హోటల్ అని భోజనానికి వెళ్లారు.. తీరాచూస్తే? | In Thailand they went out for food at a funeral ceremony | Sakshi
Sakshi News home page

హోటల్ అని భోజనానికి వెళ్లారు.. తీరాచూస్తే?

Feb 5 2026 2:31 AM | Updated on Feb 5 2026 2:31 AM

In Thailand they went out for food at a funeral ceremony

థాయిలాండ్‌లో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆ దేశ పర్యటనకు వచ్చిన ఇద్దరు జర్మన్ పర్యాటకులు  సరదాగా రోడ్లపై నడిచివెళ్తున్నారు. అంతలో వారికి గుమగుమలతో కూడిన వంటల వాసన వచ్చింది. దీంతో అందులోకి వెళ్లి భోజనం కోసం ఆర్టర్ చేయగా అది అంత్యక్రియల కార్యక్రమం తెలియడంతో ఒకరినొకరు చూసుకుంటూ తెల్లమెుకం వేసుకున్నారు.

దక్షిణ థాయిలాండ్‌లోని నఖోసి అనే ప్రాంతంలో ఇద్దరు పర్యాటకులు వెళుతుండగా రోడ్డుపైన ఒక మహిళ వారికి నమస్కారం పెట్టింది. దీంతో వారు అక్కడ హోటల్‌ ఉందని భావించారు. దీంతో లోపలికి వెళ్లి కూర్చొన్నారు. అక్కడున్న వారిని ఫుడ్‌ మెనూ ఇవ్వాల్సిందిగా కోరగా వారు ఆశ్చర్యపోయారు. తీరా చూస్తే అది అంత్యక్రియల కార్యక్రమం అని వారికి తెలిసింది. దీంతో వారు సిగ్గుతో తలవంచుకున్నారు.

వెంటనే వారు అక్కడి వారికి క్షమాపణ చెప్పి అక్కడి నుండి వెళ్లడానికి ప్రయత్నించగా అక్కడి వారు వారిద్దరిని ఆపారు. తిని వెళ్లాల్సిందిగా కోరారు. దీంతో వారిద్దరూ వారి కోరిక మేరకు ఆహరం తిని వారికి కృతజ్ఞతలు చెప్పి తిరిగివచ్చారు. సాధారణంగా థాయిలాండ్‌లో అంత్యక్రియలు చాలా రోజుల పాటు నిర్వహిస్తారు. వేడుకలకు హాజరయ్యే వారికి ప్రత్యేక ఆహారం పెడతారు.

Advertisement
 
Advertisement
Advertisement