యువ ప్రపంచంలో ఇప్పుడు హాట్ టాపిక్... వైబ్ కోడింగ్. వైబ్ కోడింగ్ అనేది ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో కోడ్ రాసే విధానం. పెద్దగా సాంకేతిక పరిజ్ఞానం, డిగ్రీలు అక్కర్లేదు. వైబ్ కోడింగ్‌కు సంబంధించి ఏఐ టూల్ ‘కర్సర్’ను రూ పొందించి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన అమన్ సాంగర్ పాతికేళ్ల వయసులోనే బిలియనీర్ అయ్యాడు...కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఎంతోమంది కాలేజీ కోడర్‌లలో అమన్ సాంగర్ ఒకరు. ఇప్పుడు మాత్రం గ్లోబల్ ఏఐ ఇన్నోవేషన్‌కు సంబంధించి ప్రపంచ ప్రసిధ్ధ యువకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు.
జనరేటివ్ ఏఐ ప్రపంచంలో ‘అమన్ సాంగర్’ అనేది సుపరిచిత పేరుగా మారింది. ‘ఎనీస్పీయర్’ సహ–వ్యవస్థాపకులలో 25 సంవత్సరాల అమన్ ఒకరు. ఫాస్ట్–రైజింగ్ ఏఐ టూల్‌గా పేరు తెచ్చుకున్న ‘కర్సర్’ అనేది ఎనీస్పీయర్ కంపెనీ సృష్టి. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)లో తనకు పరిచయం అయిన మైఖేల్ ట్రుయేల్, సుయాలే, ఆర్విడ్ మార్క్‌లతో కలిసి ‘ఎనీస్పీయర్’ ్ర΄ారంభించాడు అమన్. అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న టీమ్‌గా ‘ఎనీస్పీయర్’ పేరు తెచ్చుకుంది. అమన్, మైఖేల్ ట్రుయెల్‌లు ‘నియో స్కాలర్స్’గా ఎంపికయ్యారు. సాంకేతిక నైపుణ్యం ఉన్న యువతరాన్ని సిలికాన్ వ్యాలీలోని ఫౌండర్స్, ఇన్వెస్టర్‌లకు పరిచయం చేసే కార్యక్రమమే...నియో స్కాలర్స్.

ఈ పరిచయాల వల్ల కంపెనీ ఫస్ట్ రౌండ్ ఫండింగ్ సాఫీగా సాగింది. మొదట్లో ‘ఎనీస్పీయర్’ బృందం కంప్యూటర్–ఎయిడెడ్ డిజైన్‌కు సంబంధించి ఏఐ టూల్‌ను రూపొందించింది. ఆ తరువాత దారి మార్చి సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ వైపు అడుగులు వేసింది. ఇది తాము కొన్ని సంవత్సరాల పాటు పనిచేసిన డొమైన్. సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ వైపు రావాలని తీసుకున్న నిర్ణయమే ‘కర్సర్’ను రూపొందించడానికి కారణం అయింది. ఈ ఏఐ–పవర్డ్ కోడ్ ఎడిటర్ తక్కువ కాలంలోనే ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ‘వైబ్ కోడింగ్’ అనే ఐడియాను పరిచయం చేసింది కర్సర్.వైబ్ కోడింగ్ ద్వారా డెవలపర్స్ నేచురల్ లాంగ్వేజ్ మోడల్స్‌ని ఉపయోగించి కోడ్‌కు సంబంధించి రైట్, ఎడిట్, డీబగ్ చేయవచ్చు. కాలిన్స్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ‘వైబ్ కోడింగ్’ ఎంపికైంది. తక్కువ టైమ్‌లోనే ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న ‘ఎనీస్పీయర్’ వేగంగా వృద్ధి చెందింది. కంపెనీ కో–ఫౌండర్స్ బిలియనీర్‌లుగా మారారు. పద్నాలుగేళ్ల వయసులోనే కోడింగ్ మొదలుపెట్టాడు అమన్. ్ర΄ోగ్రామింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన విషయాలపై ఆసక్తి ప్రదర్శించేవాడు.
ఇదీ చదవండి: రూ. 300తో ఇంటినుంచి పారిపోయి...ఇపుడు రూ. 300 కోట్లు
‘నా భవిష్యత్ చిత్రపటం’ ఇలా ఉండాలని అమన్ ఎప్పుడూప్లాన్ చేసుకోలేదు.అయితే సాంకేతిక అంశాలపై తనలోని ఆసక్తే ఎన్నో దారులలోకి తీసుకువెళ్లింది. చిన్న వయసులోనే సాంకేతికరంగంలో ప్రపంచ ప్రముఖుడిని చేసింది. మొదట్లో కంపెనీ పరిస్థితి ఎలా ఉన్నా, ఆ తరువాత మాత్రం పోటీ ఎదురవుతుంది. ΄ోటీని ఎలా తీసుకుంటారు?’ అనే ప్రశ్నకు అమన్ ఇచ్చిన జవాబు... పోటీ గురించి నిరంతరం పట్టించుకుంటాం. వారి పనితీరు కూడా పరిశీలిస్తాం. పనితీరు, ఆవిష్కరణలు నచ్చితే వారిని స్ఫూర్తిగా తీసుకుంటాం. మాకే అన్నీ తెలుసు అనుకోము. ఎందుకంటే మేము చేయలేనివి కూడా వారు చేసి ఉండవచ్చు.’
ఒక బాటసారి
మనలో ఒక అంశంపై ఆసక్తి ఉంటే అది ఒకేచోట ఆగి΄ోదు. నాన్‌స్టాప్‌గా ప్రయాణిస్తూనే ఉంటుంది. ఎన్నో దారులలో ఎన్నో విషయాలు తెలుస్తుంటాయి. అలాంటి ఒక బాటసారి అమన్ సాంగర్. వీడియో గేమ్స్ కంటే ఎక్కువగా కోడింగ్ అంటే ఇష్టం. ఆ ఇష్టం అతడిని ఎంతో దూరం నడిపించింది. సిలికాన్ వ్యాలీ వరకు తీసుకువెళ్లి సాంకేతిక దిగ్గజాలను పరిచయం చేసింది. పోటీలో మన ముందు ఉన్న వ్యక్తిని చూసి భయపడవద్దు. వెనక్కి తగ్గవద్దు. మన కంటే అతడికి ఎక్కువ తెలిసి ఉంటే అతడిని స్ఫూర్తిగా తీసుకోవాలి. ΄ోటీతో మనల్ని మనం మరింతగా మెరుగుపరుచుకోవచ్చు’ అంటున్నాడు అమన్ సాంగర్.


