సంతానం లేని మహిళలను గర్భవతి చేస్తే భారీ మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చనే ప్రచారం ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ‘ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్' అని పేరుతో సాగింది ఈ స్కాం. ఇందులో సంతానం లేని మహిళలను గర్భవతిని చేస్తే బహుమతులు, చౌక రుణాలు, నకిలీ ఉద్యోగాల వంటి తప్పుడు వాగ్దానాలతో అమాయక యువకులను ప్రలోభపెట్టింది. ఈ మోసానికి సంబంధించిన ముఠాను పోలీసులు గుర్తించారు.
బిహార్‌లోని నవాడా జిల్లాలో ఈ కొత్త స్కాంవెలుగులోకి వచ్చింది. మహిళను గర్భవతిని చేస్తే రూ. 10 లక్షలు అంటూ శృంగారం డబ్బు ఆశ చూపి ప్రారంభంలో కొన్ని చెల్లింపులు చేశారు. తాము మోసపోతున్నామని గ్రహించేలోపే ఆధార్, పాన్, ఫోటో, రిజిస్ట్రేషన్, హోటల్ బుకింగ్స్ అంటూ కొంతమంది యువకుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. నవాడాకు చెందిన రంజన్ కుమార్‌తోపాటు, సైబర్ క్రైమ్ ఆరోపణలపై ఒక మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
'ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ సర్వీస్'
వినడానికి వింతగా ఉన్నా, పోలీసులు అందించిన వివరాల ప్రకారం 'ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్' అనేది ఉద్యోగం ,లోన్లు అంటూ జరిగి ఒక భారీ మోసం. 'ప్లేబాయ్ సర్వీస్' వంటి అనేక తప్పుదోవ పట్టించే పదబంధాలను ఉపయోగించారు. 'ధని ఫైనాన్స్', 'ఎస్‌బిఐ చౌక రుణాలు' వంటి పేర్లతో చౌక రుణాలను అందించారు. ఈ ఫేస్‌బుక్ ,వాట్సాప్‌లో నకిలీ ప్రకటనలతో జనాల్ని ఆకర్షించారు.
ఎలా సాగిందీ మోసం
సంతానం లేని మహిళలను గర్భవతిని చేస్తే పురుషులకు రూ. 10 లక్షలు ఇస్తామని నిందితులు వాగ్దానం చేశారు. ఒకవేళ విఫలమైనా, వారికి సగం డబ్బు ఇస్తామని హామీ ఇచ్చారు. సంభావ్య బాధితులకు మహిళా మోడళ్ల ఫోటోలు పంపి, ఉచిత సెక్స్ ఆఫర్‌తో వారిని ఆశపెట్టారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటీ అంటే రిజిస్ట్రేషన్ ఫీజులు, హోటల్ ఛార్జీలు బాధితుల నుండి డబ్బులు గుంజారు. లక్షాధికారి కావడానికి ఇది సులభమైన మార్గం అని నమ్మి, చాలా మంది డబ్బులను పోగొట్టుకున్నారు. తీరా మోసపోయాక ఎవరికీ చెప్పుకోలేక, అవమానంతో చాలా సందర్భాలలో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులేమంటున్నారంటే
చివరికి కొంతమంది ఫిర్యాదు చేయడంతో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నవాడాకు చెందిన రంజన్ కుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేసింది. ఈ కేసులో ఒక మైనర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ మోసంలో ఉపయోగించిన నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభినవ్ ధీమాన్ తెలిపారు. భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్) , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు
పోలీసుల ప్రకారం, నవాడా జిల్లాలో గతంలో కూడా ఇలాంటి అనేక సైబర్ మోసాల సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. గతంలో కూడా ఇదే పద్ధతిని అనుసరించారు, బాధితులను బ్లాక్‌మెయిల్ చేసి బలవంతంగా వసూలు చేశారు. అనేక మంది నిందితులను అరెస్టు అయ్యారు. సోషల్ మీడియాలో ఇటువంటి ప్రలోభపెట్టే , అసాధారణమైన వాదనలను నమ్మవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఇటువంటి అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు.


