సెన్సెక్స్‌ సునామీ | Stock Market: Sensex ends 2073 points up and Nifty above 25700 | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్‌ సునామీ

Feb 4 2026 3:36 AM | Updated on Feb 4 2026 3:36 AM

Stock Market: Sensex ends 2073 points up and Nifty above 25700

బుల్స్‌ దండయాత్ర 

ఇండెక్స్‌ 2,073 పాయింట్ల జంప్‌ 

ఇంట్రాడేలో 4,200 పాయింట్లు ర్యాలీ 

25,700 స్థాయిపైకి నిఫ్టీ 

ఒక్కరోజులో రూ.12.10 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద

ముంబై: భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటనతో మంగళవారం దలాల్‌ స్ట్రీట్‌లో బుల్‌ లాభాల రంకె వేసింది.భారత్‌–అమెరికా ట్రేడ్‌ డీల్‌ ఇన్వెస్టర్లలో భారీ ఉత్సాహాన్ని నింపింది. ఫలితంగా సెన్సెక్స్‌ 2,073 పాయింట్లు ఎగసి 83,739 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 639 పాయింట్లు దూసుకెళ్లి 25,728 వద్ద నిలిచింది. గతేడాది 2025, మే 12 తర్వాత గడిచిన 8 నెలల్లో సూచీలకు ఒకరోజులో అతిపెద్ద ర్యాలీ ఇదే కావడం విశేషం.

ఇంట్రాడే ట్రేడింగ్‌లో రికార్డు: ఉదయమే ఉత్సాహంగా మొదలైన సెన్సెక్స్‌ 3,657 పాయింట్ల లాభంతో 85,323 వద్ద, నిఫ్టీ 1,220 వద్ద పాయింట్లు పెరిగి 26,308 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. దలాల్‌స్ట్రీట్‌ చరిత్రలోనే మునుపెన్నడూ లేనంతంగా ఇంట్రాడే లాభాలు ఆర్జించాయి. సెన్సెక్స్‌ ఏకంగా 4,205 పాయింట్లు (5.14%) ఎగసి 85,872 వద్ద, నిఫ్టీ 1,253 పాయింట్లు దూసుకెళ్లి 26,341 వద్ద గరిష్టాలు తాకాయి. తద్వారా సూచీలు ఇంట్రాడేలో అత్యధిక లాభాలు ఆర్జించిన కొత్త రికార్డు నమోదైంది.  
ఇన్వెస్టర్లకు లాభాల పంట: స్టాక్‌ మార్కెట్‌ రెండున్నర శాతం ర్యాలీతో ఇన్వెస్టర్లకు లాభాల పంట పండింది. ఒక్కరోజే రూ. 12.10 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.467.14 లక్షల కోట్లకు చేరుకుంది. 

 సెన్సెక్స్‌ సూచీలోని 30 షేర్లలో టెక్‌ మహీంద్రా (–0.47%), బీఈఎల్‌(–0.02%) మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 28 షేర్లు లాభపడ్డాయి. అత్యధికంగా అదానీ పోర్ట్స్‌ 9.12%, బజాజ్‌ ఫైనాన్స్‌ 6.68%, ఇండిగో 5.51%, పవర్‌గ్రిడ్‌ 4.85%, సన్‌ఫార్మా 4.54 శాతం పెరిగాయి. 

 స్టాక్‌ మార్కెట్‌ ర్యాలీలో అన్ని రంగాల షేర్లూ పాలుపంచుకున్నాయి. బీఎస్‌ఈలో రంగాల వారీ సూచీల్లో సరీ్వసెస్‌ 4.86%, రియల్టీ 4.79%, పవర్‌ 4.79%, యుటిలిటీస్‌ 3.92%, క్యాపిటల్‌ గూడ్స్‌ 3.71%, ఇండస్ట్రియల్స్‌ 3.44%, కన్జూమర్‌ డిస్క్రేషనరీ 3.06%, మెటల్స్‌ 2.85%, ఫార్మా 2.83%, ఫైనాన్షియల్స్‌ సర్వీసెస్‌ 2.83% లాభపడ్డాయి.  

