జాగ్రత్త..చైనా అటాక్ చేయవచ్చు: అమెరికా | US Issues Strategic Warning To India, Stay Alert China Might Attack India | Sakshi
Sakshi News home page

జాగ్రత్త..చైనా అటాక్ చేయవచ్చు: అమెరికా

Feb 5 2026 4:28 AM | Updated on Feb 5 2026 5:06 PM

The US warned that China might attack India

చైనా విషయంలో భారత్‌కు అమెరికా కీలక సూచన చేసింది. డ్రాగన్ కంట్రీతో ఎల్లప్పుడూ అప్రమత్తతతో ఉండడం మంచిదని హెచ్చరించింది. చైనా,  భారత్‌పై ఏ క్షణానైన దాడికి తెగబడవచ్చని అమెరికా మెరైన్ ఇంటిలిజెన్స్ మాజీ అధికారి భారత్‌కు హెచ్చరిక జారీ చేశారు.

అరుణాచల్ విషయంలో డ్రాగన్‌ కంట్రీ తరచుగా  భారత్‌పై  కయ్యానికి కాలు దువ్వుతుంది. అయితే ప్రస్తుతం ఆ సమస్య అంత పెద్దగా లేదు.  అయితే భవిష్యత్తులో చైనా, భారత్‌పై దాడి చేసే అవకాశం ఉందని అమెరికా మాజీ మెరైన్ ఇంటెలిజెన్స్ అధికారి గ్రాంట్ న్యుషామ్ భారత్‌ను హెచ్చరించారు.

2049వరకూ చైనా తనను ప్రపంచంలోనే తనను సూపర్‌ పవర్‌గా స్థాపించుకోవాలనుకుంటుందని దానికి ప్రత్యేక లక్ష్యాలను నిర్ణయించుకుంటుందని తెలిపారు. తైవాన్‌తో సమస్య ఉన్న సమయంలోనే అకస్మాత్తగా మరో దేశంపై దాడి చేసే అవకాశం ఉందని తెలిపారు. భారత్, దక్షిణకొరియా, జపాన్, ఫిలీప్పీన్స్ వంటి ప్రాంతాలపై అది దాడి చేయగలదని తెలిపారు. అందులోనూ భారత్ తొలిస్థానంలో ఉంటుందని పేర్కొన్నారు.

దీనికోసం ఆయన చైనా, భారత్ మధ్య గతంలో జరిగిన గల్వాన్ లోయ వివాదాన్ని ప్రస్థావించారు. అయితే ప్రస్తుతం అమెరికా రాయబారిగా ఉన్న సెర్గియా గోర్ అధ్యక్షుడు ట్రంప్‌కు సన్నిహితుడని ఆయనతో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరో మెట్టు ఎక్కుతాయని అన్నారు. కాగా ఇటీవలే డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధిస్తున్న అధిక పన్నులను తగ్గిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement