ఆనంద్‌ మహీంద్రా సందేశం.. పనంతా నువ్వొక్కడివే చేయకు!

Anand Mahindra Message On Roster Video - Sakshi

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆనంద్‌ మహీంద్రా వైరల్‌గా మారిన ఓ వీడియోను షేర్‌ చేశారు. అందులో కనిపించే దృశ్యం ద్వారా మీకు ఏం అర్థమైందంటూ ప్రశ్నించారు. మరుసటి రోజే తనకు ఏం స్ఫూరించిందో ట్విటర్‌ ద్వారా తెలిపారు.

ఆనంద్‌ మహీంద్రా షేర్‌ చేసిన వీడియోలో ఓ కోడిపుంజు గుక్క తిప్పుకోకుండా కూత పెడుతుంది. అలా శృతి మించి కూత పెడుతూ చివరకు కింద పడిపోతుంది.  దీనికి తనదైన భాష్యం చెప్పారు ఆనంద్‌ మహీంద్రా... అందరి తరఫునా మనమే అన్ని పనులు చేయాలని అనుకోవడం దండగని  దాని వల్ల  మనమే ఖర్చయిపోతామంటూ నేటి యువతకు సందేశం ఇచ్చారు.

చదవండి: తప్పు చేస్తే.. తప్పించుకోలేరు! సూపర్‌టెక్‌కి దెబ్బ మీద దెబ్బ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top