Imran Khan's Death Rumours పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ మరణం గురించి పుకార్లు, ఊహాగానాలు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి. పాకిస్తాన్ జైల్లో హత్యకు గురయ్యారనే వార్త సంచలనం రేపుతోంది. అసలు ఇమ్రాన్ ఎందుకు హత్యకు గురయ్యాడు? అధికారిక ప్రకటన ఎందుకు రావడం లేదు? బతికే ఉన్నాడా? లేదా? అనే సందేహాలు యావత్ ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తున్నాయి.
పాకిస్తాన్ జైలు అధికారులు ఈ పుకార్లను తోసిపుచ్చినప్పటికీ, ఇమ్రాన్ ఖాన్ చిన్న కుమారుడు కాసిమ్ ఖాన్, తన తండ్రిని 'డెత్ సెల్'లో ఉంచారంటూ మండిపడ్డారు. గ 'అమానవీయ ఒంటరితనం' దారుణం అంటూ, తదనరంత పరిణామాలను ఎదుర్కోక తప్పదు పాకిస్తాన్ ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. అసలు బతికి ఉన్నాడా అనేది స్పష్టం చేయాలంటూ ఆయన కోరుతున్నారు. తన తండ్రి విడుదలను డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు. తన తండ్రి జైలు పాలై 845 రోజులు అయిందని, గత ఒకటిన్నర నెలలుగా, అతని కుటుంబంతో ఎలాంటి సంబంధం లేకుండా అతన్ని డెత్ సెల్‌లో ఉంచారని కాసిం ఖాన్ ఆరోపించారు.
గత ఆరు వారాలుగా, అతన్ని పూర్తిగా ఒంటరిగా ఉన్న డెత్ సెల్‌లో ఒంటరిగా ఉంచారు. స్పష్టమైన కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, అతని సోదరీమణులు ప్రతి సమావేశానికి హాజరుకాకుండా అడ్డుకుంటున్నారు. ఫోన్ కాల్స్ లేవు. ములాఖత్‌లు లేవు, అతని క్షేమం గురించి తెలియదు, తాను, తన సోదరుడు తండ్రిని ఏ విధంగానూ సంప్రదించలేకపోయామని కాసిం ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తిగా సమాచారం నిషేధించడం ప్రోటోకాల్‌లో భాగం కాదని ఆరోపించారు. కావాలనే తన తండ్రి పరిస్థితిని దాచిపెట్టడానికి, ఆచూకీని కుటుంబానికి తెలియకుండా చేస్తున్నారన్నారు.
తండ్రి భద్రత సమాచారాన్ని దాచిపెట్టడం, అమానవీయ ఒంటరితనం పర్యవనాలను పాకిస్తాన్ ప్రభుత్వం, దాని మద్దతు దారులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. పూర్తిగా చట్టపరమైన, నైతిక, అంతర్జాతీయ బాధ్యత వహించక తప్పదన్నారు. దీనిపై అంతర్జాతీయ సమాజం మరియు అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలకు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తండ్రి బతికే ఉన్నారని ధృవీకరించాలని,రాజకీయ కారణాలతోనే అత్యంత ప్రజాదరణ పొందిన రాజకీయ నాయకుడిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అటు ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు సోదరీమణులలో ఒకరైన అలీమా ఖానుమ్ కూడా తమ కుటుంబంతో సమావేశాన్నపదేపదే అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు .దీనిపై జైలు ఎదుట పోరాటాన్ని కూడా చేపట్టారు.
పాక్‌లో చీకటి రోజులొచ్చాయి: ఇమ్రాన్ సోదరి
అడియాలా జైలులో తన సోదరుడు చికిత్స పొందుతున్న తీరుపై ఇమ్రాన్ ఖాన్ సోదరి నోరీన్ నియాజీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అసలు ఏమైందీ, ఏమీ చెప్పడం లేదు, ఎవరినీ కలవనివ్వడం లేదని ఆరోపించారు. ఈ సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని, తనను సంప్రదించడానికి వీలు లేకుండా చేశారన్నారు. పాకిస్తాన్‌లో గడ్డు రోజులొచ్చాయి.నిరంకుశుల గురించి చదువుకున్నాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితుల్లో జీవిస్తున్నాం అన్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌ను నోరీన్ నియాజీ "నియంత" అని విమర్శించారు. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని దేశ చరిత్రలోనే అత్యం ప్రజాకంటక పాలనగా అభివర్ణించారు. పాకిస్తాన్ తన చీకటి కాలంలో ఉంది. ప్రజలను అపహరించి చంపేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.


