వచ్చే ఏడాది ఎల్ఐసీ ఎఫ్‌పీవో | LIC FPO Likely Next Year | Sakshi
Sakshi News home page

వచ్చే ఏడాది ఎల్ఐసీ ఎఫ్‌పీవో

Feb 3 2026 8:03 PM | Updated on Feb 3 2026 8:14 PM

LIC FPO Likely Next Year

బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఎల్‌ఐసీ)లో మరింత వాటా విక్రయానికి ప్రభుత్వం వచ్చే ఏడాది(2026–27) ఫాలోఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌(ఎఫ్‌పీవో) చేపట్టే వీలున్నట్లు నాగరాజు వెల్లడించారు. 2022 మే నెలలో ప్రభుత్వం పబ్లిక్‌ ఇష్యూ ద్వారా ఎల్‌ఐసీలో 3.5 శాతం వాటా అమ్మిన సంగతి తెలిసిందే. షేరుకి రూ. 949 ధరలో వాటా విక్రయించడం ద్వారా రూ. 21,000 కోట్లు సమకూర్చుకుంది.

ప్రస్తుతం ఎల్‌ఐసీలో ప్రభుత్వ వాటా 96.5 శాతంగా ఉంది. దీంతో 2027 మే నెలకల్లా పబ్లిక్‌కు కనీసం 10 శాతం వాటా నిబంధన అమలు చేసేందుకు మరో 6.5 శాతం వాటా ఆఫర్‌ చేయవలసి ఉంది. వెరసి ఎల్‌ఐసీలో ప్రభుత్వ వాటా విక్రయించేందుకు వీలుగా ఎఫ్‌పీవోను పరిశీలించవలసిందిగా దీపమ్‌ను కోరినట్లు నాగరాజు తెలియజేశారు. అయితే అనుమతులు, మార్కెట్‌ పరిస్థితుల ఆధారంగా వచ్చే ఏడాది ఎల్‌ఐసీ ఎఫ్‌పీవోకు అవకాశమున్నట్లు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement