పుతిన్, ట్రంప్‌తో జిన్‌పింగ్‌ మాటామంతి | Xi Jinping and Donald Trump Discuss Relations After Meeting Putin | Sakshi
Sakshi News home page

పుతిన్, ట్రంప్‌తో జిన్‌పింగ్‌ మాటామంతి

Feb 5 2026 5:31 AM | Updated on Feb 5 2026 5:31 AM

Xi Jinping and Donald Trump Discuss Relations After Meeting Putin

ఒకేరోజు ఇరువురు నేతలతో ఫోన్‌లో సంభాషణ  

బీజింగ్‌: చైనా అధినేత జిన్‌పింగ్‌ బుధవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడిన కొన్ని గంటల వ్యవధిలోనే ట్రంప్‌తో సంభాషించడం ప్రాధాన్యం సంతరించుకుంది. చైనా, రష్యా సంబంధాలపై పుతిన్‌తో జిన్‌పింగ్‌ విస్తృతంగా చర్చించారు. ఈ సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి అందుబాటులో ఉన్న అవకాశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. 

ఈ సందర్భంగా ఒక ‘గ్రాండ్‌ ప్లాన్‌’ను పుతిన్‌ ప్రతిపాదించారు. గత ఏడాది నవంబర్‌ తర్వాత జిన్‌పింగ్, పుతిన్‌ ఫోన్‌లో మాట్లాడుకోవడం ఇదే మొదటిసారి. ఇటీవలి కాలంలో చైనా, జపాన్‌ సంబంధాలు దెబ్బతింటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పుతిన్‌తో సంభాషణ చర్చనీయాంశంగా మారింది. పుతిన్‌తో, ట్రంప్‌తో జిన్‌పింగ్‌ ఒకేరోజు మాట్లాడడం అత్యంత అరుదైన ఘటన. అయితే, ట్రంప్‌తో ఏం చర్చించారన్నది తెలియరాలేదు. దీనిపై చైనా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. రష్యా, అమెరికాల మధ్య 2010లో కుదిరిన అణ్వాయుధాల నియంత్రణ ఒప్పందం గడువు గురువారం ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ కొత్త ఒప్పందాన్ని ప్రతిపాదించారు. ఇందులో చైనా భాగస్వామిగా మారాలని కోరుతున్నారు. అందుకు చైనా అంగీకరించడం లేదు.      

Advertisement
 
Advertisement
Advertisement