500 అడుగుల లోయలో పడిన బస్సు.. 14 మంది మృతి | Private bus Accident At Himachal Pradesh Sirmaur | Sakshi
Sakshi News home page

500 అడుగుల లోయలో పడిన బస్సు.. 14 మంది మృతి

Jan 9 2026 9:55 PM | Updated on Jan 9 2026 9:55 PM

Private bus Accident At Himachal Pradesh Sirmaur

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. హిమాచల్‌లోని సిర్మౌర్‌ జిల్లాలో ఓ ప్రైవేట్ బస్సు లోయలో పడి దాదాపు 14 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

వివరాల ప్రకారం.. హిమాచల్‌లోని సిమ్లా నుంచి కుప్వికి వెళ్తున్న బస్సు హరిపుర్‌ధర్‌ దగ్గర అదుపుతప్పి 500 అడుగుల లోయలో పడింది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను బస్సు లోపల నుంచి బయటకు తీశారు. అనంతరం అక్కడికి చేరుకున్న సహాయక సిబ్బంది గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.

మరోవైపు, ఈ ప్రమాదానికి సంబంధించి సంగ్రా సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డీఎం) సునీల్ కాయత్ మీడియాతో మాట్లాడారు. శుక్రవారం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో బస్సు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న లోయలో పడిపోయిందని తెలిపారు. జిల్లా కేంద్రం నాహన్ నుంచి సుమారు 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న హరిపుర్‌ధార్ గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనగుతున్నాయని చెప్పారు. గాయపడిన వారందరినీ సమీపంలోని సంగ్రా, దదాహు ఆసుపత్రులకు తరలించామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement