గులాబీ... ధర గుభేల్‌ | Juliet Rose: Most Expensive Rose in the World | Sakshi
Sakshi News home page

గులాబీ... ధర గుభేల్‌

Feb 22 2026 3:53 AM | Updated on Feb 22 2026 3:53 AM

Juliet Rose: Most Expensive Rose in the World

గులాబీలు గుబాళించడం సహజమే గాని, ఈ గులాబీ గుబాళించడమే కాదు, దీని ధర తెలుసుకుంటే మాత్రం గుండె గుభేల్‌మంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన, అత్యంత ఖరీదైన గులాబీ. అలాగని ఇది సహజసిద్ధమైన జాతికి చెందిన గులాబీ కాదు, ఇంగ్లిష్‌ ఉద్యాన శాస్త్రవేత్త డేవిడ్‌ ఆస్టిన్‌ సృష్టి. పదిహేనేళ్లు నిర్విరామంగా కృషి చేసి, సృష్టించిన ఈ గులాబీకి ‘జూలియెట్‌ రోజ్‌’ అని పేరు పెట్టారు.

తొలిసారిగా 2006లో దీనిని మార్కెట్‌లోకి విడుదల చేసినప్పుడు ఒక్కో పువ్వు మూడు మిలియన్‌ డాలర్ల (రూ.27.22 కోట్లు) ధర పలికింది. అందువల్ల దీనికి ‘త్రీ మిలియన్‌ రోజ్‌’ అనే పేరు వచ్చింది. ఇప్పుడు ఈ గులాబీ ధర ఏకంగా 15.8 మిలియన్‌ డాలర్లకు (రూ.143.36 కోట్లు) చేరుకుంది. దీని ధర బంగారాన్ని మించి పెరుగుతూ పోతున్నా, ప్రపంచంలోని అపరకుబేరులు మాత్రం దీనిని కొనుగోలు చేసేందుకు ఎగబడుతూనే ఉండటం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement