breaking news
russian president
-
నేడు భారత్ కు రానున్న రష్యా అధ్యక్షుడు పుతిన్
-
పుతిన్ పర్యటనకు ఫుల్ సెక్యూరిటీ
న్యూఢిల్లీ: స్నైపర్లు, డాగ్ స్క్వాడ్, డ్రోన్లు, జామర్లు, ఏఐ ఆధారిత ఐదంచెల భద్రతా వ్యవస్థ. ఇవన్నీ ఏమిటో తెలుసా? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన సందర్భంగా చేస్తున్న అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు! రష్యా నుంచి పుతిన్‌తో పాటు వెంట వచ్చే ప్రెసిడెంట్ బాడీగార్డులు, ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్విస్‌కు చెందిన అత్యంత సుశిక్షితులైన సిబ్బంది ఈ ఏర్పాట్లకు అదనం. వీరంతా కాకుండా భారత నేషనల్ సెక్యూరిటీ గార్డ్ విభాగానికి చెందిన టాప్ కమెండోలు ఎటూ రంగంలోకి దిగుతారు. ఇలా మొత్తమ్మీద పుతిన్ భారత పర్యటనకు భద్రతా ఏర్పాట్లు ఏకంగా అమెరికా అధ్యక్షుని పర్యటనను కూడా మించే స్థాయిలో సాగుతున్నాయి! ముందే రంగంలోకి 40 మంది ఉన్నతాధికారులు → పుతిన్ పర్యటన తాలూకు భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం రష్యా నుంచి ఏకంగా 40 మందికి పైగా రక్షణ శాఖ ఉన్నతాధికారులు ముందే రంగంలోకి దిగారు. → వారు ఢిల్లీ చేరుకుని తమ అధ్యక్షుని భద్రతకు సంబంధించిన ప్రతి సూక్ష్మ అంశాన్నీ భూతద్దంలో మరీ పరిశీలిస్తున్నారు. → పుతిన్ కాన్వాయ్ వెళ్ళే ప్రతి మార్గాన్నీ ఢిల్లీ పోలీసులు, ఎన్ఎస్జీ సిబ్బందితో కలిసి జల్లెడ పడుతున్నారు. → అంతేగాక కాన్వాయ్ పై నిరంతర నిఘా కోసం రష్యా అధికారులు ఏకంగా ఒక డ్రోన్ కార్యాలయమే తెరిచారు! → పుతిన్ వెళ్లే మార్గాలన్నింటినీ ప్రత్యేక శిక్షణ పొందిన రష్యా స్నైపర్లు డేగ కళ్లతో పరిశీలిస్తూ ఉంటారు. → ఇక సాంకేతిక పరిజ్ఞానాన్ని అయితే అత్యున్నత స్థాయిలో ఉపయోగిస్తున్నారు. → కృత్రిమ మేధ(ఏఐ), ఫేషియల్ రికగి్నషన్ కెమెరాలు అంగుళం అంగుళాన్నీ వారికి అతి స్పష్టంగా పట్టి చూపనున్నాయి. → మొత్తం సెక్యూరిటీ ఛత్రంలో ఎన్ఎస్జీ కమెండోలు, ఢిల్లీ పోలీసులు బయటి అంచెలకే పరిమితం అవుతారు. → మిగతా నాలుగు లోపలి అంచెలనూ రష్యా భద్రతా వర్గాలే చూసుకుంటాయి. → పుతిన్, మోదీ కలిసి ఉన్నప్పుడు మాత్రం ప్రధాని భద్రతా ఏర్పాట్లు చూసే ఎన్ఎస్జీ, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కమెండోలు రష్యా స్పెషల్ ఫోర్సెస్ సిబ్బందితో పాటుగా లోపలి వలయంలోకి వస్తారు. → పుతిన్ బస చేసే హోటల్‌ను రష్యా వేగులు ఇప్పటికే జల్లెడ పట్టేశారు. → ఆయన వెళ్లే ఇతర ప్రాంతాలన్నింటినీ వారు తరచూ పరీక్షిస్తున్నారు. బిజీ బిజీ! ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు భారత్, రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు పుతిన్ గురువారం మన దేశానికి రానున్నారు. సాయంత్రం కల్లా ఆయన ఢిల్లీలో భేటీ అవకాశముంది. రాత్రి మోదీ ఆయనకు విందు ఇస్తారని సమాచారం. శుక్రవారం రాష్ట్రపతి భవన్లో పుతిన్‌కు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలకనున్నారు. అనంతరం రాజ్ ఘాట్‌లో మహాత్ముని సమాధిని సందర్శించి నివాళులు అర్పిస్తారు. సాయంత్రం హైదరాబాద్ హౌస్‌లో శిఖరాగ్రంలో పాల్గొంటారు. రాత్రి భారత్ మండపంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలను పుతిన్ తిలకిస్తారు. తర్వాత రాష్ట్రపతి భవన్ చేరుకుంటారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇచ్చే ప్రభుత్వ విందులో పాల్గొంటారు. అసలు హైలెట్ ఆ కారే! ఆరస్ సెనట్. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన లగ్జరీ కార్లలో ఒకటి. పుతిన్ కాన్వాయ్ మొత్తంలోకెల్లా అసలు హైలెట్ అదే. ఎలాంటి పెను దాడినైనా తట్టుకుని నిలిచే సామర్థ్యం ఈ కారుకు ఉంది. వెనువెంటనే ప్రతిదాడి చేసేందుకు అనువుగా ఇందులో అనేక అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. ఇది అన్ని విధాలా శత్రు దుర్భేద్యం. అందుకే దీన్ని ముద్దుగా ‘నడిచే దుర్గం’ అని పిలుచుకుంటూ ఉంటారు. ఈ లిమోజిన్‌ను ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలిస్తున్నారు. ఇటీవల చైనాలో షాంఘై సహకార శిఖరాగ్రం సందర్భంగా మోదీ ఈ కారులోనే పుతిన్‌తో కలిసి విహరించడం విశేషం. → ఆరస్ సెనట్ కారును 2018లో పుతిన్ కాన్వాయ్‌లో చేర్చారు. → నాటినుంచి అది ఆయన అధికారిక ప్రభుత్వ వాహనంగా ఉంటోంది. → ప్రభుత్వ అవసరాల నిమిత్తం తయారు చేసే సాయుధ వాహనాల కోసం ఉద్దేశించిన కోర్టెజ్ ప్రాజెక్టులో భాగంగా ఈ లిమోజిన్‌ను తయారు చేశారు.రక్షణ మంత్రుల భేటీ నేడు భారత, రష్యా రక్షణ మంత్రులు రాజ్ నాథ్ సింగ్, ఆండ్రే బెలెసోవ్ గురువారం ఢిల్లీలో భేటీ కానున్నారు. మరిన్ని ఎస్–400 గగనతల రక్షణ వ్యవస్థల కొనుగోలు, సుఖోయ్–30 యుద్ధ విమానాల ఆధునీకరణలతో పాటు రష్యా నుంచి కీలక సైనిక సామగ్రి కొనుగోలు ప్రధాన ఎజెండా కానుంది. పుతిన్ బృందంలో భాగంగా బెలోసోవ్ భారత్ వస్తున్నారు. పుతిన్, మోదీ శిఖరాగ్రానికి ఒక రోజు ముందు రక్షణ మంత్రుల కీలక భేటీ జరుగుతోంది. అత్యంత అధునాతనమైన ఎస్–500 డిఫెన్స్ వ్యవస్థల కొనుగోలు ప్రతిపాదనలను కూడా రాజ్‌నాథ్ ఈ సందర్భంగా బెలోసోవ్ ముందు ఉంచవచ్చని సమాచారం. సుఖోయ్–57 యుద్ధ విమానాలను భారత్‌కు సరఫరా చేసే యోచన ఉందని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ మంగళవారమే తెలిపారు. ఐదో తరం యుద్ధ విమానాల కోసం భారత్ ప్రయతి్నస్తున్న నేపథ్యంలో ఈ అంశమూ చర్చకు వచ్చే అవకాశం ఉంది. -
భారత్-రష్యా ఒప్పందాలపై అంచనాలు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో భారతదేశంలో పర్యటించనుండడం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఇరు దేశాల వ్యూహాత్మక సంబంధాలపై చర్చ జరుగుతోంది. సంప్రదాయంగా బలమైన మిత్ర దేశాలైన భారత్, రష్యాల మధ్య ఈ పర్యటనలో కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉన్నట్లు కొందరు అంచనా వేస్తున్నారు.తగ్గిన చమురు కొనుగోళ్లు..రష్యా-ఉక్రెయిన్ వివాదం తరువాత అమెరికా ఆంక్షల నేపథ్యంలో రష్యా భారత్‌కు చౌకగా ముడి చమురును అందించింది. దీంతో భారత్ చమురు దిగుమతుల్లో రష్యా ప్రధాన సరఫరాదారుగా అవతరించింది. అయితే, ఇటీవల కాలంలో ధర పరిమితుల సమస్యలు, చెల్లింపుల విధానాల్లోని క్లిష్టత, దేశీయ అవసరాల సర్దుబాటు కారణంగా భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొంతమేరకు తగ్గించుకుంది. దాంతోపాటు భారత్‌పై అమెరికా ఆంక్షలు విధించడంతో చమురు కొనుగోళ్లు తగ్గాయి.భారత్-రష్యా స్నేహానికి ఆర్థిక మూలస్తంభంగా ఉన్న ఈ కొనుగోళ్ల తగ్గింపు రష్యాకు కొంత ఆర్థిక ఒత్తిడిని పెంచుతోంది. ఈ సమయంలో పుతిన్ పర్యటన జరగడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ పర్యటన కేవలం రక్షణ లేదా ఎనర్జీ రంగాలకే పరిమితం కాకుండా రష్యాకు వివిధ మార్గాల్లో చేదోడుగా నిలిచే కొత్త ఆర్థిక, వ్యూహాత్మక ఒప్పందాలను అన్వేషించేందుకు ఉపయోగపడనుంది.కీలక ఒప్పందాలపై అంచనా..భారత్‌కు రష్యా అతిపెద్ద రక్షణ భాగస్వామి. ఈ పర్యటనలో అత్యంత కీలకమైన ఒప్పందాలు ఈ రంగంలోనే కుదిరే అవకాశం ఉంది. S-400 ట్రయంఫ్ క్షిపణి రక్షణ వ్యవస్థ డెలివరీలు, దాని భవిష్యత్తు నిర్వహణపై డీల్స్ కుదిరే అవకాశం ఉంది. AK-203 అసాల్ట్ రైఫిల్స్ తయారీకి సంబంధించిన వెంచర్లపై ఒప్పందం. అత్యాధునిక రక్షణ సాంకేతికత అభివృద్ధిలో సంయుక్త పరిశోధన, అభివృద్ధి డీల్స్ జరిగే అవకాశం ఉంది.చమురు, రక్షణ పరికరాల కొనుగోళ్ల విషయంలో డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించడం ఇరు దేశాల లక్ష్యం. దీని కోసం దేశీయ కరెన్సీలైన రూపాయి, రూబుల్ ద్వారా చెల్లింపులు జరిపే సుస్థిర యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడంపై కీలక ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఇది రష్యాపై ఉన్న అంతర్జాతీయ చెల్లింపుల ఆంక్షల ప్రభావాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.అంతరిక్ష, అణు శక్తి సహకారంభారతదేశంలో రష్యన్ సాంకేతికతతో నిర్మిస్తున్న కూడంకుళం అణు విద్యుత్ ప్లాంట్ తదుపరి యూనిట్ల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు ఒప్పందాలు. గగన్‌యాన్ వంటి భారత అంతరిక్ష కార్యక్రమాలకు రష్యా సహకారం, సంయుక్త ఉపగ్రహ నిర్మాణ ప్రాజెక్టులపై చర్చలు జరిగే అవకాశం ఉంది.కొత్త డీల్స్చమురు కొనుగోళ్లు తగ్గిన నేపథ్యంలో రష్యా భారత్ నుంచి ఆర్థికంగా, వ్యూహాత్మకంగా ప్రయోజనం పొందేందుకు కొన్ని కొత్త రకాల డీల్స్‌కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఆంక్షల ప్రభావం తక్కువగా ఉన్న రంగాలపై దృష్టి సారిస్తూ భారత్ నుంచి రష్యాకు వ్యవసాయ ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్స్ (ముఖ్యంగా జెనరిక్ మందులు), ఐటీ సేవలను పెద్ద ఎత్తున ఎగుమతి చేసుకునేందుకు ప్రోత్సాహం లభిస్తుంది. రష్యా ఈ రంగాల్లో భారత్‌ను సుస్థిర సరఫరాదారుగా గుర్తించడానికి ఒప్పందం కుదిరే అవకాశం ఉంది.రవాణా కారిడార్లుఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్‌ఫోర్ట్ కారిడార్ కార్యకలాపాలను వేగవంతం చేయడంపై ఇరు దేశాలు ఆసక్తిగా ఉన్నాయి. ముంబైని రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్తో కలుపుతూ ఇరాన్ మీదుగా సాగే ఈ కారిడార్ పశ్చిమ దేశాల ద్వారా కాకుండా, ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాన్ని అందిస్తుంది. ఇది రష్యా తన వస్తువులను ఇతర దేశాలకు తరలించడానికి కీలక వ్యూహాత్మక ప్రత్యామ్నాయం అవుతుంది.సహజ వాయువుచమురు కొనుగోళ్లు తగ్గినప్పటికీ రష్యా తన లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) అమ్మకాలను భారత్‌లో పెంచేందుకు ప్రయత్నించవచ్చు. ముఖ్యంగా ఆర్కిటిక్ ప్రాంతంలోని ఇంధన ప్రాజెక్టుల్లో భారత పెట్టుబడులు పెంచేందుకు ఒప్పందాలు కుదరవచ్చు. ఈ డీల్స్ దీర్ఘకాలికంగా భారత్‌కు ఎనర్జీ సెక్యూరిటీను, రష్యాకు స్థిరమైన నిధులను అందిస్తాయి.ఇదీ చదవండి: వెండికి హాల్‌మార్కింగ్.. వజ్రాభరణాలపై ఫ్రేమ్‌వర్క్ -
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనకు తేదీలు ఖరారు
న్యూఢిల్లీ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలోనే భారత్‌లో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు పుతిన్ డిసెంబర్ 4-5 తేదీలలో భారతదేశాన్ని సందర్శించనున్నారు. ఈ పర్యటనలో చమురు కొనుగోళ్లు, రక్షణ మరియు వాణిజ్యం వంటి కీలక అంశాలపై చర్చలు ఉంటాయని భావిస్తున్నారు.దేశ అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము కూడా రాష్ట్రపతి భవన్లో పుతిన్‌కు స్వాగతం పలుకుతారు. ఆయన గౌరవార్థం విందును ఏర్పాటు చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు, రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 23వ ఇండియా-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి 2025 డిసెంబర్ 4-5 తేదీలలో భారతదేశంలో అధికారిక పర్యటన చేస్తారు" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.చదవండి: లక్ష కంఠ గీతా పారాయణం : ప్రధానికి ఘన స్వాగతంపుతిన్ తన భారత పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ కూడా చర్చలు జరుపుతారు. పుతిన్ పర్యటన భారత, రష్యా ద్వైపాక్షిక సంబంధాలలో పురోగతిని సమీక్షించడానికి, ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై అభిప్రాయాల మార్పిడికి అవకాశాన్ని కల్పిస్తుందని ప్రభుత్వం తెలిపింది.ఈ ఏడాది ఆగస్టులో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాస్కో పర్యటన సందర్భంగా పుతిన్ భారత పర్యటనను ప్రకటించారు. అయితే, ఆ సమయంలో తేదీలను ఖరారు చేయలేదు. తరువాత షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ, పుతిన్ చైనాలో సమావేశమయ్యారు.ఇదీ చదవండి: రూ. 300తో ఇంటినుంచి పారిపోయి...ఇపుడు రూ. 300 కోట్లు -
అద్వితీయ క్షిపణిని పరీక్షించిన రష్యా
మాస్కో: అపరిమితమైన దూరంలోని లక్ష్యాన్ని సైతం చేధించే అద్వితీయ క్షిపణి ‘బురేవేస్ట్నిక్’ను విజయవంతంగా పరీక్షించామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదివారం ప్రకటించారు. అణుఇంజిన్ అందించే అసాధారణ శక్తితో ఇది గంటల తరబడి గాల్లో ప్రయాణించగలదు. ఆదివారంనాటి పరీక్షలో ఇది ఏకధాటిగా 15 గంటలపాటు గాల్లోనే దూసుకెళ్లిందని దాదాపు 14,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించిందని పుతిన్ ప్రకటించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఇతర సైనిక కమాండర్లతో వర్చువల్ భేటీలో పుతిన్ స్వయంగా ఈ వివరాలు వెల్లడించడం విశేషం. తక్కువ ఎత్తులో అపరిమిత దూరాలకు ప్రయాణించే ఈ క్షిపణిని తయారుచేయబోతున్నట్లు 2018లో రష్యా తొలిసారిగా ప్రకటించింది. అయితే ఈ క్షిపణి సమర్థతపై పశ్చిమదేశాలు అనుమానం వ్యక్తంచేశాయి. రెండేళ్ల క్రితమే పూర్తిస్థాయి క్షిపణిని తయారుచేశామని పుతిన్ చెప్పారు. అయితే 2016 ఏడాది నుంచి ఇప్పటిదాకా 13 సార్లు ఈ క్షిపణిని పరీక్షించగా రెండుసార్లు మాత్రమే పాక్షికస్థాయిలో లక్ష్యాన్ని చేధించిందని ఒక నిరాయు«దీకరణ ఉద్యమ సంస్థ పేర్కొంది. న్యూక్లియర్ ప్రొపల్షన్ యూనిట్‌ను తయారుచేయడం చాలా కష్టమైన వ్యవహారమని ఇంటర్నేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్ సంస్థ అభిప్రాయపడింది. అయితే తమ క్షిపణి 10వేల నుంచి 20వేల కిలోమీటర్ల పరిధి సామర్థ్యంతో పనిచేస్తుందని రష్యా ఆర్మీ చెబుతోంది. భూమి నుంచి కేవలం 50 లేదా 100 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తుండటం కారణంగా ఇతర దేశాల గగనతల రక్షణ వ్యవస్థలు ఈ మిస్సైల్ రాకను గుర్తించలేవు. గాల్లో ఘన ఇంధన రాకెట్ బూస్టర్ల సాయంతో ప్రయోగించాక ఇది ప్రయాణాన్ని అణు ఇంజిన్‌తో కొనసాగిస్తుందని నాటో వర్గాలు అంచనావేస్తున్నాయి. దీనికి స్కైఫాల్ అని పేరుపెట్టుకున్నాయి. ఉక్రెయిన్‌లో తాము ఆక్రమించిన జాయింట్ స్టాఫ్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ కేంద్రాన్ని సా యుధ బలగాల సుప్రీం కమాండర్ హోదాలో పుతిన్ పుతిన్ ఆదివారం సందర్శించినట్లు వార్తలొచ్చాయి. చీఫ్ జనరల్ స్టాఫ్ జనరల్ వలేరీ గెరసిమోవ్ సారథ్యంలోని కమాండర్లతో పుతిన్ భేటీ అయ్యారు. కీలకమైన మార్గాల్లో 10,000 మందికిపైగా ఉక్రెయిన్ సైన్యాన్ని చుట్టుముట్టామని వలేరీ పుతిన్‌కు వివరించారు. ఏకంగా 31 బెటాలియన్ల ఉక్రెయిన్ సైన్యాన్ని చుట్టుముట్టామని తెలిపారు. -
పుతిన్‌తో జైశంకర్ భేటీ
మాస్కో: భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ గురువారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమయ్యారు. రాజధాని మాస్కోలో జరిగిన ఈ సమావేశంలో భారత్–రష్యా సంబంధాలపై వారు చర్చించుకున్నట్లు సమాచారం. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు ప్రతీకారంగా భారత ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో పుతిన్‌తో జైశంకర్ సమావేశమై చర్చించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పుతిన్‌తో భేటీ అనంతరం జైశంకర్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఉక్రెయిన్ విషయంలో తాజా పరిణామాలను తనతో పంచుకున్నందుకు పుతిన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలిపానని చెప్పారు. రష్యా ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డెనిస్ మంతురోవ్, విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో తన భేటీ వివరాలను పుతిన్‌కు వివరించానని స్పష్టంచేశారు. -
వచ్చే వారంలో ట్రంప్‌తో భేటీ
మాస్కో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వచ్చే వారం సమావేశమవ్వాలని భావిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. బహుశా యూఏఈలో శిఖరాగ్రం జరిగే అవకాశముందన్నారు. మూడేళ్లుగా కొనసాగిస్తున్న యుద్ధానికి ముగింపు పలకాలంటూ అమెరికా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా ఒత్తిళ్లు తెస్తున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. యూఏఈ అధ్యక్షుడు జాయెద్ అల్ నహ్యాన్తో క్రెమ్లిన్‌లో జరిగిన భేటీ అనంతరం పుతిన్ ఈ ప్రకటన చేశారు. ప్రతిపాదన తమదే అయినా, ఇరు దేశాలు ఈ భేటీపై ఆసక్తితో ఉన్నాయన్నారు. చర్చల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పాల్గొంటారా అన్న ప్రశ్నకు పుతిన్..ఇందుకు తాను వ్యతిరేకం కాదని గతంలోనూ అనేక పర్యాయాలు చెప్పానన్నారు. అయితే, ఇందుకు కొన్ని పరిస్థితులు అనుకూలించాల్సి ఉందన్నారు. అంతకుముందు, రష్యా విదేశాంగ శాఖ సలహాదారు యూరి ఉషకోవ్ మాట్లాడుతూ.. శిఖరాగ్రం వచ్చే వారం జరిగే అవకాశాలున్నాయని తెలిపారు. ఇందుకు వేదికపై సూత్రప్రాయ అంగీకారం కుదిరినట్లు వెల్లడించారు. తేదీలింకా ఖరారు కాలేదన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఈ భేటీలో పాల్గొనే ఛాన్సుందన్న వార్తలను ఉషకోవ్ కొట్టిపారేశారు. పుతిన్, ట్రంప్ భేటీ విజయవంతం, ఫలవంతం కావాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. యుద్ధానికి ముగింపు పలికేందుకు గతంలో జెలెన్స్కీ భేటీ ప్రతిపాదన తెచ్చినా పుతిన్ పట్టించుకోలేదు. తాజాగా, పుతిన్ వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్ష భవనం స్పందించలేదు. యుద్ధం ఆపకుంటే ఆర్థికపరమైన కఠిన ఆంక్షలను విధిస్తామని ట్రంప్ చేసిన హెచ్చరికల గడువు శుక్రవారంతో ముగియనుంది. ట్రంప్–పుతిన్ శిఖరాగ్రం తమ వైఖరిని స్పష్టంగా తెలియజేసేందుకు ఒక అవకాశమని రష్యా బుధవారం వ్యాఖ్యానించింది. అరుదైన ఖనిజాల వెలికితీత వంటి అంశాల్లో ఉమ్మడి పెట్టుబడులకు ఆర్థిక అవకాశాలపైనా చర్చలు జరపవచ్చని తెలిపింది.యుద్ధానికి వ్యతిరేకంగా ఉక్రేనియన్లు2022తో పోలిస్తే రష్యాతో జరిగే యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించాలని ఎక్కువమంది ఉక్రెయిన్ ప్రజలు కోరుకుంటున్నారు. యుద్ధం మొదలైన కొత్తలో చేపట్టిన ఓ సర్వేలో విజయం సాధించేదాకా పోరాడాల్సిందేనంటూ మూడొంతుల మంది గట్టిగా కోరుకున్నారు. తాజాగా ఇటీవల చేపట్టిన సర్వేలో మాత్రం ఇందుకు విరుద్ధమైన ఫలితాలు వచ్చాయి. యుద్ధానికి కొనసాగించాలనుకునే వారి సంఖ్యలో గణనీయంగా తగ్గుదల కనిపించింది. త్వరగా యుద్ధానికి ముగింపు పలికి, రష్యాతో ఒప్పందానికి రావాలని మూడొంతుల మంది కోరుకుంటున్నారని వెల్లడైంది. రష్యా ఆధీనంలోని భాగాలు మినహా మిగతా ప్రాంతాల్లోని 15 ఏళ్లు పైబడిన వెయ్యి మంది నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నామని సర్వే నిర్వాహకులు తెలిపారు. -
త్వరలో భారత్‌కు పుతిన్ రాక
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. పర్యటన తేదీలను ఖరారు చేసేందుకు జరుగుతున్న చర్చలు తుది దశలో ఉన్నాయని జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ ధోవల్ గురువారం తెలిపారు. పుతిన్ ఆగస్ట్ ఆఖర్లో పర్యటించే అవకాశముందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన వెల్లడించారు. పర్యటన తేదీలు, సమయంపై మరింత స్పష్టత రావాల్సి ఉందన్నారు. పర్యటన ఈ ఏడాది చివర్లో ఉంటుందని స్పష్టం చేశారు. అమెరికాతో వాణిజ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పుతిన్ పర్యటన అంశం తెరపైకి రావడం గమనార్హం. పుతిన్ పర్యటన భారత్ ప్రపంచ దేశాలతో నెరుపుతున్న రాజకీయ వ్యూహంలో కీలక పరిణామం కానుంది. సరిగ్గా, ట్రంప్ బెదిరింపుల వేళ పుతిన్ పర్యటన వార్త భారత్–రష్యాల మైత్రీ బంధం ఎంత బలమైందో చెప్పకనే చెబుతోంది. రష్యా నుంచి చమురును పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్‌పై యుద్ధానికి భారత్ ఆజ్యం పోస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా నిందించడం, టారిఫ్ పెంచుతూ బుధవారం హెచ్చరికలు చేయడం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే ఎన్ఎస్ఏ ధోవల్ మాస్కో వెళ్లడం గమనార్హం. క్రెమ్లిన్‌లో గురువారం ఆయన అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమయ్యారు. అనంతరం మాస్కోలో ధోవల్ స్పుతి్నక్ న్యూస్‌తో మాట్లాడారు. భారత్–రష్యా బంధం ఎంతో ప్రత్యేకమైందని పేర్కొన్నారు. ‘భారత్–రష్యాలది చాలా ప్రత్యేకమైన, సుదీర్ఘ సంబంధం. రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మేం ఎంతో విలువైందిగా భావిస్తున్నాం. మా మధ్య కొనసాగుతున్న ఉన్నత స్థాయి సంబంధాలు, బంధాన్ని బలీయంగా మార్చడంలో ఎంతో సాయపడ్డాయి’అని ధోవల్ పేర్కొన్నారు. ‘రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌లో చేపట్టే పర్యటనపై మేం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. పర్యటన తేదీలు దాదాపుగా ఖరారయ్యాయి. ఇరు దేశాల నేతల మధ్య జరిగే శిఖరాగ్రం ఎంతో కీలకం కానుంది’ అని ధోవల్ వివరించారు. ‘ఈ శిఖరాగ్రం ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కొత్త దిశానిర్దేశం చేయనుంది. వీరి మధ్య జరిగే చర్చలు స్పష్టమైన, గణనీయమైన ఫలితాలను అందివ్వనున్నాయి’ అని దోవల్ ఆశాభావం వ్యక్తం చేసినట్లు టాస్ వార్తా సంస్థ పేర్కొంది. ఇలా ఉండగా, ముడి చమురు దిగుమతులపై పశి్చమ దేశాలు విధించిన ఆంక్షల ప్రభావంపైనా ధోవల్ రష్యా ఉన్నతాధికారులతో చర్చించారు. ఒప్పందం ప్రకారం మిగతా రెండు ఎస్–400 క్షిపణి రక్షణ వ్యవస్థలను సాధ్యమైనంత త్వరగా అందజేయాలని కోరారు. -
పుతిన్‌తో ట్రంప్ ప్రతినిధి విట్కాఫ్ భేటీ
మాస్కో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్ శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమా వేశమయ్యారు. ఉక్రెయిన్‌తో కాల్పుల విర మణ ఒప్పందం కుదుర్చుకునేందుకు ముందుకు రావాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్‌పై ఒక అంగీకారానికి వచ్చే విష యమై సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో అధ్యక్షుడు పుతిన్‌తో విట్కాఫ్ నాలుగు గంటలకుపైగా చర్చలు జరిపారని, ఇవి ఫలవంతమయ్యా యని ప్రత్యేక ప్రతినిధి కిరిల్ దిమిత్రియేవ్ చెప్పారు. అమెరికా, రష్యాల మధ్య సంబంధాలను సాధారణ స్థాయికి తెచ్చే ప్రక్రియ సాగుతున్నందున చర్చల్లో కీలక పురోగతి సాధించొచ్చన్న ఊహాగానాలు చేయవద్దని అంతకుముందు దిమిత్రియేవ్ వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా, ఈ ఏడాదిలో పుతి న్, విట్కాఫ్ల మధ్య జరిగిన మూడో భేటీ ఇది. రష్యా అధ్యక్షుడు పుతిన్ వైఖరిని శుక్ర వారం ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ‘ఇది మతిలేని యుద్ధం, వేలాదిగా జనం చ నిపోతున్నారు. కాల్పుల విరమణకు రష్యా ముందుకు రావాలి’అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం జర్మనీని విడదీసినట్లుగానే ఉక్రెయిన్ ను రెండుగా చీల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వస్తున్న వార్తలను ఉక్రెయిన్ దూత కీత్ కెల్లాగ్ ఖండించిన నేపథ్యంలో ట్రంప్ ఈ మేరకు స్పందించడం గమనార్హం. పశ్చిమ ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాల నియంత్రణను బ్రిటన్, ఫ్రాన్సు బలగాలకు అప్పగించే ప్రతిపాదన ఉన్నట్లు కెల్లాగ్ తెలిపారని టైమ్స్‌లో ఓ కథనం వెలువడింది. అనంతరం దీనిని కెల్లాగ్ ఖండించారు. తన వ్యాఖ్యలను వక్రీ కరించారని చెప్పారు. కాల్పుల విరమణ అనంతరం ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని పరిరక్షించేందుకు వీలుగా సైనిక మద్దతి వ్వాలని చెప్పానే తప్ప, విభజన గురించి మాట్లాడలేదన్నారు. -
యుద్ధానికి పాక్షిక విరామం
వాషింగ్టన్/మాస్కో: రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి తెర దించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. రష్యా, అమెరికా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, డొనాల్డ్ ట్రంప్ మంగళవారం జరిపిన ఫోన్ చర్చలు ఇందుకు వేదికయ్యాయి. ఉక్రెయిన్‌పై దాడులకు పాక్షికంగా విరామమిచ్చేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సుముఖత వ్యక్తం చేశారు. అందులో భాగంగా మౌలిక వనరులు, విద్యుదుత్పత్తి, ఇంధన వ్యవస్థలు తదితరాలపై దాడులు జరపబోమని ప్రతిపాదించారు.అయితే అందుకు ప్రతిగా అమెరికా, దాని మిత్ర దేశాలు ఉక్రెయిన్‌కు సైనిక, నిఘా సాయాలను పూర్తిగా నిలిపేయాలని షరతు విధించారు! వాటితో పాటు పలు ఇతర డిమాండ్లతో కూడిన భారీ జాబితాను ట్రంప్ ముందుంచారు. వాటన్నింటికీ ఉక్రెయిన్ అంగీకరించాల్సిందేనని కుండబద్దలు కొట్టారు. గంటకు పైగా జరిగిన సంభాషణలో యుద్ధంతో పాటు అమెరికా, రష్యా ద్వైపాక్షిక సంబంధాలు కూడా ప్రధానంగా చర్చకు వచ్చాయి. పాక్షిక యుద్ధ విరమణకు పుతిన్‌ను ఒప్పించడంలో ట్రంప్ సఫలమైనట్టు చర్చల అనంతరం వైట్‌హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది.యుద్ధం ఆగి శాశ్వత శాంతి నెలకొనాలని అధ్యక్షులిద్దరూ ఏకాభిప్రాయం వెలిబుచ్చనట్టు తెలిపింది. ‘‘తర్వాతి దశలో నల్లసముద్రంలో కాల్పుల విరమణ, చివరగా పూర్తిస్థాయి కాల్పుల విరమణపై సాంకేతిక చర్చలు జరిపేలా అంగీకారం కుదిరింది. అవి పశ్చిమాసియా వేదికగా తక్షణం మొదలవుతాయి’’ అని వివరించింది. అమెరికా, రష్యా మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని కూడా నేతలిద్దరూ నిర్ణయించినట్టు పేర్కొంది. ఈ దిశగా త్వరలో కీలక ఆర్థిక ఒప్పందాలు తదితరాలు కుదరనున్నట్టు వెల్లడించింది.అమెరికా ఇటీవల ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణకు ఉక్రెయిన్ వెంటనే అంగీకరించడం, దానిపై సంతకం కూడా చేయడం తెలిసిందే. ఈ ప్రతిపాదనకు పుతిన్ కూడా సూత్రప్రాయంగా అంగీకరించారు. పలు అంశాలపై స్పష్టత కోసం ట్రంప్‌తో మాట్లాడతానని చెప్పారు. ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమించిన భూములు, జపోరిజియా అణు విద్యుత్కేంద్రం తదితరాలు కూడా తమ మధ్య చర్చకు వస్తాయని సంభాషణకు ముందు ట్రంప్ మీడియాకు తెలిపారు.ఇరు దేశాల మధ్య పంపకాలకు సంబంధించి రష్యాతో ఇప్పటికే చర్చలు మొదలు పెట్టినట్టు కూడా చెప్పారు! ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగినందుకు మూడేళ్లుగా రష్యాపై అమెరికా కఠిన ఆంక్షలను అమలు చేస్తుండటం తెలిసిందే. పుతిన్, ట్రంప్ తాజా చర్చలను చరిత్రాత్మకంగా రష్యా అభివర్ణించింది. వాటి ఫలితంగా ప్రపంచం మరింత సురక్షితంగా మారిందని అభిప్రాయపడింది. యుద్ధానికి ముగింపుపై ఇటీవల సౌదీ అరేబియాలో అమెరికా పలుమార్లు చర్చలు జరపడం తెలిసిందే. పాక్షిక, దశలవారీ కాల్పుల విరమణ ప్రతిపాదనలు, పుతిన్ తాజా షరతులపై ఉక్రెయిన్ స్పందన ఏమిటన్నది తెలియాల్సి ఉంది. -
వచ్చే ఏడాది భారత్‌లో పుతిన్ పర్యటన!
