చాలామందికి బానపొట్ట పెద్దగా ఉండి ఏ డ్రెస్ లేదా చీర కట్టుకోవాలన్న ఇబ్బందిగా ఉంటుంది. ఓపట్టాన తగ్గదు కూడా. బొడ్డుకొవ్వుతో ఉండే ఇబ్బంది అంత ఇంత కాదు. అలాంటి మొండి బొడ్డుకొవ్వుని ఈ పానీయం సులభంగా కరింగించేయడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తోంది. మరి ఆ పానీయం ఏంటో పోషకాహార నిపుణుల మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.
అతిగా తినడం లేదా క్రమరహిత దినచర్యల కారణంగా అధికబరువు, బెల్లీఫ్యాట్ వంటి సమస్యలను ఫేస్ చేస్తుంటాం. అలాంటి వారు దాల్చిన చెక్క పొడిని, సత్తు నీటికి జత చేసి తీసుకుంటే అద్భుత ఫలితం ఉంటుదని చెబుతున్నారు నిపుణులు. సత్తులో పుష్కలమైన ఫైబర్ ఉంటుంది. ఇది కడుపు నిండిన అనుభూతిని అందిస్తుంది. జీర్ణక్రియకు మద్దతిస్తుంది. పేగు ఆర్యోగం, రక్తంలోని చక్కెర నియంత్రణకు మద్దతిస్తుంది.
ఇది బరువు తగ్గడానికే కాకుండా బొడ్డు కొవ్వుని కరిగించడంలోనూ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పానీయం మలబద్ధకాన్ని తగ్గించగలదని పరిశోధనల్లో కూడా వెల్లడైంది. ఆకలి బాధను అదుపులో ఉంచగలదు, శక్తిస్థాయిలను పెంచుతుంది. మెక్కల ఆధారిత ప్రోటీన్, ఖనిజాలతో నిండి ఉన్న సత్తు శరీరానికి కావల్సిన తక్షణ శక్తిని అందిస్తుంది. ఇది సంక్లిష్ట పదార్థాల మిశ్రమం కాబట్టి నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తాయి. అలాగే దాల్చిన చెక్కలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని విషపదార్థాలను సులభంగా బయటకి పంపించగలదు.
తయారీ విధానం..
సత్తు: 1 టేబుల్ స్పూన్
గోరువెచ్చని నీరు: 1 గ్లాసు
దాల్చిన చెక్క పొడి: చిటికెడు
నిమ్మరసం: కొన్ని చక్కలు
చేయు విధానం: సత్తుని గోరువెచ్చని నీటిలో బాగా కలిపి, దానిలో చిటికెడు దాల్చిన చెక్క పొడి, నిమ్మచుక్కలు వేసి తాజాగా కలుపుకుని తాగితే సరి. అయితే దీనికి చక్కెర వంటి స్వీట్‌ని జోడించకపోవడమే మంచిది.
ప్రయోజనాలు..
ఈ పానీయంలో ఉండే అధిక ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను నెమ్మదించి, సంతృప్తిని ప్రోత్సహిస్తుంది.
ఇది మొత్తం కేలరీలను తీసుకోవడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక దాల్చిన చెక్క ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
అలాగే బొడ్డు చుట్టూ కొవ్వు నిల్వకు దోహదపడే చక్కెర స్పైక్‌లను నివారిస్తుంది.
పైగా రక్తంలో చక్కెర స్థాయిలను, ఆకలిని సమర్థవంతంగా నిర్వహిస్తుంది.
ఎవరికి మంచిది కాదంటే..
కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఇది మంచిది కాదు. ఎందుకంటే సత్తులో అధికంగా ప్రోటీన్‌లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి మూత్రపిండాల సమస్యలు ఉన్నవారికి ఇది తీసుకుంటే మూత్రపిండాలపై మరింత భారం పడుతుంది.
కొన్ని రకాల పిండుల మిశ్రమం అయిన ఈ సత్తు కొందరికి ఆయా పప్పులు వల్ల ఎలర్జీ ఉంటే వారికి కూడా మంచిది కాదు.
ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తక్కువగా ఉండేలా చేస్తుంది కాబట్టి కొందరిలో ఇది హైపోగ్లైసీమియాకు గురయ్యేలా చేసే ప్రమాదం ఉంది. అ
లాగే జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారికి కూడా ఇది కాస్త అసౌకర్యాన్ని కలిగించవచ్చు.
చివరగా ఈ పానీయం అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందిచినప్పటికీ..దానికి మన ఆరోగ్యకరమైన జీవనశైలి తోడైతేనే మంచి ఫలితాలను మనం అందుకోగలుగుతామని అంటున్నారు నిపుణులు. ఇది ఒక్కటే బొడ్డుకొవ్వుని మాయం చేస్తుందనే అపోహలో ఉండొద్దని హచ్చరిస్తున్నారు నిపుణులు.
దీనితోపాటు హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోవడం, అధిక శుద్ధి చేసిన చక్కెర పదార్థాలను నివారించడం, తగినంత ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులను చేర్చడం వంటివి చేయాలి. అలాగే తేలికపాటి వ్యాయమాలు కూడా జోడిస్తే..మరిన్ని ప్రయోజనాలను పొందగలమని చెబుతున్నారు నిపుణులు. అలాగే భోజనం చేసిన వెంటనే కాస్త నాలుగు అడుగులు వేయమని సూచిస్తున్నారు నిపుణులు.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: నటుడు ఆర్నాల్డ్ 'క్రాష్ డైట్'..!బరువు తగ్గడానికి కాదు..)


