ఆర్నాల్డ్‌ సుభాష్‌నగర్‌.. ఎక్కడున్నాడీ వ్యక్తి ! | Anand Mahindra Harsh Goenka Made Fun In Twitter | Sakshi
Sakshi News home page

ఆర్నాల్డ్‌ సుభాష్‌నగర్‌.. ఎక్కడున్నాడీ వ్యక్తి !

Jun 17 2022 1:57 PM | Updated on Jun 17 2022 2:03 PM

Anand Mahindra Harsh Goenka Made Fun In Twitter - Sakshi

వ్యాపారంలో నిరంతరం బిజీగా ఉన్నా కచ్చితంగా వీలు చేసుకుని సోషల్‌ మీడియాకి వచ్చే ఇండస్ట్రియలిస్టుల్లో ముందు వరుసలో ఉంటారు ఆనంద్‌ మహీంద్రా, హర్ష్‌ గోయెంకాలు. సమకాలిన అంశాలపై స్పందించడంతో పాటు అప్పుడప్పుడు నవ్వులు పూయించే ఫోటోలు, వీడియోలు కూడా షేర్‌ చేస్తుంటారు. కాకతాళీయంగా ఈ సారి ఇద్దరు ఒకే రోజు అలాంటి ఫోటో/వీడియోను షేర్‌ చేశారు.

ప్రపంచంలో ఏ విషయాన్నైనా ఇండియనైజ్డ్‌ చేయడంలో మన వాళ్లకు సాటి లేదు. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక వీడియోలు/ఫోటోలు సోషల్‌ మీడియాలో దండయాత్ర చేశాయి. కానీ ఓ కొత్త ఫోటోను ఆనంద్‌ మహీంద్రా షేర్‌ చేశారు. హాలీవుడ్‌ కండల వీరుడు టెర్మినేటర్‌, కమాండో ఆర్నాల్డ్‌ షార్వ్జ్‌నెగ్గర్‌ పేరు రాయడం, పలకడంలో ఇప్పటికీ ఇండియన్లు ఇబ్బంది పడుతూనే ఉంటారు. అందుకే ఓ ‍వీధికి ఆర్నాల్డ్‌ షార్వ్జ్‌నెగర్‌ అని రాయకుండా దేశీ స్టైల్‌లో ఆర్నాల్డ్‌ సుభాష్‌నగర్‌ అని రాసేశారు. ‘ఎందుకు ఇంత కాలం ఆర్నాల్డ్‌ పూర్తి పేరు పలికేందుకు ఇబ్బంది పడ్డాను సింపుల్‌గా సుభాష్‌ నగర్‌ అని పిలిస్తే పోయేదానికి అంటూ కామెంట్‌ పెట్టారు ఆనంద్‌ మహీంద్రా.

మరోవీడియో హర్ష గోయెంకా తనలోని సెన్సాఫ్‌ హ్యుమర్‌ని పండించారు. తనకు ఈ మధ్యనే బరువు తగ్గడానికి డైట్‌ చేయంటూ సూచించారు. అందు కోసం రోజుకే ఒకేట రోటీ తినమని చెప్పారంటూ కామెంట్‌ చేశారు. ఆ ఒక్క రొట్టే తయారు చేసే వ్యక్తి కోసం వెదుకుతున్నట్టు కూడా పేర్కొన్నారు. తీరా ఎవరా ఒక్క వ్యక్తి అని తెలుసుకోవాలంటే మీరే ఆ వీడియో చూడండ మరి! 

చదవండి: ఆనంద్‌ మహీంద్రా సందేశం.. పనంతా నువ్వొక్కడివే చేయకు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement