లీలావతి వినోదం | Lavanya Tripathi Speech At Sathi Leelavathi Release Date Announcement | Sakshi
Sakshi News home page

లీలావతి వినోదం

Feb 13 2026 3:17 AM | Updated on Feb 13 2026 3:17 AM

Lavanya Tripathi Speech At Sathi Leelavathi Release Date Announcement

లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్‌ మోహన్‌ జంటగా తాతినేని సత్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సతీ లీలావతి’. నాగ మోహన్‌ నిర్మించిన ఈ సినిమా మార్చి 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ–‘‘సతీ లీలావతి’ సినిమా ప్రారంభించినప్పుడు నేను గర్భవతిని. మూడు నెలల్లోనే ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేశాం.

దర్శక–నిర్మాతల సపోర్ట్‌ వల్లే ఇది సాధ్యమైంది. పూర్తి వినోదాత్మక చిత్రం ఇది. ప్రేక్షకులందరికీ ఈ సినిమా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అని అన్నారు. ‘‘కమల్‌హాసన్‌గారి ‘సతీ లీలావతి’ చిత్రంతో నా సినిమాను పోల్చను. కానీ ప్రేక్షకులందరూ రిలేట్‌ అయ్యేలా మా సినిమాను తీశాం’’ అని చెప్పారు తాతినేని సత్య. ‘‘ఇది నా తొలి చిత్రం. ఈ సినిమా ప్రయాణంలో నేను ఎన్నో నేర్చుకున్నాను’’ అని చెప్పారు నాగ మోహన్‌. నటుడు సప్తగిరి మాట్లాడారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement