భారత ప్రభుత్వం 2026-27 బడ్జెట్‌లో ఎన్నారైలకు బంగారంపై కలిపించిన వెసులుబాటు పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో ఎన్నార్లైలకు విధించిన బంగారం పరిమితి నిబంధనలను మారుస్తున్నట్లు తెలిపింది.
ఇదివరకూ ప్రవాస భారతీయులు భారత్ వచ్చే సమయంలో వారి వెంట ఉన్న బంగారు ఆభరణాలకు విలువ ఆధారంగా సుంకం ఉండేది. మహిళలకు రూ. లక్షలోపు, పురుషులకు రూ. 50 వేల లోపు విలువ ఉన్న పసిడికి ఎటువంటి సుంకం ఉండేది కాదు. ఆ పైన విలువ ఉన్న వాటికి మత్రమే సుంకం చెల్లించే విధంగా నియమాలు ఉండేవి.
అయితే ప్రస్తుత బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారం పరిమితిపై వెసులుబాటును మార్చుతున్నట్లు ప్రకటించింది. ప్రవాస భారతీయులు స్వదేశానికి వచ్చే సమయంలో మహిళలకు 40 గ్రాములు, పురుషులకు 20 గ్రాముల బంగారాన్ని ఎటువంటి సుంకం లేకుండా తీసుకరావచ్చని పేర్కొంది. ఆ పైన ఉన్న వాటికి మాత్రమే పన్ను చెల్లించాలని తెలిపింది.
ఇదివరకూ ఉన్న ద్రవ్య విలువ ఆధారంగా రూ. లక్షకు కేవలం ఆరు గ్రాములు, రూ. 50 వేలకు మూడు గ్రాముల పరిమితే ఉంటుంది. ప్రస్తుతం అది 20 నుంచి 40 గ్రాములకు చేరుకుంది. భారత ప్రభుత్వం ఆ పరిమితిని గణనీయంగా పెంచడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


