ఒడిషా: తన సోదరుడి పెళ్లి చూసి ఎంతో ఉత్సాహంగా ఇంటికి తన స్నేహితులతో తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై సోదరి మృతి చెందిన ఘటన తీవ్ర విషాదానికి గురి చేసింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పాత్రికేయులతో పాటు మరో ఇద్దరు గాయపడ్డారు. బుధవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో సంబల్‌పూర్ జిల్లాలోని కటర్‌బాగ్ సమితి పరిధిలోని కుసుందీహి గ్రామానికి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్థానిక ట్రెజరీ రోడ్డు సమీపంలో నివసిస్తున్న పాత్రికేయుడు గొపినాథ్ గౌడోకు బుధవారం సంబల్‌పూర్‌లోని కుచేండ వద్ద వివాహం జరిగింది. ఈ వివాహానికి గోపినాథ్ సోదరి జోత్స్నరాణి గౌడో (35)తో సహా పాత్రికేయులు సుప్రియా షడంగి, శక్తిదాస్ బంధుమిత్రులు వివాహానికి హాజరయ్యారు.
వివాహం పూర్తయి తిరిగి ఇంటికి బంధుమిత్రులతో పాటు వధువును తీసుకువస్తున్న సమయంలో బొలేరోలో ప్రయాణం చేస్తున్న జోత్స్నరాణి గౌడో, సుప్రియ షడంగి, అను, సంతోష్ కుమార్, శక్తిదాస్‌లు ఉన్నారు. సంబల్‌పూర్‌కు కొద్ది దూరం చేరేసరికి కుసుం«దీహి గ్రామ సమీపంలో వాహభం అదుపుతప్పి చెట్టుకు ఢీకొంది. ఈ ఘటనలో జోత్స్నరాణి గౌడో సంఘటన స్థలం వద్దే మృతి చెందగా సుప్రియ షడంగి, అను, సంతోష్ కుమార్, శక్తిదాస్‌లకు గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బుర్లా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వీరిలో సుప్రియ షడంగి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఆమెను ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోని ఆస్పత్రికి తరలించారు. వాహనంలో ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయిన జోత్స్నరాణి గౌడో మృతదేహాన్ని గ్యాస్ కటర్‌లతో తొలగించి పోస్టుమార్టం కోసం సంబల్‌పూర్‌కు తరలించారు.
అండగా జిల్లా ప్రెస్ అండ్ మీడియా వెల్ఫేర్ సంఘం
జరిగిన సంఘటనను తెలుసుకున్న పాత్రికేయుల సంఘం బాధిత కుటుంబానికి అండగా నిలిచింది. మృతదేహాన్ని సంబల్‌పూర్ నుంచి రాయగడకు తరలించేందుకు జిల్లా ప్రెస్ అండ్ మీడియా వెల్ఫేర్ సంఘానికి చెందిన శివాజీదాస్, సంగ్రామ్ పటా్నయక్, శివనారాయణ గౌడో, ఆశీష్ రంజన్ పండ తదితరులు జిల్లా అదనపు కలెక్టర్ నిహారి రంజన్ కుహరోను గురువారం సంప్రదించారు. అనంతరం ఆయన చొరవతో సంబల్‌పూర్ కలెక్టర్‌ను సంప్రదించి మృతదేహాన్ని ఆంబులెన్స్‌లో తీసుకువచ్చే ఏర్పాట్లు చేశారు. అలాగే తీవ్రగాయాలకు గురై విశాఖలో చికిత్స పొందుతున్న సుప్రియా షడంగికి ఆర్థికంగా ఆదుకునేందకు సంఘం ముందుకు వచ్చింది.


