పెళ్లికి నిరాకరించిన ప్రేమికుడిపై దాడిచేసి ప్రైవేట్ భాగాలను నరికివేసింది.తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో ఇద్దరూ వివాహితులే. ముంబైలో ఈ దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
ఎన్‌డీటీవీ కథనం ప్రకారం 25 ఏళ్ల ఒక మహిళ ఇద్దరు పిల్లల తల్లి. ఈమెకు 42 ఏళ్ల వివాహితుడితో దాదాపు ఏడు సంవత్సరాలుగా వివాహేతర సంబంధం ఉంది. భార్యకు విడాకులిచ్చి తనన పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోంది. దీంతో అసలు పెళ్లి ఊసు ఎత్తగానే సరైన సమాధానం చెప్పకుండా ముఖం చాటేసేవాడు. తన మాట వినడం లేదని, భార్యను విడిచిపెట్టడానికి నిరాకరించాడన్న కోపంతో ఆ మహిళ ఇంత దారుణానికి ఒడిగట్టింది.
పెళ్లి చేసుకోవాలన్న ఒత్తిడి తీవ్రమవుతున్న నేపథ్యంలో గత ఏడాది నవంబరులో బిహార్‌కు వెళ్లి పోయాడు. భార్యాబిడ్డలు ముంబైలోని శాంటా క్రజ్‌లోని ఇంట్లో ఉంటున్నారు. గత 18 ఏళ్లుగా కుటుంబంతో కలిసి ఇక్కడే ఉంటున్నాడు. బాధితుడు. బిహార్‌కు వెళ్లిన తరువాత కూడా ఆమె ఫోన్ కాల్స్ ద్వారా పెళ్లి గురించి అడగడం, అతన్ని బెదిరించడం జరుగుతూనే ఉంది. అయితే 2026 కొత్త సంవత్సరం సందర్బంగా డిసెంబర్ 19న ముంబైకి తిరిగొచ్చాడు. ఇదే అదనుగా భావించిన ప్రేమికురాలు నూతన సంవత్సర వేడుకలకు ఇంటికి రావాల్సిందిగా బాధితుడిని ఆహ్వానించింది. గురువారం తెల్లవారుజామున మాటల్లో పెట్టి, సమయం చూసి పదునైన ఆయుధంతో అతని ప్రైవేట్ భాగాలపై దాడిచేసిందని ముంబై పోలీసు అధికారి తెలిపారు.
ఇదీ చదవండి: ఐదు నెలల చిన్నారి ఉసురు తీసిన ‘పాలు’
తీవ్ర గాయాలపాలై అధిక రక్తస్రావంతో బాధితుడు మొత్తం మీద బైటపడి, సోదరుడు, ఇతర బంధువుల సాయంతో బీఎన్ దేశాయ్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. గాయం చాలా లోతుగా ఉందని శస్త్రచికిత్స అవసరం కావచ్చని వైద్యులు భావిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో ఇద్దరికీ బంధుత్వం ఉన్నట్టు తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితురాలి కోసం వెతుకుతున్నారు.
ఇదీ చదవండి: ఐఐటీ హైదరాబాద్ విద్యార్థికి ఏకంగా రూ. 2.5 కోట్ల ఆఫర్, రికార్డ్