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించే వీలుంది. దశాబ్దాల స్నేహం, బలమైన రక్షణ, వాణిజ్య బంధాలు, పరస్పరసహకారాలతో ఇరుదేశాల ద్వైపాక్షిక బంధం పటిష్టంగా ఉన్న నేపథ్యంలో వార్షిక పర్యటనల్లో భాగంగా వచ్చే ఏడాది పుతిన్ భారత్‌కు రావొచ్చని దౌత్యవర్గాలు మంగళవారం వెల్లడించాయి. పుతిన్ పర్యటన వేళ రష్యా ఏఏ అంశాలపై భారత్‌తో ఒప్పందాలు చేసుకోవచ్చు అనేది ఇంకా ఖరారుకాలేదని తెలుస్తోంది. ఈ ఏడాది జూలైలో భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా రాజధాని మాస్కోలో పర్యటించి పుతిన్‌తో విస్తృతస్థాయి చర్చలు జరిపిన విషయం విదితమే. భారత్, రష్యాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింత బలోపేతంకానుందని మంగళవారం రష్యా అధ్యక్ష కార్యాలయం అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో పుతిన్ భారత పర్యటన ఖాయమని దాదాపు స్పష్టమైంది. మంగళవారం ఆయన భారత సీనియర్ సంపాదకులతో వర్చువల్‌గా మాట్లాడారు. ‘‘ పుతిన్ త్వరలోనే భారత్‌లో పర్యటిస్తారు. అయితే పర్యటన తేదీలపై ఇరుదేశాలు సంప్రదింపులు జరపాల్సి ఉంది’ అని పెస్కోవ్ అన్నారు. అయితే ఏ తేదీల్లో ఎన్ని రోజులు భారత్‌లో పుతిన్ పర్యటిస్తారన్న వివరాలను దిమిత్రీ వెల్లడించలేదు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు మోదీ గత నెలలో కజక్‌స్తాన్‌లో పర్యటించిన విషయం తెల్సిందే. దీర్ఘశ్రేణి క్షిపణులను ఉక్రెయిన్‌కు అందించాలని బైడెన్ సారథ్యంలోని అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పెస్కోవ్ మాట్లాడారు. ‘‘అమెరికా నిర్ణయం ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో మరింత ఆజ్యంపోస్తోంది. యుద్ధం మరింతగా విస్తరించడం ఖాయం. బైడెన్ ప్రభుత్వం యుద్ధానికే మద్దతు పలుకుతోంది. శాంతిస్థాపనకు కాదు. రష్యాపై అధునాతన ఆయుధాల వినియోగానికి అమెరికా పచ్చజెండా ఊపిన నేపథ్యంలో మేం కూడా మా అణ్వస్త్ర విధానాన్ని సవరించాల్సిన సమయమొచ్చింది’’ అని పెస్కోవ్ అన్నారు. అణ్వాయుధ వినియోగానికి సంబంధించిన కీలక దస్త్రంపై పుతిన్ సంతకం చేసిన వేళ పెస్కోవ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
ఆంక్షలపై సమష్టి సమరం
సియోల్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్తరకొరియాలో రెండు రోజుల పర్యటనకుగాను బుధవారం ఉదయం ఆ దేశ రాజధాని ప్యాంగ్యాంగ్ చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అమెరికా సారథ్యంలో రష్యా, ఉ.కొరియాలపై కొనసాగుతున్న ఆంక్షలను ఇరుదేశాలు సమష్టిగా ఎదుర్కొంటాయని పుతిన్ ప్రకటించారు. ఉ.కొరియా పర్యట నకు కొద్ది గంటల ముందు ఆయన ఆ దేశ అధికారిక వార్తా సంస్థకు రాసిన వ్యాసంలో పలు అంశాలను ప్రస్తావించారు.‘‘ ఉక్రెయిన్ విషయంలో మా సైనిక చర్యలను సమర్థిస్తూ, సాయం చేస్తున్న ఉ.కొరి యాకు కృతజ్ఞతలు. బహుళ «ధ్రువ ప్రపంచం సాకారం కాకుండా అవరోధాలు సృష్టిస్తున్న పశ్చిమదేశాలను అడ్డుకుంటాం. పశ్చిమదేశాల చెప్పుచేతల్లో ఉండకుండా సొంత వాణిజ్యం, చెల్లింపుల వ్యవస్థలను రష్యా, ఉ.కొరియాలు అభివృద్ధి చేయనున్నాయి. పర్యాటకం, సాంస్కృతికం, విద్యారంగాలకూ ఈ అభివృద్ధిని విస్తరిస్తాం’’ అని పుతిన్ అన్నారు.ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధ జ్వాలలను మరింత రగిల్చేందుకు కావాల్సిన ఆయుధ సంపత్తిని ఉ.కొరియా సమకూర్చుతుండగా, ఆ దేశానికి అణ్వస్త్ర సామర్థ్యం, క్షిపణుల తయారీ, సాంకేతికతలను రష్యా అందిస్తోందని అమెరికాసహా పశ్చిమ దేశాలు ఆరోపిస్తుండటం తెల్సిందే. ఈ ఆరోపణలను రష్యా, ఉ.కొరియా కొట్టిపారేశాయి. పుతిన్ పర్యటన వేళ ఈ ఆయుధ సాయం, టెక్నాలజీ సాయం మరింత పెచ్చరిల్లే ప్రమాదముందని అమెరికా ఆందోళన వ్యక్తంచేసింది. ఉక్రెయిన్‌తో ఆగదు: అమెరికా‘ఉ.కొరియా బాలిస్టిక్ క్షిపణు లే ఉక్రెయిన్ను ధ్వంసంచేస్తున్నాయి. రష్యా, ఉ.కొరియా బంధం దుష్ప్ర భావం ఉక్రెయిన్‌కు మాత్రమే పరిమితం కాబోదు కొరియా ద్వీపకల్పంపై పడు తుంది’ అని అమెరికా ప్రతినిధి జాన్ కిర్బీ ఆందోళన వ్యక్తంచేశారు. ‘మండలి తీర్మానాలు, శాంతి, సుస్థిరతలకు విఘాతం కల్గించే రీతిలో రష్యా, ఉ.కొరియా సహకారం పెరగొద్దు’ అని దక్షిణకొరియా హెచ్చరించింది. చెత్త నింపిన బెలూన్లను ద.కొరియా పైకి ఉ.కొరియా వదలడం విదితమే. -
ట్రంప్ కంటే బైడెన్ నయం: పుతిన్
మాస్కో: తెంపరితనం, దూకుడుకు మారుపేరైన డొనాల్డ్ ట్రంప్‌తో పోలిస్తే జో బైడెన్‌ను మరోసారి అమెరికా అధ్యక్షుడిగా చూడాలనుకుంటున్నానని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆశాభావం వ్యక్తంచేశారు. రష్యా అధికారిక టీవీ ఛానెల్‌కు బుధవారం ఇచి్చన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పుతిన్ పలు అంశాలపై మాట్లాడారు. ‘‘ రాబోయే అమెరికా ఎన్నికల్లో ఎవరు అధ్యక్షుడు అయినా వారితో రష్యా ప్రభుత్వం కలిసి పనిచేస్తుంది. రష్యా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే ట్రంప్ కంటే బైడెన్ గెలిస్తేనే మంచిదని అనుకుంటున్నా. ఎందుకంటే ఉపాధ్యక్షుడిగానూ, అధ్యక్షుడిగానూ పనిచేసిన బైడెన్‌కు అనుభవం ఎక్కువ. పాతకాలం విధానాలను అవలంభించే నేత ఆయన. ఆయనను కొంత అంచనావేయొచ్చు కూడా. ట్రంప్ ఆలోచనలు అనూహ్యం’ అని అన్నారు. బైడెన్ ఆరోగ్యం సరిగా లేదంటూ వస్తున్న వార్తలపై పుతిన్‌ను ప్రశ్నించగా.. ‘ నేనేమీ డాక్టర్నుకాదు. అయి నా ఇలాంటి ప్రశ్నకు వ్యాఖ్యలు చేయడం సబబు కాదు. అయితే బైడెన్ ఆరోగ్య సమస్యలు వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రభావం చూపగలవు. నేను గమనించినంత వరకు బైడెన్ ఆరోగ్యంగానే ఉన్నారు. అధ్యక్షుడిగా కొనసాగే సత్తా ఆయనకు లేదు అని నేనైతే అనుకోను. పేపర్ వైపు చూసే ప్రసంగం చదువుతారనేది వాస్తవం. నేను కూడా కొన్ని సార్లు ప్రసంగపాఠాన్ని చూసే చదువుతా. అదేమంత పెద్ద విషయం కాదు. ఏదేమైనా బైడెన్ ప్రభుత్వ విధానాలు చాలా తప్పు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన తోనే చెప్పా’’ అని పుతిన్ వెల్లడించారు. -
మనం సక్సెసే కానీ...
రష్యా అధ్యక్షుడు లేడు. చైనా అధినేత రాలేదు. ఉక్రెయిన్‌పై సాగుతున్న రష్యా యుద్ధంపై సభ్య దేశాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. ఒక్కముక్కలో జీ20లో దేశాలు ఏకాభిప్రాయంతో కానీ, ఏక లక్ష్యంతో కానీ ఉన్నట్టు కనిపించదు. అయినా సరే, ఆదివారం ఢిల్లీలో ముగిసిన జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సును ఘనంగా నిర్వహించి, అన్ని దేశాల తరఫునా ఎవరినీ నొప్పించని 83 పేరాల ఏకాభిప్రాయ ప్రకటన, అదీ ఒకరోజు ముందరే చేయించడమనేది అధ్యక్ష స్థానంలో ఉన్న భారత్‌కు అసాధారణ విజయమే! దక్షిణార్ధగోళంలోని వర్ధమాన, పేదదేశాల పక్షాన నిలబడి, వాటి ప్రయోజ నాల్ని సదస్సు అజెండాలో మేళవింపజేయడమూ సామాన్యం కాదు. అలాగే బాలీలో నిరుడు అంగీ కరించినదే అయినా, ఆఫ్రికన్ యూనియన్ (ఏయూ)కు జీ20లో శాశ్వత సభ్యత్వం ఇవ్వడం ద్వారా దక్షిణార్ధగోళానికి తాను సరైన ప్రతినిధినని భారత్ చాటుకున్నట్టయింది. అందుకే, వంతుల వారీగా ఏడాదికొకరికి వచ్చే అధ్యక్షహోదాయే అయినా... జీ20 సారథిగా భారత్ సక్సెస్ కావడం, ప్రపంచ వేదికలో మరో మెట్టు పైకి ఎక్కడం కచ్చితంగా సంతోషించదగ్గ సమయం, సందర్భం. జీ20 సదస్సు ముగింపు వేళ చేసిన ఏకాభిప్రాయ ప్రకటనపై కొన్ని అసంతృప్తులూ లేకపోలేదు. ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధంపై పాశ్చాత్య ప్రపంచం భావిస్తున్న రీతిలో రష్యాను నిలదీయ లేదనీ, నిరుటి బాలీ డిక్లరేషన్ నుంచి పక్కకు జరిగారనీ ఒక వర్గపు అసంతృప్తి. శిలాజ ఇంధనాల వినియోగాన్ని దశల వారీగా మానుకోవడంపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం స్థిరసంకల్పం, చిత్త శుద్ధి లేమిని తెలియజేస్తోందన్నది మరో ప్రధానమైన అసంతృప్తి. జీ20 సదస్సులు ఆయా ఆతిథ్య దేశాల ఘనత చాటుకోవడానికే తప్ప, అసలు పనిలో తూతూమంత్రంగా మారాయనే నింద కొంత కాలంగా ఉన్నదే. అది నిజం కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత జీ20 వేదికదే! తాజా జీ20 లోనూ ప్రకటించిన లక్ష్యాలు బలహీనంగా ఉన్నాయనీ, ఇప్పటికే తాము కట్టుబడిన లక్ష్యాలనే దేశాధి నేతలు వల్లెవేశారని విశ్లేషకుల మాట. వెరసి, నిర్వహణలో పేరుప్రఖ్యాతులతో ఇండియా హిట్టే కానీ, కీలక ప్రపంచ సమస్యలపై నిర్ణయంలోనే సదస్సు విఫలమైందనే మాట మిగిలిపోయింది. చర్చించడానికి ఆహారభద్రత, ఋణాల ఉపశమనం, పర్యావరణ సంక్షోభం, వ్యాధులు, బ్యాంకింగ్ సంస్కరణలు, డిజిటల్ ప్రాథమిక వసతుల లాంటి అనేక ప్రపంచ సమస్యలున్నాయి. కానీ, వాటి పరిష్కారానికి అందరికీ అంగీకారయోగ్యమైన, విశ్వసనీయ కార్యాచరణ జీ20లో లోపించింది. పరస్పర భిన్నమైన 20 దేశాలు సమష్టి ఆశయాలు, ఆలోచనలు, అనుభవాల పునాదిపై కాక ఆర్థిక బలిమి ప్రాతిపదికన ఇలా ఒక వేదికపై చేరడమే అసలు చిక్కు. అందుకే, రానురానూ జీ20 వార్షిక సదస్సు ఫలితాలు ప్రశ్నార్థకమవుతున్నాయి. నిరుటి బాలీ సదస్సుతో పోలిస్తే తాజా సదస్సులో అగ్ర దేశాల మధ్య చీలికలు పెరిగాయి. దానివల్ల సదస్సు ప్రధాన అజెండా పట్టాలు తప్పకుండా భారత్ సంక్లిష్ట దౌత్యవిన్యాసంతో సమతూకం సాధించడం విశేషం. అలాగే, ఉక్రెయిన్ వ్యవహారంలో రష్యాపై ఆంక్షల లాంటివి సమర్థించడంలో దక్షిణార్ధగోళానికి సమస్యలున్నాయని పాశ్చాత్య ప్రపంచం గుర్తించింది. అందుకే, ఆ అంశంపైనే పట్టుబట్టి కూర్చోలేదు. రష్యా కన్నా చైనాతో పెను ముప్పు అని గ్రహించిన అమెరికా చివరకు దక్షిణార్థగోళ దేశాల మాట ఆలకించేందుకు భారత్‌తో నడిచింది. నిజానికి, వరుస ప్రకారమైతే జీ20 సదస్సు మన దేశంలో 2022లో, ఇండొనేషియాలో 2023లో జరగాలి. కానీ, ఇండొనేషియాను మన పాలకులు మెత్తగా ఒప్పించి, ఢిల్లీ స్థానంలో ముందుగా బాలీలో సదస్సు జరిపించారు. సార్వత్రిక ఎన్నికలకు వీలైనంత దగ్గరగా, ఈ ఏడాది మన వద్ద ఈ అంతర్జాతీయ సంబరం జరిగేలా చూడగలిగారు. అదెలా ఉన్నా ఈ సదస్సును దేశానికి గర్వకారణంగా చూపి, సానుకూల ఫలితాల దిశగా మలుచుకోవడంలో మనవాళ్ళు సఫల మయ్యారు. ఏడాది కాలంలో కేంద్ర పాలకులు దేశవ్యాప్తంగా 60కి పైగా పట్నాల్లో, 200కు పైగా సమావేశాలు జరిపారు. సాధారణంగా సామాన్యులకు సంబంధం లేని వ్యవహారంగా అనిపించే సదస్సును సైతం తెలివిగా ప్రజల్లోకి తీసుకువెళ్ళారు. ఈ సదస్సు విజయాన్ని వచ్చే ఎన్నికల్లో సహజంగానే మరింత వాడుకుంటారు. అయితే, సహకార సమాఖ్య విధానాన్నీ, ప్రత్యర్థి పక్షాల మధ్య ద్వైపాక్షికతనూ నమ్మడం వల్లే ఈ సదస్సు ఘనత సాధ్యమైందని సర్కారు వారి మాట. దేశంలోని ప్రతిపక్షాలను కలుపుకొనిపోని వారి నోట ఈ మాట రావడం విడ్డూరమే. సహకార సమాఖ్య లాంటివి పెద్దలు నిజంగా నమ్ముతున్నదీ లేనిదీ నవంబర్ చివర 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ నియామకం, సంఘం నియమావళి ఖరారు వేళ తెలుస్తుంది. ఏమైనా, ఐరాస సర్వప్రతినిధి సభ దాదాపు అచేతనంగా మారిన పరిస్థితుల్లో జీ20 మరింత చొరవ తీసుకోవాలని పరిశీలకుల భావన. అందుకే, ఉక్రెయిన్ యుద్ధ సమస్యలు, పర్యావరణ సంక్షోభానికి కారణమైన శిలాజ ఇంధనాలపై చర్యలు చర్చించకుండానే సదస్సు ముగిసిపోవడంతో నిరుత్సాహపడుతున్నారు. కానీ, సభ్యదేశాల మధ్య సంక్లిష్టతలతో ఆ ఘనత ఒక్క భారత్ చేతు ల్లోనూ లేదని గ్రహించాలి. మొత్తం 19 దేశాలు, యూరోపియన్ యూనియన్‌తో కూడిన జీ20 తాజా ఆఫ్రికన్ యూనియన్ చేరికతో వచ్చే 2024లో బ్రెజిల్ సదస్సు నాటికి జీ21గా పలకరించనుంది. ఆ పై ఏడాది దక్షిణాఫ్రికాలో సమావేశం కానుంది. భారత్ అధ్యక్షతన సాధించిన పురోగతిని ముందుకు తీసుకువెళ్ళడానికే కాదు, అంతర్జాతీయంగా జీ20 ప్రాసంగికతను నిలపడానికీ ఆ రెండు సదస్సులూ కీలకం. ఇప్పటికైతే, ఇండొనేసియా, జర్మనీల కన్నా అనేక రెట్ల ఖర్చుతో ఢిల్లీ సదస్సు జరిగిందని ఆరోపణలు వస్తున్నప్పటికీ, ‘విశ్వగురువు’ ప్రచారం మరింత ఊపందుకున్నందుకు సంబరపడాలి. -
మా దేశంలో కిరాయి సైన్యం లేదు..
మాస్కో: వాగ్నర్ గ్రూప్ ప్రైవేట్ కిరాయి సైనికులకు ఒకే యూనిట్‌గా సేవలందించేందుకు అవకాశం ఇచి్చనట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు. ఇప్పటి వరకు పనిచేసిన విధంగానే అదే కమాండర్ ఆధ్వర్యంలో వారు కార్యకలాపాలు సాగించవచ్చన్నారు. అదే విధంగా, తమ దేశంలో ప్రైవేట్ ఆర్మీ లేదని, అటువంటి వాటికి చట్టబద్ధత లేదని స్పష్టం చేశారు. పుతిన్ 23 ఏళ్ల పాలనలో ఎన్నడూ లేని విధంగా గత నెలలో వాగ్నర్ గ్రూప్ సైనికుల తిరుగుబాటుయత్నం, బెలారస్ అధ్యక్షుడు లుకశెంకో మధ్యవర్తిత్వంతో 24 గంటల్లోనే సద్దుమణగడం తెలిసిందే. ఆ తర్వాత అయిదు రోజులకు జూన్ 29న వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ సహా అందులోని 35 మంది కమాండర్లతో సమావేశమైనట్లు పుతిన్ తాజాగా కొమ్మెర్‌శాంట్ పత్రికకు ఇచి్చన ఇంటర్వ్యూలో చెప్పారు. తిరుగుబాటుయత్నం కారణాలు, పరిస్థితులపై చర్చించానన్నారు. భవిష్యత్తులో పనిచేసేందుకు గల పలు అవకాశాలను వారి ముందుంచినట్లు వెల్లడించారు. ఇప్పటి మాదిరిగానే గ్రే హెయిర్ అనే కమాండర్ ఆధీనంలో పనిచేయడం అందులో ఒకటన్నారు. ఎటువంటి మార్పులు ఉండవని, గ్రూప్‌లోని అందరూ అందులో యథావిధిగా కొనసాగవచ్చని చెప్పానన్నారు. చాలా మంది కమాండర్లు ఈ ఆఫర్‌కు మొగ్గు చూపారన్నారు. అయితే, సమావేశం ముందు వరుసలో కూర్చున్న వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ మాత్రం..తమ వాళ్లకు ఇది నచ్చలేదని చెప్పారన్నారు. అయితే, చివరికి వాగ్నర్ గ్రూప్ ఈ ఆఫర్‌కు అంగీకరించిందీ లేనిదీ పుతిన్ స్పష్టం చేయకపోవడం గమనార్హం. వాగ్నర్ గ్రూప్‌కు ఎలాంటి చట్టబద్ధత లేదని ఈ సందర్భంగా పుతిన్ పేర్కొన్నారు. ‘ప్రైవేట్ మిలటరీ సంస్థలకు సంబంధించి దేశంలో ఎలాంటి చట్టాలు లేవు. కాబట్టి, రష్యాలో ప్రైవేట్ ఆర్మీ లేదు. ప్రైవేట్ మిలటరీ కాంట్రాక్టర్ల విషయమై ప్రభుత్వం, పార్లమెంట్ చర్చించాల్సి ఉంది’అని పుతిన్ వివరించారు. వాగ్నర్ గ్రూప్ కిరాయి సైనికులు రష్యా రక్షణ శాఖతో ఒప్పందానికి రావడం లేదా పొరుగునున్న బెలారస్‌కు వెళ్లిపోవడం, రిటైర్ కావడం వంటి అవకాశాలను ఇచి్చనట్లు గతంలో పుతిన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా ఉండగా, వాగ్నర్ గ్రూప్‌నకు చెందిన కొందరు సభ్యులు బెలారస్లో తమ కార్యకలాపాలు ప్రారంభించినట్లు చెబుతున్నారు. -
Ukraine-Russia War: ఉక్రెయిన్ యుద్ధం ‘విషాదం’: పుతిన్
మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ‘ఓ విషాదం’గా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభివర్ణించారు! ‘‘ఉక్రెయిన్ ప్రజలను మేమెప్పుడూ మా సోదరులుగానే చూశాం. ఇప్పటికీ అలాగే చూస్తున్నాం. ఇప్పుడక్కడ జరుగుతున్నది కచ్చితంగా విషాదమే’’ అని అంగీకరించారు. ఏకపక్షంగా కయ్యానికి కాలు దువ్వి 9 నెలలుగా ప్రపంచమంతటినీ అతలాకుతలం చేస్తున్న ఆయన బుధవారం అత్యున్నత సైనికాధికారులతో భేటీలో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ యుద్ధానికి కారణం పశ్చిమ దేశాలే తప్ప తాము కాదని చెప్పుకొచ్చారు. లక్ష్యాలు సాధించేదాకా ముందుకే వెళ్లి తీరతామని పునరుద్ఘాటించారు. మరోవైపు రష్యా సైన్యం సంఖ్యను ఇప్పుడున్న 10 లక్షల నుంచి 15 లక్షలకు పెంచుతామని రక్షణ మంత్రి సెర్గీ షొయిగూ ప్రకటించారు. వీరిలో దాదాపు 7 లక్షల మంది స్వచ్ఛంద, కాంట్రాక్టు సైనికులుంటారన్నారు. ఫిన్లండ్, స్వీడన్లకు చెక్ పెట్టేందుకు పశ్చిమ రష్యాలో నూతన సైనిక విభాగాలను నెలకొల్పుతామని షొయిగూ ప్రకటించారు. -
తస్మాత్ జాగ్రత్త!
