నటి,వివాదాలతో వార్తల్లో నిలిచే బ్యూటీ క్వీన్ ఊర్వశి రౌతేలా తన తల్లి మీరా రౌతేలా పుట్టిన రోజును ఘనంగా నిర్వహించింది. ప్రపంచంలోనే అతి పెద్ద హెటల్, 24 క్యారెట్ల బంగారు కిరీటం, గోల్డ్ కేక్ లాంటి విశేషాలతో గుర్తుండిపోయేలా వేడుక చేసింది. దీనికి సంబంధించిన వీడియో,ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.
ప్రపంచంలోని ఎత్తైనహోటల్‌లో 24 క్యారెట్ల బంగారు కిరీట కేక్‌తో అమ్మ పుట్టినరోజు వేడుక.. మేం అందరం నిన్ను ప్రేమిస్తున్నాం. వరల్డ్ టాలెస్ట్ హోటల్,ప్యూర్ రాయల్ గోల్డ్ క్రౌన్ కేక్,ప్యూర్ లవ్’’అంటూ ఊర్వశి పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీంతో తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలతోపాటు, ఊర్వశిపై ప్రశంసలు వెల్లువెత్తాయి.

ఇదీ చదవండి: ఐదు నెలల చిన్నారి ఉసురు తీసిన ‘పాలు’
విలాసవంతమైన వేడుకలో మూడు లేయర్ల బంగారు రంగు కేక్ ఒక ఆకర్షణ అయితే, 24 క్యారెట్ల బంగారంతో చేసిన కిరిటాన్ని ఊర్వశి తన తల్లి తలపై ఉంచడం మరో ఎట్రాక్షన్‌గా నిలిచింది. అందంగా ముస్తాబైన మీరా నవ్వుతూ, తన కుమార్తె స్వచ్ఛమైన ఆప్యాయత అనురాగాలను మురిసిపోయింది. కాగా ప్రతీ ఏడాది తల్లి బర్త్‌డే ఘనంగా నిర్వహించడం ఊర్వశికి అలవాటు. ఊర్వశి కలాజికల్ హారర్ చిత్రం కసూర్ 2 , వెల్‌కమ్ టు ది జంగిల్‌లలో నటించనుంది. గ్లెన్ బారెట్టో దర్శకత్వంలో ఆమె అఫ్తాబ్ శివదాసాని, జాస్సీ గిల్‌తో కలిసి నటిస్తోంది.
ఇదీ చదవండి: ఐఐటీ హైదరాబాద్ విద్యార్థికి ఏకంగా రూ. 2.5 కోట్ల ఆఫర్, రికార్డ్