అమెరికా ట్రేడ్‌ డీల్‌ ఎఫెక్ట్‌...     
టెక్స్‌టైల్, లెదర్‌ స్టాక్స్‌: గోకుల్‌దాస్‌ ఎక్స్‌పోర్ట్స్‌ 20%, వెల్‌స్పన్‌ లివింగ్‌ 19.85%, గర్వారే టెక్నికల్‌ ఫైబర్స్‌ 17.07%, కేపీఆర్‌ మిల్స్‌ 15.31 శాతం ర్యాలీ చేశాయి.ఎస్‌పీ అప్పరెల్స్‌ 14.19% వర్ధమాన్‌ టెక్స్‌టైల్స్‌ 12.12%, ట్రిడెంట్‌ 11.27%, అర్వింద్‌ లిమిటెడ్‌ 10.23%, పేజ్‌ ఇండస్ట్రీస్‌ 3.79%, రేమాండ్‌ లైఫ్‌స్టయిల్‌ 3.39 శాతం లాభపడ్డాయి.    

సీఫుడ్స్‌ ఎక్స్‌పోర్ట్స్‌ షేర్లు: అవంతీ ఫీడ్స్, అపెక్స్‌ ఫ్రోజెన్‌ ఫుడ్స్‌ 20% ర్యాలీ చేసి వరుసగా రూ.961, రూ.351 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ తాకాయి. జీల్‌ ఆక్వా 10.58%, కింగ్స్‌ ఇన్‌ఫ్రా 7.64%, ముక్కా ప్రోటీన్స్‌ 5.01%, కోస్టల్‌ కార్పొరేషన్‌ 5% లాభపడ్డాయి.  

స్పెషాలిటీ కెమికల్స్‌: ఆర్తి ఇండస్ట్రీస్‌ 15.10%, గుజరాత్‌ ఫ్లోరో 6.82%, నవీన్‌ ఫ్లోరైన్‌ 6.22%, నియోజెన్‌ కెమ్‌ 6.19% పెరిగాయి. అతుల్‌ ఇండస్ట్రీస్‌ 5.25%, వినతి ఆర్గానిక్స్‌ 4.67%, ఎస్‌ఆర్‌ఎఫ్‌ 3.76%, ఆక్విటాస్‌ కెమ్‌ 1.26% లాభపడ్డాయి.  

వజ్రాభరణాల షేర్లు: గోల్డియమ్‌ ఇంటర్నేషనల్‌ 20%, వైభవ్‌ గ్లోబల్‌ 9.13%, కళ్యాణ్‌ జ్యువెలరీ 4.91%, శ్రింగార్‌ హౌస్‌  4.51% మెరిశాయి. టైటాన్‌ 3%, పీఎన్‌ గాడ్గిల్‌ జ్యువెలర్స్‌ 1.52%, పీసీ జ్యువెలర్‌ 0.29% లాభపడ్డాయి.  

ఆటో ఉపకరణాల కంపెనీల షేర్లు: బెల్‌రైజ్‌ ఇండస్ట్రీస్‌ 7.37%, భారత్‌ ఫోర్జ్‌ 6.56%, సంవర్ధన మదర్సన్‌ ఇంటర్నేషనల్‌ 6.44% బీఎల్‌డబ్ల్యూ ప్రిసిషన్‌ ఫోర్జింగ్స్‌ 6.13%, సుందరం ఫాస్టెనర్స్‌ 4%, భాష్, యూఎన్‌ఓ మిండా 3% పెరిగాయి.  

అదానీ షేర్ల పరుగులు: స్టాక్‌ మార్కెట్‌ ర్యాలీలో భాగంగా అదానీ కంపెనీల షేర్లు పరుగులు పెట్టాయి. అదానీ గ్రీన్‌ ఎనర్జీ 10.61%, అదానీ ఎంటర్‌ప్రైజస్‌ 10.38%, అదానీ ఎనర్జీ సొల్యూ షన్స్‌ 10.23%, అదానీ పోర్ట్స్‌ 9.12%, అదానీ పవర్‌ 6.76%, అదానీ టోటల్‌ గ్యాస్‌ 4.52%, సంఘీ ఇండస్ట్రీస్‌ 3.60% లాభపడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement