మళ్లీ ట్రెండ్‌లోకి వెండి | Gold And Silver Prices Rebound In Delhi Market After Three Day Decline, Know More Details | Sakshi
Sakshi News home page

Silver Prices: మళ్లీ ట్రెండ్‌లోకి వెండి

Feb 4 2026 4:06 AM | Updated on Feb 4 2026 12:52 PM

Gold and silver prices saw an increase

ర్యాలీ షురూ! 

రూ. 24,000 అప్‌ రూ.5,000 పెరిగిన బంగారం 

న్యూఢిల్లీ: జీవితకాల గరిష్ట స్థాయిల నుంచి వరుసగా మూడు రోజుల పాటు తీవ్ర పతనాన్ని చూసిన వెండి, బంగారం ధరలు తిరిగి కోలుకున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల పవనాల మధ్య ఢిల్లీ మార్కెట్లో విలువైన లోహాల ధరలు ర్యాలీ చేశాయి. వెండి కిలోకి ఏకంగా రూ.24,000 పెరిగి (9.23 శాతం) రూ.2.84 లక్షలకు (పన్నులతో కలుపుకుని) చేరింది. పసిడి సైతం 10 గ్రాములకు రూ.5,000 లాభపడి (3.3 శాతం) రూ.1,57,700 స్థాయిని తాకింది. జనవరి 29న వెండి రూ.4,04,500 వద్ద, పసిడి సైతం  రూ.1,83,000 వద్ద ఆల్‌టైమ్‌ గరిష్టాలను నమోదు చేయడం తెలిసిందే.

కొనుగోళ్ల మద్దతు.. 
‘‘బంగారం ఇటీవలి నష్టాలను మంగళవారం కొంత భర్తీ చేసుకుంది. వెండి ధర సైతం గణనీయంగా పెరిగింది. రెండు రోజుల భారీ విక్రయాలతో ధరలు క్షీణించడాన్ని ఇన్వెస్టర్లు చక్కని అవకాశంగా చూశారు’’అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ కమోడిటీ సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ తెలిపారు. దీర్ఘకాల పొజిషన్లు తీసుకునేందుకు దిద్దుబాటు కోసం వేచి చూసిన ఇన్వెస్టర్లు.. ధరలు దిగిరావడాన్ని అవకాశంగా భావించినట్టు వివరించారు. అంతర్జాతీయ మార్కెట్లో వెండి స్పాట్‌ ధర ఔన్స్‌కు 9.55 డాలర్లు (12.07) పుంజుకుని 88.77 డాలర్లకు చేరింది.

బంగారం సైతం ఔన్స్‌కు (31.10 గ్రాములు) 275 డాలర్లు లాభపడి (5.91 శాతం) 4,935.49 డాలర్ల స్థాయిని తాకింది. బంగారం, వెండికి అధిక మార్జిన్లు అవసరం కావడం, ఈ ఏడాది మేలో ఫెడ్‌ చైర్మన్‌ పావెల్‌ పదవీ కాలం ముగిసే వరకూ రేట్ల సవరణ ఉండదన్న అంచనాలు, రేట్ల పరంగా కఠిన దృక్పథం కలిగిన వార్‌‡్షను కొత్త చైర్మన్‌గా ప్రతిపాదించడం క్రితం మూడు సెషన్లలో బంగారం, వెండిలో విక్రయాలకు దారితీసినట్టు కోటక్‌ సెక్యూరిటీస్‌ కమోడిటీ ఏవీపీ కేనత్‌ చైన్‌వాలా వివరించారు. వీటి ధరలు సమీప కాలంలో అస్థిరంగానే ఉండొచ్చన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement