breaking news
Arnold Schwarzenegger
-
నటుడు ఆర్నాల్డ్ 'క్రాష్ డైట్'..!బరువు తగ్గడానికి కాదు..
ఏ డైట్ అయినా హెల్దీగా ఉండేందుకు బరువు తగ్గడం కోసం లేదా అదుపులో ఉంచుకునేందుకు. చెప్పాలంటే స్లిమ్‌గా..చూడచక్కని ఆకర్ణణీయమైన లుక్ కోసం అంతలా డైట్‌పై ఫోకస్ పెడుతుంటారు. అయితే మన హాలీవుడ్ ఐకాన్, మాజీ బాడీబిల్డింగ్ ఛాంపియన్ మాత్రం కొత్త ఏడాదిలో సరికొత్త క్రాష్ డైట్‌ని ఫాలో అవుతున్నాననంటూ తన సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే ఇదేమి త్వరితగతిన బరువు తగ్గి..స్లిమ్‌గా మారే డైట్ మాత్రం కాదట. ఎందుకోసమో వింటే షాక్ అవుతారు. అందుకోసం ఇలాంటి డైట్లు కూడా ఉంటాయా? అని విస్తుపోవడం మాత్రం ఖాయం.78 ఏళ్ల హాలీవుడ్ స్టార్ హీరో ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ ఆస్ట్రియన్-అమెరికన్ చలనచిత్ర నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త, మాజీ బాడీబిల్డర్. అంతేకాకుండా ఆర్నాల్డ్ స్క్వార్జ్నెగెర్ రిపబ్లికన్ పార్టీ (యునైటెడ్ స్టేట్స్) రాజకీయ నాయకుడు. ఆయన 2003, 2011ల మధ్య కాలిఫోర్నియాకు 38వ గవర్నర్‌గా కూడా పనిచేశారు. ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా టైమ్ మ్యాగ్జైన్లో చోటు సైతం దక్కించుకున్నారు. అలాంటి వ్యక్తి ఈ కొత్త ఏడాదిలో ప్రత్యేకమైన క్రాష్ డైట్ ప్రారంభిస్తానంటూ చేసిన పోస్ట్ అదర్ని విస్తుపోయేలా చేయడమే కాకుండా అమితంగా ఆకర్షించింది. అసలేంటి ఈ డైట్ అంటే..ఆర్నాల్డ్ ప్రకారం క్రాష్‌డైట్ బరువు తగ్గడం కోసం కాదట..ప్రతికూలతలను తొలగించే లక్ష్యంతో మానసిక రీసెట్ కోసం అనుసరించే డైట్ అని పోస్ట్‌లో పేర్కొన్నారు. సాధారణంగా క్రాష్ డైట్ అనగానే..త్వరితిగతిన మార్పులు, ఫలితాన్ని అందుకునేవి అనే అందరూ భావిస్తారు. కానీ ఇది అందుకు విరుద్ధం. అయితే తాను చెప్పే డైట్ బాడీ కోసం కాదని, మెదడు కోసమని చెప్పుకొచ్చారు. ఈ డైట్ ప్రకారం..ఒక వారం పాటు ప్రతికూలత ఆలోచనలు, విషపూరితమైన ఆలోచనలు, ఇతరుల పట్ల విమర్శనాత్మక ధోరణి వంటి ఏమి లేకుండా వ్యవహరించడం. ఇది ఒక్కసారి ప్రయత్నిస్తే..మానసిక శారీరక ఆరోగ్యం చాలా బాగుంటుందని అన్నారు. నిజానికి ప్రతికూలత అనేది భావోద్వేగపరంగా శరీరానికి చాలా హానికరమని నొక్కి చెప్పారు. నెగిటివిటీ అనేది మనల్ని అక్షరాల చంపేస్తుందని హెచ్చరించారు.నటుడు ఆర్నా ల్డ్సందేశం ఒకరకంగా ఆశ్చర్యానికి లోనయ్యేలా చేసినా..ప్రేరణగా నిలిచింది. అంతేగాదు డైట్లు అనేవి కేవలం శారీరక అనుకూలత కోసమే కాదు, మానసిక ఆరోగ్యం కోసం ఏర్పరచుకోవచ్చు అని సరికొత్త ఆలోచనకు నాంది పలికారు ఆర్నాల్డ్. ఇక్కడ ఆయన ఉద్దేశ్యం ఏంటంటే మానసిక-శారీరక శ్రేయస్సు కోసం ఇలాంటి "జీరో నెగటివిటీ డైట్" తప్పక తీసుకోవాలని తన అభిమానులకు పిలుపునిచ్చారు. అంతేగాదు ఆశావాదులే ఎక్కువకాలం జీవిస్తారని పలు అధ్యయనాల్లో కూడా నిరూపితమైందని గుర్తు చేశారు. అందువల్ల మనం నిరాశవాదం, విమర్శలు, కోపాన్ని త్యజిద్దాం అని ప్రజలను కోరారు. అందుకోసం మన రోజులో ఇవి లేకుండా ఉండే క్రాష్ డైట్‌ని జీవితంలో భాగం చేసుకుందామని అన్నారు. ఈ డైట్లో ఏం చేయాలంటే..ప్రతి రోజు మూడు పూటలా కనీసం ఓ పదినిమిషాలు సోషల్ మీడియాను చూడకుండా ఉండటం. ఉద్యోగ దరఖాస్తులుపై మనసు లగ్నం చేయడం లేదా చేయవలసిన ముఖ్యమైన పనులపై ఫోకస్ పెట్టడంరోజు మనకు ఎదురయ్యే సవాళ్లకు కృతజ్ఞత చెప్పడం. ఎందుకంటే అవి మనలోని అంతర్గత శక్తిని బహిర్గతం చేస్తాయి. చివరగా ఆర్నాల్డ్ ప్రతికూలతలను తగ్గించుకోవడం అనేది మనల్ని మనం ఉద్ధిరించడానికే కాదు..జీవితాన్ని మారుస్తుంది, కాపాడుతుంది కూడా. (చదవండి: ఆ కారణంగానే శాకాహారిగా మారా..!: నటి జెనీలియా) -
ఆర్నాల్డ్ సుభాష్‌నగర్.. ఎక్కడున్నాడీ వ్యక్తి !
వ్యాపారంలో నిరంతరం బిజీగా ఉన్నా కచ్చితంగా వీలు చేసుకుని సోషల్ మీడియాకి వచ్చే ఇండస్ట్రియలిస్టుల్లో ముందు వరుసలో ఉంటారు ఆనంద్ మహీంద్రా, హర్ష్ గోయెంకాలు. సమకాలిన అంశాలపై స్పందించడంతో పాటు అప్పుడప్పుడు నవ్వులు పూయించే ఫోటోలు, వీడియోలు కూడా షేర్ చేస్తుంటారు. కాకతాళీయంగా ఈ సారి ఇద్దరు ఒకే రోజు అలాంటి ఫోటో/వీడియోను షేర్ చేశారు. ప్రపంచంలో ఏ విషయాన్నైనా ఇండియనైజ్డ్ చేయడంలో మన వాళ్లకు సాటి లేదు. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక వీడియోలు/ఫోటోలు సోషల్ మీడియాలో దండయాత్ర చేశాయి. కానీ ఓ కొత్త ఫోటోను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. హాలీవుడ్ కండల వీరుడు టెర్మినేటర్, కమాండో ఆర్నాల్డ్ షార్వ్జ్నెగ్గర్ పేరు రాయడం, పలకడంలో ఇప్పటికీ ఇండియన్లు ఇబ్బంది పడుతూనే ఉంటారు. అందుకే ఓ వీధికి ఆర్నాల్డ్ షార్వ్జ్నెగర్ అని రాయకుండా దేశీ స్టైల్లో ఆర్నాల్డ్ సుభాష్‌నగర్ అని రాసేశారు. ‘ఎందుకు ఇంత కాలం ఆర్నాల్డ్ పూర్తి పేరు పలికేందుకు ఇబ్బంది పడ్డాను సింపుల్‌గా సుభాష్ నగర్ అని పిలిస్తే పోయేదానికి అంటూ కామెంట్ పెట్టారు ఆనంద్ మహీంద్రా. This is the ‘Great Indian Funnel.’ We adopt everything and everyone & give them Indian Avatars! हम पूरी दुनिया को अपनाते हैं. (And I wonder why I used to try so hard to pronounce ‘Schwarzenegger’ when I could have just called him Mr. Subhashnagar..) pic.twitter.com/zqOZN05k2N — anand mahindra (@anandmahindra) June 16, 2022 మరోవీడియో హర్ష గోయెంకా తనలోని సెన్సాఫ్ హ్యుమర్‌ని పండించారు. తనకు ఈ మధ్యనే బరువు తగ్గడానికి డైట్ చేయంటూ సూచించారు. అందు కోసం రోజుకే ఒకేట రోటీ తినమని చెప్పారంటూ కామెంట్ చేశారు. ఆ ఒక్క రొట్టే తయారు చేసే వ్యక్తి కోసం వెదుకుతున్నట్టు కూడా పేర్కొన్నారు. తీరా ఎవరా ఒక్క వ్యక్తి అని తెలుసుకోవాలంటే మీరే ఆ వీడియో చూడండ మరి! I’ve been asked to lose weight and eat only one roti. Now I’m searching for him….😄 pic.twitter.com/SEIPuA47gP — Harsh Goenka (@hvgoenka) June 16, 2022 చదవండి: ఆనంద్ మహీంద్రా సందేశం.. పనంతా నువ్వొక్కడివే చేయకు! -
‘2.ఓకు కమల్‌ను కూడా అడిగా’
భారతీయ సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2.ఓ రిలీజ్‌కు సమయం దగ్గరపడుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో పాటు ప్రమోషన్ పనుల్లో కూడా వేగం పెంచారు చిత్రయూనిట్. వరుసగా పోస్టర్లతో సందడి చేస్తున్న 2.ఓ టీం నవంబర్ 3న భారీ ఈవెంట్లో ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. ప్రమోషన్లో భాగంగా మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న దర్శకుడు శంకర్ ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా సినిమాలో ప్రతినాయక పాత్ర కోసం కమల్‌హాసన్‌ను కూడా సంప్రదించినట్టుగా తెలిపారు శంకర్. ముందుగా ఈ పాత్రకు హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ సంప్రదించారు. నిర్మాణ సంస్థతో ఒప్పందం కుదరకపోవటంతో ఆర్నాల్డ్ సినిమాతో నటించలేదు. ఆర్నాల్డ్ తరువాత కమల్‌ను సంప్రదించినట్టుగా వికటన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు శంకర్. రచయిత జియా మోహన్‌తో కలిసి కమల్ కు కథ కూడా వినిపించామని అయితే కమల్, పెద్దగా ఆసక్తి కనబరచకపోవటంతో నిర్మాతల ద్వారా అక్షయ్ కుమార్‌ను సంప్రదించినట్టుగా వెల్లడించారు. అయితే ఈ పాత్ర అక్షయ్ కోసం తయారైంది కాబట్టే కమల్ కాదని ఉంటారన్నారు శంకర్. అక్షయ్‌తో వర్క్ చేశాక, కమల్ చేయకపోవటం పెద్దగా బాధించలేదని వెల్లడించారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ 500 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా నవంబర్ 29 ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ కానుంది. -
కొత్త గర్లఫ్రెండ్ తో 66 ఏళ్ల ఆర్నాల్డ్ ష్క్వాజ్ నెగ్గర్ డేటింగ్!
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ లో తనకంటూ ఓ ముద్రను వేసుకుని విశేష అభిమానులను సంపాదించుకున్న ఆర్నాల్డ్ ష్క్వాజ్ నెగ్గర్ తాజాగా ఓ గర్లఫ్రెండ్ తో చక్కర్లు కొట్టుతుండటంతో మరోమారు వార్తల్లో నిలిచాడు. ఓ మహిళను వివాహం చేసుకుని సుదీర్ఘ కాలంపాటు ఆమెతోనే వైవాహిక జీవితాన్ని పంచుకున్న ఆర్నాల్డ్ స్క్వాజ్ నెగర్ తాజాగా ఓ అమ్మాయితో డేటింగ్ చేస్తున్నట్లు వచ్చినట్లు వార్తలకు మరింత బలం చేకూర్చుతూ ఓ ముద్దు సన్నివేశం ఒకటి ఓ డాట్.కామ్ లో ప్రత్యక్షమైంది. సెప్టింబర్ 20వ తేదీన లాస్ ఏంజిల్స్ లోని పెయిర్ మోంట్ హోటల్లోని ఫిగ్ రెస్టారెంట్ లో తన గర్లఫ్రెండ్ హీథర్ మిల్లిగన్ తో కలిసి డిన్నర్ చేసిన అనంతరం కారు దిగుతూ ఆమెను ముద్దాడిన ఘటన టీఎమ్ జడ్ .కామ్ లో తారసపడింది. ఆర్నాల్డ్ ఓ అమ్మాయిని ముద్దాడిన ఈ సన్నివేశం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో తాజాగా హీథర్ తో కలిసి ఆర్నాల్డ్ డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు కోడై కూస్తున్నాయి. గతంలో మరియా ష్రివర్ ను పెళ్లి చేసుకుని 25 ఏళ్ల పాటు జీవనయానం కొనసాగించిన ఆర్నాల్డ్ 2011లో ఆమెతో తెగదెంపులు చేసుకున్నాడు. అమెరికాలో ఇన్నేళ్ల పాటు భార్యతో కలిసి జీవించడం గమనించదగ్గ విషయమే.


