ఇండియాలో ఇటలీగా పేరొందిన హిల్‌ స్టేషన్‌..! ఎక్కడంటే.. | Do You Know Which Hill Station Is Called The Italy Of India, Check Out Interesting Facts About Lavasa | Sakshi
Sakshi News home page

ఇండియాలో ఇటలీగా పేరొందిన హిల్‌ స్టేషన్‌..! మన హైదరాబాద్‌కి జస్ట్‌..

Jan 4 2026 4:45 PM | Updated on Jan 4 2026 5:55 PM

Which Hill Station Is Called The Italy Of India

రోమ్‌లో ఉంటే రోమన్‌లాగా ఉండాలి అని విన్నాం కానీ మనం ఉన్న చోటునే రోమ్‌లాగా తీర్చిదిద్దుకోవాలి అనే మాట విన్నామా?  చుట్టూ కొండల నడుమ, మధ్యలో సరస్సు దాని చుట్టూ ఇళ్లు, రాతి రహదారులు... అచ్చం ఇటలీని పోలినట్టు తీర్చిదిద్దబడిన ఆ సిటీని చూస్తే కళ్లు అప్పగించాల్సిందే. భారతదేశంలోనే ఏ హిల్‌ స్టేషన్‌కూ లేని ప్రత్యేకతలెన్నో ఉన్న ఆ పర్వత పట్టణం పేరు లావాసా.

పూణే సమీపంలో  కొలువుదీరిన లావాసాను  ’ఇటలీ ఆఫ్‌ ఇండియా’ అని పిలుస్తారు. దాని పాస్టెల్‌–రంగు భవనాల, సరస్సు సమీపంలో విహారయాత్రలు  ఇరుకైన వీధుల నడుమ నడవగలిగే బౌలేవార్డ్‌లు సందర్శకులకు యూరోపియన్‌ అనుభూతిని అందిస్తాయి ఇదే ఇతర భారతీయ హిల్‌ స్టేషన్ల నుంచి ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా నిలబెడుతోంది.

అన్నింటికంటే విశేషం ఏమిటంటే...  క్రమక్రమంగా విస్తరించిన ఊటీ లేదా సిమ్లా వంటి సాంప్రదాయ హిల్‌ స్టేషన్ ల మాదిరిగా  కాకుండా, ఈ నగరాన్ని  ప్రణాళికాబద్ధంగా రూపొందించడం,భారతీయ కొండ వాతావరణంలో యూరోపియన్‌ అనుభూతిని పునఃసృష్టించడం, ప్రణాళికాబద్ధమైన కృషితో ప్రపంచ ఆకర్షణను మిళితం చేయడం అనే లక్ష్యాలతో ఇది రూపొందింది. పర్యాటకం, నివాస జీవితం  విశ్రాంతి మూడింటిని కలగలిపి ఓ సుందరమైన ప్రదేశంలో మిళితం చేసి లావాసాను పునాదుల స్థాయి నుంచే  నిర్మించారు. 

ఈ సిటీ లే అవుట్‌, డిజైన్ ఇటలీలోని తీరప్రాంత పట్టణం అయిన పోర్టోఫినో నుంచి ప్రేరణ పొందింది, ఇది పాదచారులకు అనుకూలమైన వీధులు, టెర్రకోట పైకప్పులు  రాళ్లతో చేసిన దారులతో ఉంటుంది. భవనాలు పీచ్, ఆలివ్‌  వంటి తేలికపాటి పాస్టెల్‌లతో పెయింట్‌ చేశారు,  తోరణాలు  టెర్రస్‌లు యూరోపియన్‌ ఆకర్షణను అందిస్తాయి. ఫోటోగ్రాఫర్‌లు, ప్రయాణికులు, వారాంతపు సందర్శకులను ఆకర్షించే విశ్రాంతి, సెలవుదినం లాంటి వాతావరణాన్ని సృష్టించడానికి రూపకర్తలు బహిరంగ ప్రదేశాలు, నడవగలిగే వీధులు  సరస్సు వీక్షణలపై దృష్టి సారించారు. దాస్వే సరస్సు చుట్టూ ఉన్న విహార ప్రదేశం. 

కేఫ్‌లు, బోటిక్‌లు  బహిరంగ సీటింగ్‌ ప్రాంతాలతో  ఇటాలియన్‌ ఓడరేవు పట్టణాల తరహాలో రిలాక్సడ్‌ వాటర్‌ ఫ్రంట్‌ జీవితాన్ని ఆస్వాదిస్తున్న అనుభూతిని ఇస్తుంది. సూర్యాస్తమయ సమయంలో ఈ విహార ప్రదేశంలో నడవడం లేదా సైక్లింగ్‌ చేయడం వల్ల చాలా మంది సందర్శకులు  యూరోపియన్‌ హాలిడే పట్టణంలో ఉన్నట్లు స్పష్టమైన అనుభూతిని పొందుతారు. పర్యావరణపరంగా సున్నితమైన పశ్చిమ కనుమలలో ఉండటం వల్ల, లావాసా రూపకల్పన సమయంలో పర్యావరణ అడ్డంకులు ఎదుర్కుంది. 

నీటి వినియోగం, కొండ–వాలు స్థిరత్వం  అటవీ సంరక్షణపై దృష్టి సారించి, హరిత చట్టాలకు అనుగుణంగా ఉన్నాయా లేవా అని సమీక్షించే క్రమంలో అధికారులు పలు దఫాలు నిర్మాణాన్ని నిలిపివేయాల్సి వచ్చింది. తరువాత షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేశారు.  అది పర్యావరణ ప్రమాదాలను తగ్గించుకుంటూ పట్టణం అభివృద్ధి చెందడానికి వీలు కల్పించింది. వారాంతపు విహారయాత్రకు లావాసా సరైన ప్రదేశం. ముఖ్యంగా వర్షాకాలం పూర్తయిన తర్వాత  పచ్చని కొండలు  స్పష్టమైన సరస్సు కళ్లు విప్పార్చుకునేలా చేస్తాయి. అనువైన నెలలు.
లావాసా ప్రత్యేకతలు

భారతదేశంలోని మొట్టమొదటి  ప్రణాళికతో కూడిన కొండ నగరం

  • ఈ పట్టణంలో బోటింగ్‌  విశ్రాంతి కార్యకలాపాల కోసం రూపొందించిన మానవ నిర్మిత సరస్సు ఉంది.

  • వీధులకు కోమో  జెనీవా వంటి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సరస్సులు  కొండల పేర్లు ఉంటాయి.

  • మిగిలిన హిల్‌ స్టేషన్స్‌కు భిన్నంగా ఈ సిటీలో సాంస్కృతిక ఉత్సవాలు సంగీత కార్యక్రమాలు జరుగుతుంటాయి.

  • సాహస కార్యకలాపాలలో ఉన్నవారి కోసం కొండలపై ట్రెక్కింగ్, విహార ప్రదేశాలలో సైక్లింగ్‌  సరస్సులో జల క్రీడలు ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఈ ఇండియన్‌ ఇటలీకి చేరుకోవాలంటే పూణే లేదా ముంబై మీదుగా వెళ్లవలసి ఉంటుంది.  పూణే నుంచి దూరం దాదాపు 60కి.మీ కాగా, ప్రయాణ సమయం 2 గంటల వరకూ పడుతుంది   ముంబై నుంచి 190 కి.మీ దూరంలో ఉంది, ప్రయాణ సమయం దాదాపు 5 గంటలు పడుతుంది.

(చదవండి: నటుడు ఆర్నాల్డ్‌ 'క్రాష్ డైట్'..!బరువు తగ్గడానికి కాదు..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement