ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ (IITH) విద్యార్థి 2025 ప్లేస్‌మెంట్ సీజన్‌లో రికార్డు ప్యాకేజీ సాధించాడు. చివరి సంవత్సరం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థి నెదర్లాండ్స్‌కు చెందిన గ్లోబల్ ట్రేడింగ్ సంస్థలో ఏకంగా రూ. 2.5 కోట్ల ప్యాకేజీని సాధించాడు. 2008లో ప్రారంభమైనప్పటి నన ఐఐటీ హైదరాబాద్ చరిత్రలో ఇప్పటివరకు ఇదే అత్యధికం కావడం విశేషం.
హైదరాబాద్‌లో పుట్టి పెరిగి, 7 నుండి 12వ తరగతి వరకు బెంగళూరులో చదువుకున్న 21 ఏళ్ల విద్యార్థి ఎడ్వర్డ్ నేథన్ వర్గీస్ (Edward Nathan Varghese) భారీ వేతనంతో నెదర్లాండ్స్ ప్రముఖ సంస్థ 'ఆప్టివర్' (Optiver)లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేరనున్నాడు. అంతకుముందు రెండు నెలల వేసవి ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన ఇద్దరు విద్యార్థులలో వర్గీస్ ఒకడు. ఇంటర్న్‌షిప్ తరువాత కంపెనీ ఆయనకు ఇచ్చిన ప్రీ రీప్లేస్‌మెంట్ ఆఫర్‌తోపాటు, కేవలం రెండు వారాల ట్రైనింగ్ తర్వాత ఒక ప్రాజెక్ట్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశాడు.ఈ తర్వాత తుది ఆఫర్‌ను అందుకున్న ఏకైక వ్యక్తి.
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం విద్యాపరంగా, వర్గీస్ 2022లో JEE మెయిన్‌లో 1100 ఆల్ ఇండియా ర్యాంక్ (AIR), JEE అడ్వాన్స్‌డ్‌లో AIR 558 సాధించాడు. 2025లో కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT)కి కూడా హాజరయ్యాడు. 99.96 పర్సంటైల్ సాధించి 120వ ర్యాంక్‌ను సాధించాడు.ప్లేస్‌మెంట్స్‌తో పాటు, వర్గీస్ క్యాంపస్‌లో అనేక లీడర్‌షిప్ రోల్స్ పోషించాడు. అతని లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, అతను IIT హైదరాబాద్‌లోని ఆఫీస్ ఆఫ్ కెరీర్ సర్వీసెస్‌లో ఓవరాల్ హెడ్‌గా పనిచేశాడు, ఎనిమిది మంది విద్యార్థి నిర్వాహకులు, దాదాపు 250 మంది కోఆర్డినేటర్లకు నాయకత్వం వహించాడు. దీనికి ముందు, అతను దాదాపు 11 నెలల పాటు ఇంటర్న్‌షిప్ సెల్
ఇదీ చదవండి: ఐదు నెలల చిన్నారి ఉసురు తీసిన ‘పాలు’
కాగా ఐఐటీ హైదరాబాద్ ప్లేస్‌మెంట్లలో సరికొత్త చరిత్ర రికార్డైంది. ఐఐటీహెచ్‌లోని మరో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థి రూ. 1.1 కోట్ల ప్యాకేజీని పొందగా ఏడాది తరువాత ఈ రికార్డు స్థాయి ఆఫర్ రావడం విశేషం. 2017లో అత్యధిక ఆఫర్ రూ. కోటిగా ఉన్న క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ ఈ బెంచ్‌మార్క్‌ను దాటింది. మొత్తంమీద, 2025 ప్లేస్‌మెంట్ సీజన్‌లో ఇన్‌స్టిట్యూట్‌లో సగటు ప్యాకేజీలు దాదాపు 75శాతం పెరిగాయి, 2024లో రూ. 20.8 లక్షల నుండి ఈ సంవత్సరం మొదటి దశ ప్లేస్‌మెంట్‌లలో రూ. 36.2 లక్షలకు చేరుకున్నాయి. ఐఐటీహెచ్‌లోని విద్యార్థులు 24 అంతర్జాతీయ ఆఫర్‌లను పొందారు.


