రెండు గంటలు హాయిగా నవ్వుకుంటారు: విశ్వక్‌ సేన్‌ | Vishwak Sen Made Interesting Comments About Funky Movie At Pre Release Press Meet, Deets Inside | Sakshi
Sakshi News home page

రెండు గంటలు హాయిగా నవ్వుకుంటారు: విశ్వక్‌ సేన్‌

Feb 13 2026 3:05 AM | Updated on Feb 13 2026 11:21 AM

Funky Movie Pre Release Press Meet

అనుదీప్, కయాదు లోహర్, విశ్వక్‌ సేన్, నాగవంశీ

‘‘స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ‘ఫంకీ’ సినిమా చూసి ఎంజాయ్‌ చేయండి. రెండు గంటలు ఎలా అయిపోయాయో కూడా తెలియనంతగా మా సినిమా చూసి హాయిగా నవ్వుకుంటారు’’ అని విశ్వక్‌ సేన్‌ తెలిపారు. ఆయన హీరోగా, కయాదు లోహర్‌ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘ఫంకీ’. 

కేవీ అనుదీప్‌ దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా నేడు విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌లో అనుదీప్‌ కేవీ మాట్లాడుతూ–‘‘మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. కుటుంబంతో కలిసి సినిమాను ఎంజాయ్‌ చేయాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు. ‘‘ఫంకీ’ నా కెరీర్‌లో మొదటి కామెడీ సినిమా’’ అన్నారు కయాదు లోహర్‌. ‘‘సినిమా నేపథ్యంలో జరిగే కథ ఇది. దర్శకుడికి, నిర్మాత కూతురికి మధ్య జరిగే సరదా కథ’’ అన్నారు సూర్యదేవర నాగవంశీ.

Advertisement
 
Advertisement
Advertisement