మాస్కో: తమను బెదిరించాలనుకునేవాళ్లు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ శత్రుదేశాలకు వార్నింగ్ ఇచ్చారు. సర్మాత్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను రష్యా విజయవంతంగా పరీక్షించిందని బుధవారం ఆయన ప్రకటించారు. ఈ క్షిపణులకు ఎదురులేదని చెప్పారు. ప్రస్తుతం రష్యా అమ్ములపొదిలో ఉన్న కింజల్, అవాంగార్డ్ క్షిపణులకు సర్మాత్ తోడవనుంది. గతనెల తొలిసారి రష్యా కింజల్ క్షిపణులను ఉక్రెయిన్‌పై ప్రయోగించింది. సర్మాత్ విజయవంతంపై సైంటిస్టులను పుతిన్ అభినందించారు. ఉత్తరరష్యాలో వీటిని ప్రయోగించామని, విజయవంతంగా ఈ క్షిపణి లక్ష్యాన్ని ఛేదించిందని రష్యా రక్షణ శాఖ తెలిపింది. ప్రపంచంలోని సుదూర తీరాలు కూడా ఈ క్షిపణి పరిధిలోకి వస్తాయని వెల్లడించింది. వీటిని నిఘా వ్యవస్థలు కనిపెట్టడం కూడా కష్టమని నిపుణులు తెలిపారు. 200 టన్నులుండే ఈ మిసైల్ భూమి మీద ఏ లక్ష్యాన్నైనా చేరగలదని పుతిన్ ధీమా వ్యక్తం చేశారు. డోన్బాస్లో సాధారణ జనజీవనం నెలకొనేవరకు తమ ప్రయత్నాలు ఆపమని చెప్పారు. మరోవైపు తమ డిమాండ్ల ముసాయిదా ప్రతిపాదనను చర్చల్లో భాగంగా ఉక్రెయిన్‌కు అందించామని రష్యా అధికారులు తెలిపారు. ఇకపై చర్చలు కొనసాగలంటే ఉక్రెయిన్ స్పందించాల్సిఉందన్నారు. చర్చల జాప్యానికి ఉక్రెయినే కారణమని విమర్శించారు. మారియుపోల్‌పై ఫోకస్ కొద్దిమంది ఉక్రెయిన్ సేనలు ప్రతిఘటిస్తున్న మారియుపోల్‌పై రష్యా మరింత ఒత్తిడి పెంచింది. దీంతో పాటు డోన్బాస్లో పలు ప్రాంతాల్లో యుద్ధ తీవ్రతను పెంచింది. మారియుపోల్‌లో ఉక్రెయిన్ సైనికులు తలదాచుకున్న స్టీల్‌ప్లాంట్‌పై రష్యా తీవ్రమైన బాంబింగ్ జరిపినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. స్టీల్మిల్ను తదనంతరం నగరాన్ని స్వాధీనం చేసుకోవడంపైనే రష్యా దృష్టి పెట్టిందన్నారు. నగరం నుంచి పౌరుల తరలింపునకు ప్రాథమిక అంగీకారానికి వచ్చామని ఉక్రెయిన్ ఉప ప్రధాని చెప్పారు. అయితే దీనిపై రష్యా స్పందించలేదు. స్టీల్‌ప్లాంట్‌లో సైనికులు సరెండర్ అవ్వాలని మాత్రం మరోమారు అల్టిమేటం జారీచేసింది. ఈ నేపథ్యంలో నగరవాసులు వీలైనంత త్వరగా నగరం వీడాలని మేయర్ విజ్ఞప్తి చేశారు. తమపై రష్యా అన్ని రకాలుగా పోరు చేస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. తమను లొంగదీçసుకునేందుకు పౌర ఆవాసాలపై కూడా దాడులు చేస్తోందన్నారు. మారియుపోల్, డోన్బాస్ స్వాధీనానికి రష్యా వేలమందిని రంగంలోకి దించిందని పాశ్చాత్య దేశాలు తెలిపాయి. ఉక్రెయిన్‌కు సహాయాన్ని మరింత పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఇందులో భాగంగా ఉక్రెయిన్‌కు నార్వే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను పంపింది. హెవీ ఆర్టిలరీని పంపుతామని కెనెడా ప్రకటించింది. ► డోన్బాస్ రక్షణకు సైనికులను తరలించకుండా అడ్డుకునేందుకు ఉక్రెయిన్ నగరాలన్నింటిపై దాడులు ముమ్మరం చేసిందని బ్రిటన్ రక్షణ శాఖ తెలిపింది. ► ఉక్రెయిన్‌లో శాంతిస్థాపన చర్చలపై చర్చించేదుకు ఉక్రెయిన్, రష్యాల్లో పర్యటిస్తానంటూ ఆయా దేశాధినేతలకు ఐరాస సెక్రటరీ జనరల్ గుటెరస్ లేఖలు రాశారు. ► ఉక్రెయిన్‌కు మరో ప్యాకేజీ ప్రకటిస్తామని అమెరికా తెలిపింది. పలువురు ప్రపంచ నాయకులతో అధ్యక్షుడు బైడెన్ మాట్లాడారు. ► చెర్నోబిల్‌లో రష్యా సైనికులు ఇష్టారీతిన ప్రవర్తించడంతో అణులీకేజి ముప్పు పెరిగిందని ఉక్రెయిన్ ఆరోపించింది. రేడియేషన్ స్థాయిలను కొలిచే పరికరాలను రష్యా సైనికులు దొంగిలించారని తెలిపింది. ► ఉక్రెయిన్ సంక్షోభంతో 50 లక్షలకు పైగా శరణార్థులయ్యారని ఐరాస అంచనా వేసింది. ► రష్యా, బెలారస్ క్రీడాకారులను వింబుల్డన్‌లో నిషేధిస్తున్నట్లు ఆల్ ఇంగ్లండ్ క్లబ్ ప్రకటించింది. ► రష్యాకు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను రద్దు చేస్తున్నట్లు జపాన్ ప్రకటించింది. -
డిసెంబర్ 6న భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 6వ తేదీన భారత్‌కు రానున్నారని విదేశాంగ శాఖ తెలిపింది. అదే రోజు ఆయన ప్రధాని మోదీతో భేటీ అవుతారని తెలిపింది. ఇద్దరు నేతలు ఏడాదికోసారి సమావేశమై రెండు దేశాల నడుమ కొనసాగుతున్న అన్ని రకాల సంబంధాలపై సమీక్ష జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇదే క్రమంలో రష్యా అధ్యక్షుడు, భారత ప్రధాని మధ్య 21వ వార్షిక శిఖరాగ్ర భేటీ జరగనుంది. ] ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ద్వైపాక్షిక సంబంధాలతోపాటు ఉమ్మడి ప్రయోజనకరమైన వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుపుతారని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి శుక్రవారం వెల్లడించారు. దీంతోపాటు, అదే రోజు రెండు దేశాల రక్షణ, విదేశాంగ శాఖల మంత్రుల మధ్య 2+2 చర్చలు కూడా జరుగుతాయని వివరించారు. చదవండి: తైవాన్‌కు మద్దతు తెలిపిన అమెరికా ప్రజాప్రతినిధులు -
పుతిన్ అండ్ పెట్స్
రాజతంత్రాలు రణతంత్రాల మధ్య కాసింత మానసికోల్లాసానికి దేశాధ్యక్షులు ఏం చేస్తారు? విందు వినోదాలు... స్నేహితులతో కాలక్షేపం.... కానీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ అలా కాదు. ఏ మాత్రం టైమ్ దొరికినా అతడు తన పెంపుడు జంతువులతో గడుపుతాడు. మూగ జీవులతో ఆడుకుంటాడు. వాటి బాగోగులు చూడడంలో సంతృప్తి చెందుతాడు. మనుషులంటే ఏవో ఒకటి ఆశిస్తారు. కాని పెంపుడు జంతువులు ఏమీ ఆశించవు. ప్రేమిస్తాయి. ఉత్తినే అలా ప్రేమిస్తూనే ఉంటాయి. అందుకే పుతిన్‌కు అవి అంటే ఇష్టం. ఇలాంటి ఇష్టం ఉన్న దేశాధ్యక్షులు ఎంతమంది? మొన్నామధ్య పుతిన్ దత్తత తీసుకున్న మూడు సైబీరియా పులుల్లో ఒకటి అభయారణ్యపు కంచెలు దాటి చైనాలో అడుగుపెట్టింది. చైనా ఈ సంగతి తెలిసి మరేం ఫరవాలేదనీ తమ అడవుల్లో ఆ పులికి ఆహారం కోసం గొర్రెలనూ, దుప్పులనూ పంపుతామనీ చెప్పింది. అయితే ఆశ్చర్యకరంగా ఆ పులి మరుసటిరోజు