బ్లూ డ్రమ్.. ఈ పేరు వింటేనే భర్తల వెన్నులో వణకు పుడుతోంది. అందుకు కారణం.. మీరట్‌లో జరిగిన ఓ ఘటన. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భర్తను ప్రియుడి సాయంతో గంజాయి మత్తులో కిరాకతంగా హతమార్చింది ఓ భార్య. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది కూడా. అయితే..
భర్త సౌరభ్ రాజ్‌పుత్ (మర్చంట్ నేవీ ఆఫీసర్)ను అత్యంత కిరాతకంగా కడతేర్చిన ముస్కాన్ రస్తోగి మళ్లీ తల్లైంది. ఆదివారం సాయంత్రం మీరట్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ సయమంలో ముస్కాన్ ప్రియుడు, ఈ కేసు సహ నిందితుడు సాహిల్ శుక్లా కూడా పక్కనే ఉన్నాడు. ఒకవేళ ఆ బిడ్డ తమ కొడుకుకే పుట్టినట్లు డీఎన్‌ఏ పరీక్షల్లో తేలితే.. తమ మనవడిగా స్వీకరిస్తామని సౌరబ్ కుటుంబం ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.

మీరట్‌లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బ్లూ డ్రమ్ హత్యకేసు మరోసారి వార్తల్లో నిలిచింది. భర్త సౌరభ్ రాజ్‌పుత్‌ను క్రూరంగా హత్య చేసిన కేసులో ప్రధాన నిందితురాలిగా అరెస్టైన ముస్కాన్ రస్తోగి, ఎనిమిది నెలలుగా జైలులో ఉన్న ఆమె.. ఆదివారం సాయంత్రం జైలు అధికారుల పర్యవేక్షణలో మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
ప్రియుడు సాహిల్ శుక్లా మోజులో పడి భర్త సౌరభ్ గుప్తను హత్య చేయించిన కేసులో మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ముస్కాన్ రస్తోగి అరెస్టు సమయంలోనే ఆమె గర్భవతిగా ఉన్నట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఆమెకు ప్రత్యేక వైద్య పర్యవేక్షణ ఏర్పాటు చేసినట్లు జైలు అధికారులు తెలిపారు. గర్భధారణ చివరి దశకు చేరుకోవడంతో, భద్రతా ఏర్పాట్ల మధ్య ఆమెను మీరట్ మెడికల్ కాలేజీకి తరలించారు.
ముస్కాన్ సాధారణ ప్రసవం ద్వారా ఆరోగ్యవంతమైన ఆడబిడ్డకు జన్మనిచ్చింది.తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రసవం అనంతరం, భద్రతా కారణాల వల్ల వారిని ప్రత్యేక వార్డులో ఉంచారు. ఈ కేసు 2024లో వెలుగులోకి వచ్చింది.సౌరభ్ రాజ్‌పుత్ హత్య అనంతరం, అతని శవాన్ని బ్లూ డ్రమ్‌లో నింపి మాయం చేసిన ఘటన ఉలిక్కిపడేలా చేసింది. పోలీసులు విచారణలో ముస్కాన్ రస్తోగి, ఆమె స్నేహితుడు సహా పలువురిని అరెస్టు చేశారు.

శిశువు భవిష్యత్తుపై చర్చ
ముస్కాన్ జైలులో శిశువుకు జన్మనివ్వడంతో, బిడ్డను ఎక్కడ ఉంచాలి? ఎవరు చూసుకుంటారు? అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. చట్టం ప్రకారం, మహిళా ఖైదీలు తమ పిల్లలను ఆరు సంవత్సరాల వయస్సు వరకు జైలులోనే ఉంచుకునే అవకాశం ఉంది.
ముస్కాన్ రస్తోగిపై హత్య, శవాన్ని మాయం చేయడం, కుట్ర వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. ప్రసవం అనంతరం ఆమెను తిరిగి జైలుకు తరలించే ప్రక్రియను అధికారులు పరిశీలిస్తున్నారు.


