సాయంత్రానికి మరింత క్రాష్‌.. గంటల్లోనే పడిపోయిన బంగారం | Gold Rates crashed by Evening 2nd February 2026 in Telugu States | Sakshi
Sakshi News home page

సాయంత్రానికి మరింత క్రాష్‌.. గంటల్లోనే పడిపోయిన బంగారం

Feb 2 2026 6:16 PM | Updated on Feb 2 2026 6:45 PM

Gold Rates crashed by Evening 2nd February 2026 in Telugu States

బంగారం ధరలు వేగంగా మారిపోతున్నాయి. గంటల్లోనే రూ.వేలల్లో వ్యత్యాసాన్ని నమోదు చేస్తున్నాయి. సోమవారం ఉదయం భారీగా తగ్గిన బంగారం ధరలు.. సాయంత్రాని​కి మరింత పడిపోయాయి.

హైదరాబాద్‌, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల (తులం) ధర సోమవారం ఉదయం రూ.8300 తగ్గి రూ. 1,38,900 లకు దిగిరాగా సాయంత్రానికి మొత్తంగా రూ.12300 క్షీణించి రూ.1,34,900లకు పడిపోయింది.

ఇక 24 క్యారెట్ల పసిడి తులం ధర సోమవారం ఉదయం రూ.9050 తగ్గి రూ. 1,51,530 లకు తగ్గగా సాయంత్రానికి మరింత రూ.13410 పడిపోయి రూ.1,47,170లకు క్షీణించింది.

వేగంగా మారిపోతున్న దేశీయ, అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ మారుతుండటంతో బంగారం ధరల్లో ఈ స్థాయిలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement