శీతాకాలంలో, చాలా మంది వెచ్చని నీటితో స్నానం చేయడానికి ఇష్టపడతారు,ఎందుకంటే ఇది వెచ్చగా హాయిగా అనిపిస్తుంది. కానీ వేడి నీటితో స్నానం చేయడం ఆరోగ్యానికి హానికరం అని వారికి తెలీదు. నీటి ఉష్ణోగ్రత ఆరోగ్యంలో పాత్ర పోషిస్తుంది. కొన్ని లాభాలు ఉన్నప్పటికీ... నష్టాలు మరింత ఎక్కువ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైద్యులు చెబుతున్న ప్రకారం... వేడి నీటి స్నానం వల్ల కలిగే లాభాలు, నష్టాలను ఒకసారి పరిశీలిద్దాం...
ప్రయోజనాలున్నాయి...
వేడీ నీటి స్నానం వల్ల నష్టాలు అనేకం ఉన్నప్పటికీ... కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వేడి నీరు బిగుతుగా ఉన్న కండరాలు విశ్రాంతి తీసుకోవడానికి వాటికి ఉపశమనం అందించేందుకు ఉపకరిస్తుంది. అంతేకాకుండా అది రక్తనాళాలను విస్తరించి తద్వారా శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
రోజు మొత్తం ఏర్పడిన పని ఒత్తిడిని తగ్గించడానికి ఒక మార్గంగా కూడా పనిచేస్తుంది. సీజనల్ సమస్యలు ఎదుర్కునే వారు, శీతాకాలపు నొప్పులు లేదా అలసటను అనుభవించే వ్యక్తులకు అవి దూరం చేసేందుకు అనువైనది అలాగే శ్వాసకోశ ఆరోగ్యం సరిగా లేని లేదా తక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకోలేని వారికి మేలు చేస్తుంది. వేడి నీటి నుంచి వచ్చే ఆవిరి నాసికా భాగాలను క్లియర్ చేయడంలో, స్రవించే ముక్కును నియంత్రించడంలో సహాయపడుతుంది
దుష్ప్రభావాలెన్నో...
చాలా మందికి ఈ సీజన్‌లో అసౌకర్యంగా ఉండవచ్చు గానీ నిజానికి చల్లటి నీటి స్నానం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వేడి నీరు అలవాటు అయితే ఆ లాభాన్ని కోల్పోతాం. అంతేకాదు వేడి నీటికి ఎక్కువసేపు గురికావడం వల్ల చర్మం నుంచి సహజ నూనెలు కోల్పోతుంది. ఇది శీతాకాలంలో చర్మం పొడిబారడాన్ని మరింత తీవ్రతరం చేసి దురదకు దారితీస్తుంది. వేడి నీరు చర్మం బయటి పొరను కూడా దెబ్బతీస్తుంది తేమను నిలుపుకునే సామర్ధ్యాన్ని, పర్యావరణ సమస్యల నుంచి కాపాడుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.
అలాగే తామర లేదా సోరియాసిస్ వంటి కొన్ని పరిస్థితులను మరింత దిగజార్చవచ్చు రక్తపోటు పెరిగేకొద్దీ వెచ్చని నీటితో స్నానం చేయడం గుండెపై ఒత్తిడి పెంచుతుంది. వెచ్చని నీటితో స్నానం వల్ల్ల ఊపిరితిత్తులలో వాపు వచ్చే అవకాశం ఉంది. తద్వారా శ్వాస తీసుకోవడం కష్టమై అది తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. వేడి నీటితో స్నానం తలపై కేశాల మూలాలను బలహీనపరుస్తుంది, జుట్టు విరిగిపోవడానికి రాలడానికి దారితీస్తుంది.
అంతేకాదు గుండె జబ్బులు, ఆర్థరైటిస్ లేదా కండరాల సంబంధిత సమస్యలు ఉండే వారికి మంచిది కాదు.
నష్టాలు ఉన్నప్పటికీ.. కఠినమైన చలిని నివారించడానికి ప్రతిరోజూ వెచ్చని నీటితో స్నానం చేయకుండా ఉండడం అంత సులభం కాదు.. మరి ఈ పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు అవసరం?
ఏం చేయాలి?
నీటి ఉష్ణోగ్రత వీలైనంత తక్కువగా ఉంచడం. అలాగే వేడినీటిలో ఎక్కువ సేపు ఉండకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
శీతాకాలంలో వెచ్చని నీటిలో స్నానం గోరువెచ్చని నీటితో మాత్రమే చేయాలి. జుట్టు రాలడాన్ని నివారించడానికి మాయిశ్చరైజింగ్ హెయిర్ కండిషనర్‌ను అప్లై చేయాలి.
పనిని బట్టి చేసే శారీరక శ్రమని బట్టి 2 పూటలా కాకుండా ఒక్క పూటకు పరిమితం చేయడాలి.


