చూపును కాపాడే ఔషధం | Scientists in Korea develop retinal therapy to restore lost vision | Sakshi
Sakshi News home page

చూపును కాపాడే ఔషధం

Feb 22 2026 3:33 AM | Updated on Feb 22 2026 3:33 AM

Scientists in Korea develop retinal therapy to restore lost vision

రెటీనా దెబ్బతినడం వల్ల చాలామంది కంటిచూపును కోల్పోతుంటారు. రెటీనా దెబ్బతినడానికి రకరకాల కారణాలు ఉంటాయి. వయసు మళ్లడం, డయాబెటిస్, రెటీనా స్థానభ్రంశం చెందడం వంటి కారణాల వల్ల రెటీనా క్రమంగా దెబ్బతిని చూపు కోల్పోయే పరిస్థితులు వాటిల్లుతాయి. రెటీనా దెబ్బతినడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు నాలుగు కోట్లమందికి పైగా ప్రజలు చూపు కోల్పోతున్నారు. దెబ్బతిన్న రెటీనాను తిరిగి కోలుకునేలా చేసే పద్ధతులు ఇప్పటివరకు అందుబాటులో లేవు. అయితే, దెబ్బతిన్న రెటీనాను కోలుకునేలా చేసి, చూపును పునరుద్ధరించగల ఔషధాన్ని కొరియన్‌ శాస్త్రవేత్తలు ఇటీవల రూపొందించారు.

కొరియన్‌ అడ్వాన్స్‌డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (కేఏఐఎస్‌టీ) శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ ఔషధం రెటీనాలో దెబ్బతిన్న నరాలకు పునరుజ్జీవం కల్పించడం ద్వారా కోల్పోయిన చూపును తిరిగి తెప్పిస్తుందని చెబుతున్నారు. దక్షిణ కొరియాకు చెందిన ఫార్మా కంపెనీ ‘సెల్లియాజ్‌’తో కలసి ‘కేఏఐఎస్‌టీ’ శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ ఔషధం ప్రస్తుతం క్లినికల్‌ పరీక్షల దశలో ఉంది. రెటీనా దెబ్బతినడానికి కారణమయ్యే ‘ప్రాక్స్‌1’ ప్రొటీన్‌ను నిర్వీర్యం చేసే ‘సీఎల్‌జెడ్‌0001’ యాంటీబాడీతో రూపొందించిన ఈ ఔషధాన్ని ఎలుకలపై ప్రయోగించినప్పుడు సత్ఫలితాలు వచ్చాయి. క్లినికల్‌ పరీక్షల తర్వాత దీనిని 2028 నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెబుతున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement