నటుడు ఆర్నాల్డ్‌ 'క్రాష్ డైట్'..!బరువు తగ్గడానికి కాదు.. | Arnold Schwarzeneggers Wellness Advice 2026 Crash Diet To Boost Mental And Emotional Wellbeing, More Details Inside | Sakshi
Sakshi News home page

నటుడు ఆర్నాల్డ్‌ 'క్రాష్ డైట్'..!బరువు తగ్గడానికి కాదు..

Jan 4 2026 2:58 PM | Updated on Jan 4 2026 4:13 PM

Arnold Schwarzeneggers  wellness advice 2026 Crash Diet  Targets The Brain

ఏ డైట్‌ అయినా హెల్దీగా ఉండేందుకు బరువు తగ్గడం కోసం లేదా అదుపులో ఉంచుకునేందుకు. చెప్పాలంటే స్లిమ్‌గా..చూడచక్కని ఆకర్ణణీయమైన లుక్‌ కోసం అంతలా డైట్‌పై ఫోకస్‌ పెడుతుంటారు. అయితే మన హాలీవుడ్‌ ఐకాన్‌, మాజీ బాడీబిల్డింగ్‌ ఛాంపియన్‌ మాత్రం కొత్త ఏడాదిలో సరికొత్త క్రాష్‌ డైట్‌ని ఫాలో అవుతున్నాననంటూ తన సోషల్‌ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే ఇదేమి త్వరితగతిన బరువు తగ్గి..స్లిమ్‌గా మారే డైట్‌ మాత్రం కాదట. ఎందుకోసమో వింటే షాక్‌ అవుతారు. అందుకోసం ఇలాంటి డైట్‌లు కూడా ఉంటాయా? అని విస్తుపోవడం మాత్రం ఖాయం.

78 ఏళ్ల హాలీవుడ్‌ స్టార్ హీరో ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ ఆస్ట్రియన్-అమెరికన్ చలనచిత్ర నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త, మాజీ బాడీబిల్డర్. అంతేకాకుండా ఆర్నాల్డ్ స్క్వార్జ్నెగెర్ రిపబ్లికన్ పార్టీ (యునైటెడ్ స్టేట్స్) రాజకీయ నాయకుడు. ఆయన 2003, 2011ల మధ్య కాలిఫోర్నియాకు 38వ గవర్నర్‌గా కూడా పనిచేశారు. 

 ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా టైమ్‌ మ్యాగ్జైన్‌లో చోటు సైతం దక్కించుకున్నారు. అలాంటి వ్యక్తి ఈ కొత్త ఏడాదిలో ప్రత్యేకమైన క్రాష్‌ డైట్‌ ప్రారంభిస్తానంటూ చేసిన పోస్ట్‌ అదర్ని విస్తుపోయేలా చేయడమే కాకుండా అమితంగా ఆకర్షించింది. అసలేంటి ఈ డైట్‌ అంటే..

ఆర్నాల్డ్‌ ప్రకారం క్రాష్‌డైట్‌ బరువు తగ్గడం కోసం కాదట..ప్రతికూలతలను తొలగించే లక్ష్యంతో మానసిక రీసెట్‌ కోసం అనుసరించే డైట్‌ అని పోస్ట్‌లో పేర్కొన్నారు. సాధారణంగా క్రాష్‌ డైట్‌ అనగానే..త్వరితిగతిన మార్పులు, ఫలితాన్ని అందుకునేవి అనే అందరూ భావిస్తారు. కానీ ఇది అందుకు విరుద్ధం. అయితే తాను చెప్పే డైట్‌ బాడీ కోసం కాదని, మెదడు కోసమని చెప్పుకొచ్చారు. 

ఈ డైట్‌ ప్రకారం..ఒక వారం పాటు ప్రతికూలత ఆలోచనలు, విషపూరితమైన ఆలోచనలు, ఇతరుల పట్ల విమర్శనాత్మక ధోరణి వంటి ఏమి లేకుండా వ్యవహరించడం. ఇది ఒక్కసారి ప్రయత్నిస్తే..మానసిక శారీరక ఆరోగ్యం చాలా బాగుంటుందని అన్నారు. నిజానికి ప్రతికూలత అనేది భావోద్వేగపరంగా శరీరానికి చాలా హానికరమని నొక్కి చెప్పారు. నెగిటివిటీ అనేది మనల్ని అక్షరాల చంపేస్తుందని హెచ్చరించారు.

నటుడు ఆర్నా ల్డ్‌సందేశం ఒకరకంగా ఆశ్చర్యానికి లోనయ్యేలా చేసినా..ప్రేరణగా నిలిచింది. అంతేగాదు డైట్‌లు అనేవి కేవలం శారీరక అనుకూలత కోసమే కాదు, మానసిక ఆరోగ్యం కోసం ఏర్పరచుకోవచ్చు అని సరికొత్త ఆలోచనకు నాంది పలికారు ఆర్నాల్డ్‌. ఇక్కడ ఆయన ఉద్దేశ్యం ఏంటంటే మానసిక-శారీరక శ్రేయస్సు కోసం ఇలాంటి "జీరో నెగటివిటీ డైట్" తప్పక తీసుకోవాలని తన అభిమానులకు పిలుపునిచ్చారు. 

అంతేగాదు ఆశావాదులే ఎక్కువకాలం జీవిస్తారని పలు అధ్యయనాల్లో కూడా నిరూపితమైందని గుర్తు చేశారు. అందువల్ల మనం నిరాశవాదం, విమర్శలు, కోపాన్ని త్యజిద్దాం అని ప్రజలను కోరారు. అందుకోసం మన రోజులో ఇవి లేకుండా ఉండే క్రాష్‌ డైట్‌ని జీవితంలో భాగం చేసుకుందామని అన్నారు. 

ఈ డైట్‌లో ఏం చేయాలంటే..

  • ప్రతి రోజు మూడు పూటలా కనీసం ఓ పదినిమిషాలు సోషల్‌ మీడియాను చూడకుండా ఉండటం. 

  • ఉద్యోగ దరఖాస్తులుపై మనసు లగ్నం చేయడం లేదా చేయవలసిన ముఖ్యమైన పనులపై ఫోకస్‌ పెట్టడం

  • రోజు మనకు ఎదురయ్యే సవాళ్లకు కృతజ్ఞత చెప్పడం. ఎందుకంటే అవి మనలోని అంతర్గత శక్తిని బహిర్గతం చేస్తాయి. 

చివరగా ఆర్నాల్డ్‌ ప్రతికూలతలను తగ్గించుకోవడం అనేది మనల్ని మనం ఉద్ధిరించడానికే కాదు..జీవితాన్ని మారుస్తుంది, కాపాడుతుంది కూడా. 

(చదవండి: ఆ కారణంగానే శాకాహారిగా మారా..!: నటి జెనీలియా)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement