ల్యాప్స్‌ అయిన పాలసీల పునరుద్ధరణ | LIC Launches Scheme To Revive Lapsed Life Insurance Policies With Attractive Discounts, More Details Inside | Sakshi
Sakshi News home page

ల్యాప్స్‌ అయిన పాలసీల పునరుద్ధరణ

Jan 6 2026 8:07 AM | Updated on Jan 6 2026 10:46 AM

LIC Introduces Revival Scheme for Lapsed Life Insurance Policies

రద్దయిన జీవిత బీమా పాలసీలను (ల్యాప్స్‌డ్‌ పాలసీలు) పునరుద్ధరించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ప్రభుత్వరంగ ఎల్‌ఐసీ ప్రకటించింది.  మార్చి 2 వరకు రెండు నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపింది. అన్ని నాన్‌ లింక్డ్‌ పాలసీలకు, ఆలస్యపు రుసుము (నిలిచిపోయిన కాలానికి సంబంధించిన ప్రీమియంపై)లో ఆకర్షణీయమైన తగ్గింపును ఇస్తున్నట్టు పేర్కొంది.

ఆలస్యపు రుసుములో 30 శాతం, గరిష్టంగా రూ.5,000 తగ్గింపు పొందొచ్చని వెల్లడించింది. సూక్ష్మ జీవిత బీమా పాలసీలపై ఆలస్యపు రుసుమును పూర్తిగా మాఫీ చేస్తున్నట్టు తెలిపింది. పాలసీ కాల వ్యవధి (టర్మ్‌) ముగిసిపోకుండా, కేవలం ప్రీమియం చెల్లింపుల్లేక రద్దయిన పాలసీలకే పునరుద్ధరణ అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది.

వైద్య/ఆరోగ్య అవసరాల్లో ఎలాంటి రాయితీలు ఉండవని పేర్కొంది. సకాలంలో ప్రీమియంలు చెల్లించలేకపోయిన వారికి ఈ పునరుద్ధరణ కార్యక్రమం ప్రయోజనం కల్పిస్తుందని వివరించింది. పాలసీలను పునరుద్దరించుకుని, బీమా కవరేజీని తిరిగి పొందాలంటూ పాలసీదారులకు సూచించింది.

ఇదీ చదవండి: ఆన్‌లైన్‌లో కొన్న బంగారంపై లోన్‌ ఇస్తారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement