‘2.ఓకు కమల్‌ను కూడా అడిగా’ | Shankar Reveals that Kamal Haasan was Offered Akshay Kumar Role | Sakshi
Sakshi News home page

Nov 1 2018 4:17 PM | Updated on Nov 1 2018 8:28 PM

Shankar Reveals that Kamal Haasan was Offered Akshay Kumar Role - Sakshi

భారతీయ సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2.ఓ రిలీజ్‌కు సమయం దగ్గరపడుతోంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలతో పాటు ప్రమోషన్‌ పనుల్లో కూడా వేగం పెంచారు చిత్రయూనిట్. వరుసగా పోస్టర్లతో సందడి చేస్తున్న 2.ఓ టీం నవంబర్‌ 3న భారీ ఈవెంట్‌లో ట్రైలర్‌ రిలీజ్‌ చేయనున్నారు.

ప్రమోషన్‌లో భాగంగా మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న దర్శకుడు శంకర్‌ ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా సినిమాలో ప్రతినాయక పాత్ర కోసం కమల్‌హాసన్‌ను కూడా సంప్రదించినట్టుగా తెలిపారు శంకర్‌. ముందుగా ఈ పాత్రకు హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్‌ స్క్వార్జెనెగర్ సంప్రదించారు. నిర్మాణ సంస్థతో ఒప్పందం కుదరకపోవటంతో ఆర్నాల్డ్ సినిమాతో నటించలేదు.

ఆర్నాల్డ్‌ తరువాత కమల్‌ను సంప్రదించినట్టుగా వికటన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు శంకర్‌. రచయిత జియా మోహన్‌తో కలిసి కమల్‌ కు కథ కూడా వినిపించామని అయితే కమల్‌, పెద్దగా ఆసక్తి కనబరచకపోవటంతో నిర్మాతల ద్వారా అక్షయ్‌ కుమార్‌ను సంప్రదించినట్టుగా వెల్లడించారు.

అయితే ఈ పాత్ర అక్షయ్‌ కోసం తయారైంది కాబట్టే కమల్ కాదని ఉంటారన్నారు శంకర్‌. అక్షయ్‌తో వర్క్‌ చేశాక, కమల్ చేయకపోవటం పెద్దగా బాధించలేదని వెల్లడించారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ 500 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా నవంబర్‌ 29 ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్‌ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement