిన పవిత్ర ప్రదేశంగా భావిస్తారు. ఉడిపిలోని శ్రీకృష్ణ మఠంలో, విద్యార్థులు, సన్యాసులు, పండితులు, వివిధ రంగాలకు చెందిన పౌరులు సహా దాదాపు 1,00,000 మంది పాల్గొనే ఈ పవిత్ర భగవద్గీత లక్ష కంఠ పారాయణ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
ఉడిపిలోని శ్రీ కృష్ణ మఠాన్ని 800 సంవత్సరాల క్రితం ద్వైత వేదాంత తత్వశాస్త్ర స్థాపకుడు శ్రీ మధ్వాచార్యులు స్థాపించారు. త్రివర్ణ పతాకాలతో ప్రధానమంత్రికి స్వాగతం పలికేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరైనారు.
ఈ కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ గోవాకు వెళతారు. అక్కడ శ్రీ సంస్థాన్ గోకర్ణ్ పార్తగలి జీవోత్తం మఠం 550వ వార్షికోత్సవాల్లో పాల్గొంటారు. ఈ మధ్యాహ్నం దక్షిణ గోవాలోని పత్రాగౌలిలో 77 అడుగుల రాముడి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. రామాయణ థీమ్ పార్క్‌ను కూడా ఆయన ప్రారంభిస్తారు. అలాగే స్మారక పోస్టల్ స్టాంపు , నాణెంను విడుదల చేయనున్నారు.

#WATCH | Udupi, Karnataka | Prime Minister Narendra Modi visits Sri Krishna Matha in Udupi and participates in the Laksha Kantha Gita Parayana programme.
The Prime Minister also inaugurated the Suvarna Teertha Mantapa, located in front of the Krishna sanctum, and dedicated the… pic.twitter.com/vEzbeasjUS— ANI (@ANI) November 28, 2025