చనిపోయి కనిపించింది. ఇది తెలిసి పుతిన్ ఎంత బాధపడ్డాడో చైనా అంత హడలిపోయింది. ఎటొచ్చి ఏం గొడవ వస్తుందో అని. ఒక పెంపుడు జంతువు వల్ల రెండు దేశాల మధ్య స్నేహం చెడిపోయేంత స్థాయిలో పుతిన్‌కు మూగజీవుల పట్ల ఆసక్తి ఉంది. ఇక అతడికి సొంతంగా అనేక శునకాలు ఉన్నాయి. వాటిలో ఇష్టమైనది – ‘యుమె’ అనే ‘అకిటా’ జాతి శునకం. జపాన్‌లో విస్తృతంగా కనిపించే ఈ జాతి శునకాన్ని రష్యాలో, అమెరికాలో, మరికొన్ని దేశాల్లో పెంచుకుంటున్నారు. పరాయివాళ్లతో పూర్తిగా దూరంగా ఉంటూ తన యజమాని కుటుంబంతో చాలా దగ్గరగా మసలే అకిటా జాతి శునకాలు యజమానితో ఆటలాడుతూ ఉల్లాసాన్ని పెంచుతాయి. ప్రేమ పంచుతూ ఆనందాన్నిస్తాయి. ఈ శునకాలతోటే కాదు... మంచు ఎలుగుబంటులు, డాల్ఫిన్లు, పులులు, గుర్రాలు... ఒకటనేముంది పుతిన్ మూగప్రాణుల ఆప్తమిత్రుడు. పూర్వాశ్రమంలో కెజిబి (రష్యా గూఢచార సంస్థ) ఏజెంట్ అయిన పుతిన్ సకల తంత్రాలలోనే కాదు... క్రూరమృగాలతో కూడా ఎలా వ్యవహరించాలో తెలుసుకున్నాడు. వేటగాడిగా కూడా అతడు అవసరమైతే తుపాకీ పట్టగలడు. ఈ విషయాన్ని కూడా అతడు ఫొటోల ద్వారా లోకానికి వెల్లడి చేస్తూ ఉంటాడు. ఇదంతా ఎందుకు అనంటే... ‘నేను మరీ కరడుగట్టిన దేశాధ్యక్షుణ్ణి కాదు. నా గుండెల్లో ప్రేమ ఉంది అని చెప్పడానికే. లేదా నేను ప్రేమనూ పంచగలనూ శత్రువును తుద ముట్టించనూ గలను అని చాటడానికే’ అని ఒక పరిశీలకుడు తేల్చాడు. ఏమైనా రష్యాకు రాజు కూడా మూగజీవుల ప్రేమకు బానిసే అని ఈ ఫొటోల ద్వారా మనకు తెలుస్తోంది. -
గోవాకు ఆలస్యంగా చేరుకున్న పుతిన్
పనాజీ : దట్టమైన పొగమంచు కారణంగా బ్రిక్స్ సమావేశానికి హాజరుకానున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆలస్యంగా గోవాకు చేరుకున్నారు. రష్యా అధ్యక్షుడు షెడ్యూల్ ప్రకారం దాబోలిమ్ విమానాశ్రయం ప్రక్కన ఉన్న ఐఎన్ఎస్ హన్సా బేస్‌కు ఆయన రాత్రి 1 గంటలకు చేరుకోవాల్సి ఉంది. కానీ ఆ ప్రాంతంలో దట్టమైన పొగమంచు కమ్ముకుని ఉండటంతో రష్యా అధ్యక్షుడి విమానం ల్యాండ్ అవడానికి ఆలస్యమైనట్టు నావెల్ బేస్ ప్రకటించింది. మొదటి తెల్లవారుజామున మూడు గంటలకు విమానం ల్యాండ్ అవుతుందని భావించారు. అనంతరం ఆ సమయాన్నిరీషెడ్యూల్ చేసి ఏడు గంటలకు మార్చారు. ఎట్టకేలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ విమానం దాబోలిమ్ విమానాశ్రయానికి ఉదయం10 గంటల ప్రాంతంలో చేరుకుంది. గోవాకు చేరుకున్న అనంతరం పుతిన్, భారత ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. బ్రిక్స్ సమావేశానికి హాజరుకావడానికి ముందు వీరిద్దరూ కాసేపు ముచ్చటించారు. ఐఎన్ఎస్ హన్సా బేస్ నుంచి బ్రిక్స్ సమావేశం జరిగే బెనాలియం గ్రామంలోని హోటల్ ప్రాంతం వరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రష్యా ప్రెసిడెంట్‌ను గ్రాండ్‌గా స్వాగతించడానికి గత రాత్రే పలువురు కేంద్రమంత్రులు, గోవా అధికార ప్రతినిధులు బేస్ ప్రాంతంలో క్యాంపెయిన్ నిర్వహించారు. భారత్ అధ్యక్షతను ఈ సారి బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు గోవాలో జరుగుతోంది. కాగ ఈ సమావేశానికి భారత ప్రధాని నరేంద్రమోదీ నిన్న రాత్రే గోవా చేరుకున్నారు. దక్షిణాఫ్రికా జాకుబ్ జుమా, బ్రెజిల్ అధ్యక్షుడు మిచెల్ టెమర్లు కూడా దాబోలిమ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి భారత ప్రతినిధులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. -
మోదీ యోగా చేస్తున్నారా?
సెయింట్ పీటర్స్ బర్గ్: భారతదేశంలో యోగా విద్యను విస్తరించడానికి శ్రీకారం చుట్టిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆయన కూడా యోగా చేయడానికి సిద్ధమవుతున్నారా?అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సరదాగా వ్యాఖ్యానించారు. భారత్ లో యోగాకు మోదీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ(మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ లో యోగా ఒక భాగం, ఏ-ఆయుర్వేదా, వై-యోగా, యూ-యునానీ)ని కేటాయించారని తెలుసుకున్నపుతిన్ ఈ విధంగా స్పందించారు. సెయింట్ పీటర్స్ బర్గ్ లో జరిగిన అంతర్జాతీ ఆర్థిక ఫోరం సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. నరేంద్ర మోదీ యోగాను విస్తరించాలనుకోవడం అద్భుతమైన చర్యగా ఆయన అభివర్ణించారు. 'తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మీరు పాల్గొంటున్నారా?' అని మీడియా అడిగిన ప్రశ్నకు మాత్రం పుతిన్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. అందరూ యోగా చేయాలనే సిద్దాంతమేమీ లేదు కదా? అని పుతిన్(నవ్వుతూ) తిరిగి ప్రశ్నించారు. -
తొందరపడి నిందలు వేయొద్దు: పుతిన్
ఎంహెచ్-17 విమానం కూల్చివేత విషయంలో దర్యాప్తు పూర్తి కాకుండా తొందరపడి తమ దేశంపై ఓ అంచనాకు వచ్చేయొద్దని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గట్టిగా చెప్పారు. ఈ విషయంలో రాజకీయ ప్రకటనలు ఇవ్వొద్దని ఘాటుగా అన్నారు. ఈ విషయాన్ని క్రెమ్లిన్ ప్రెస్ సర్వీస్ ఓ ప్రకటనలో తెలిపింది. ''ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసీఏఓ) చేసే దర్యాప్తునకు పూర్తి సహకారం అందిస్తామని, మేం సిద్ధంగా ఉన్నామని రష్యా ఎప్పుడో చెప్పింది'' అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం గురించి బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్‌తో పుతిన్ ఆదివారం రాత్రి చర్చించారు. అంతర్జాతీయ సమాజం సహకారంతో వీలైనంత త్వరగా శాంతియుత పరిష్కారం చూసుకోవాలని ఇద్దరూ అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్, రష్యా సరిహద్దుల్లో కాల్పుల విరమణ తప్పనిసరిగా ఉండాలని, అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే దర్యాప్తు తప్పనిసరి అని కామెరాన్ అన్నారు. జర్మనీ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్‌తో కూడా పుతిన్ మాట్లాడారు.


