సిగరెట్లపై కొత్త ఎక్సైజ్ సుంకం రాష్ట్ర బీమా సంస్థలభారీ సెగ తగిలింది. సిగరెట్లపై ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ సుంకం భారీగా పెంచడంతో గత రెండు రోజుల్లో ఐటీసీ షేర్లు 14 శాతం పడిపోయాయి. ముఖ్యంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)భారీగా నష్టపోయింది.
ఐటీసీ షేర్లలో భారీ అమ్మకాల కారణంగా ఎల్ఐసీ వంటి ప్రభుత్వ యాజమాన్యంలోని బీమా సంస్థల రూ.13,740 కోట్ల సంపద తుడిచిపెట్టుకు పోయింది. ఒక్క ఎల్ఐసీ రూ.11,468 కోట్లకు పైగా నష్టాన్ని చవిచూస్తుంది. డిసెంబర్ 31 ముగింపు స్థాయిలో రూ.80,028 కోట్ల నుండి రికార్డు స్థాయిలో టోటల్‌వాల్యూలో రూ.68,560 కోట్లకు చేరింది. అలాగే ఐటీసీ అమ్మకం కారణంగా జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జిఐసీ) కేవలం రెండు రోజుల్లోనే దాదాపు రూ.1,254 కోట్లు, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ రూ.1,018 కోట్ల నష్టాన్ని చవిచూశాయి.
2026 ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికం చివరి నాటికి ఐటీసీ వాటాదారుల సంఖ్యపై డేటా ప్రకారం, కంపెనీలో మొత్తం 100 శాతం వాటాను పబ్లిక్ వాటాదారులు కలిగి ఉన్నాయి. ఐటీసీలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) 15.86 శాతం వాటాను కలిగి ఉండగా, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జిఐసీ) 1.73 శాతం వాటాను, ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 1.4 శాతం వాటాను కలిగి ఉన్నాయి.
ఇదీ చదవండి: దుబాయ్‌లో గ్రాండ్‌గా తల్లి బర్త్‌డే : వివాదాల బ్యూటీ వీడియో వైరల్
జనవరి 2న ఐటీసీ షేర్లు 5 శాతం తగ్గి 52 వారాల కనిష్ట స్థాయి రూ.345.25కి చేరాయి. 2026లో కేవలం రెండు ట్రేడింగ్ రోజుల్లోనే ఈ స్టాక్ 14 శాతానికి పైగా కుప్పకూలాయి. ఈ భారీ అమ్మకాల వల్ల కేవలం రెండు రోజుల్లోనే కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ నుండి రూ.72,000 కోట్లు నష్టం వాటిల్లింది. ప్రస్తుతం ఇది దాదాపు రూ.4,38,639 కోట్ల వద్ద ఉంది. జనవరి 2న 4 శాతం నష్టంతో రూ.350.10 వద్ద ముగిసింది. గత ఐదు రోజుల్లో ఈ స్టాక్ 13 శాతానికి పైగా పడిపోయింది. గత ఆరు నెలల్లో 15 శాతానికి పైగా నష్టపోయింది.
(ప్రియుడిని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కి పిల్చి, ప్రైవేట్ పార్ట్స్‌పై దాడి)
అయితే LIC షేర్లు ముగింపులో దాదాపు 1 శాతం పెరిగి రూ.861 వద్ద , జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షేర్లు సెషన్‌లో రూ.380 వద్ద స్వల్ప లాభాలతో ముగిశాయి.


