CES 2026: లాలిపాప్‌తో మ్యూజిక్‌.. అదిరిపోయే గాడ్జెట్స్‌ మీకోసం | CES 2026 Unveils the Strangest Gadgets Yet | Sakshi
Sakshi News home page

CES 2026: లాలిపాప్‌తో మ్యూజిక్‌.. అదిరిపోయే గాడ్జెట్స్‌ మీకోసం

Jan 9 2026 1:22 PM | Updated on Jan 9 2026 2:45 PM

CES 2026 Unveils the Strangest Gadgets Yet

వాషింగ్టన్‌ డీసీ: హలో టెక్‌ లవర్స్‌. అమెరికాలో కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES 2026)లో జరుగుతుంది కదా. మరి ఈ టెక్‌ షోలో మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసే గాడ్జెట్స్‌పాటు ఇతర ప్రొడక్ట్‌ల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే, తెలుసుకుందాం పదండి.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు కన్జ్యూమర్  ఎలక్ట్రానిక్స్ షో తమ తాజా ఆవిష్కరణలను ప్రదర్శించాయి. ఈ ప్రదర్శనలో సాధారణ గాడ్జెట్లు మాత్రమే కాకుండా, వినియోగదారులను ఆశ్చర్యపరిచే విచిత్రమైన ఉత్పత్తులు  చూపరులను కట్టిపడేశాయి.వాటిల్లో  

 

ఐపాలిష్‌ డిజిటల్ మేనిక్యూర్‌
మగువుల కోసం ప్రత్యేకంగా ఐపాలిష్‌ డిజిటల్ మేనిక్యూర్‌ను డిజైన్‌ చేశారు. ఇదే ప్రపంచంలోనే మొదటి డిజిటల్ మేనిక్యూర్ సిస్టమ్.ఇందులో ప్రెస్-ఆన్ నెయిల్స్‌లో మైక్రో డిస్‌ప్లే ఉంది. స్మార్ట్‌ఫోన్‌లోని యాప్ సాయంతో 400 షేడ్స్‌ను వెంటనే మార్చుకోవచ్చు. యాప్‌లో 400 వేర్వేరు షేడ్స్‌/రంగులు అందుబాటులో ఉంటాయి. యూజర్ యాప్‌లో తనకు నచ్చిన రంగును ఎంచుకుంటే, ఆ రంగు వెంటనే నెయిల్‌పై డిస్‌ప్లేలో కనిపిస్తుంది.అంటే,నెయిల్ పాలిష్ మార్చుకోవడానికి మళ్లీ కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం లేదు. కేవలం యాప్‌లో టచ్ చేస్తే సరిపోతుంది. సింపుల్‌గా చెప్పాలంటే, స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా గోళ్ల రంగు డిజిటల్‌గా మారుతుంది. ఇది ఫ్యాషన్‌కి టెక్నాలజీని జోడించిన వినూత్న ఆవిష్కరణ.

వైబ్రేటింగ్‌ కిచెన్ బ్లేడ్లు C-200 అల్ట్రాసోనిక్ చెఫ్స్ నైఫ్
వైబ్రేటింగ్‌ కిచెన్‌ బ్లేడ్. దీని స్పెషాలిటీ ఎంతో తెలుసా?.ఈ కత్తి సాధారణ కత్తి కాదు. ఇందులో అల్ట్రాసోనిక్ వైబ్రేషన్ టెక్నాలజీ అమర్చబడి ఉంది.సెకనుకు 30వేల సార్లు వైబ్రేట్ అవుతుంది. కఠినమైన కూరగాయలు, పండ్లు కూడా రెప్పపాటు కాలంలో కోయగలదు. ఆహారం బ్లేడ్‌కు అంటకుండా సాఫీగా కట్ అవుతుంది.ఈ కత్తి వంటగదిలో సులభంగా, వేగంగా, శుభ్రంగా కట్ చేయడానికి సహాయపడుతుంది. టమోటాలు, స్క్వాష్, దోసకాయ వంటి కూరగాయలు మాంసం, చేపలు,బ్రెడ్, పండ్లు ఇవన్నీ రెప్పపాటు కాలంలో కోయగలదు.సీ-200 అల్ట్రాసోనిక్ చెఫ్ వంటగదిలో టెక్నాలజీని జోడించిన వినూత్న ఆవిష్కరణ. ఇది కేవలం కత్తి మాత్రమే కాదు, వంటను మరింత సులభం, వేగం, శుభ్రంగా చేసే స్మార్ట్ కిచెన్ టూల్. ఇందులో 1100 ఎంఏహెచ్‌ లిథియం అయాన్ బ్యాటరీ, యూఎస్‌బీ-సీ టైప్‌ ఛార్జింగ్ సౌకర్యం, అలాగే ఐపీ65 వాటర్ రెసిస్టెన్స్ ఉన్నాయి. వంటగదిలో వినియోగించడానికి ఇది చాలా సులభంగా, సురక్షితంగా ఉంటుంది.

లాలిపప్‌ స్టార్‌
లాలిపాప్. స్ట్రెస్ నుంచి రిలీఫ్‌ ఇచ్చే ఓ తియ్యటి పదార్ధం. పిల్లలు, పెద్దలకు ఫన్ ట్రీట్ ఇచ్చే లాలిపప్‌కు ఓ టెక్‌ కంపెనీ బోన్‌ కండీషన్‌ టెక్నాలజీని జోడించింది. అంతే ఈ తరహా టెక్నాలజీ ఉన్న లాలిపాప్‌ను తిన్నప్పుడల్లా పాటలు వినొచ్చు. అదెలా అంటే లాలిపాప్‌ను కొరుక్కునప్పుడు, దాని హ్యాండిల్‌లోని చిన్న ఎలక్ట్రానిక్ మాడ్యూల్ వైబ్రేషన్లు సృష్టిస్తుంది. ఆ వైబ్రేషన్లు మీ దవడ ఎముకల ద్వారా నేరుగా లోపలి చెవి భాగాలకు చేరుతుంది.పాటలు వినగలుగుతారు.ఎలక్ట్రానిక్ భాగం ఉన్నందున, పూర్తిగా తినకూడదు. కేవలం లాలిపాప్ భాగం మాత్రమే తినదగినది. సాధారణ హెడ్‌ఫోన్లతో పోలిస్తే శబ్దం తక్కువ స్పష్టంగా ఉండవచ్చు.

వీరల్ సోలార్ ఛార్జింగ్ కోప్లౌ పవర్ హాట్
ఈకోఫ్లో పవర్‌ హ్యాట్‌ (EcoFlow Power Hat) అనేది సోలార్ సెల్స్‌తో కూడిన వైడ్ బ్రిమ్ హ్యాట్. ఇది కేవలం సూర్యరశ్మి నుండి రక్షణ ఇవ్వడం మాత్రమే కాదు, బయట నడుస్తూ లేదా అవుట్‌డోర్ యాక్టివిటీల్లో ఉన్నప్పుడు స్మార్ట్‌ఫోన్ వంటి చిన్న గాడ్జెట్లను ఛార్జ్ చేసే ప్రత్యేకతను కలిగి ఉంటుంది. హ్యాట్ చుట్టూ అమర్చిన సోలార్ ప్యానెల్స్ సూర్యరశ్మిని గ్రహించి, గరిష్టంగా 12 వాట్స్ పవర్ ఉత్పత్తి చేస్తాయి. ఈ పవర్‌ను యూఎస్‌బీఏ,యూఎస్‌బీ సీ పోర్టుల ద్వారా ఒకేసారి రెండు డివైస్‌లకు అందించవచ్చు. ఈటోపీ తేలికైన మెటీరియల్‌తో తయారు చేసింది. బరువు అనిపించదు. ఐపీ65 వాటర్‌ప్రూఫ్, డస్ట్‌ప్రూఫ్ రేటింగ్‌తో హైకింగ్, బీచ్ ట్రిప్స్, ఫిషింగ్ వంటి అవుట్‌డోర్ యాక్టివిటీలకు అనుకూలంగా ఉంటుంది. ఔట్‌డోర్‌లో ఉన్నప్పుడు పవర్ బ్యాంక్ లేకపోయినా, ఈ హ్యాట్ ద్వారా ఫోన్ లేదా చిన్న గాడ్జెట్లను ఛార్జ్ చేసుకోవచ్చు.ఈ హ్యాట్ కేవలం సూర్యరశ్మిలో ఉన్నప్పుడు మాత్రమే పవర్ ఉత్పత్తి చేస్తుంది. 12డబ్ల్యూ పవర్ పరిమితి కారణంగా ల్యాప్‌టాప్‌లు లేదా పెద్ద గాడ్జెట్లను ఛార్జ్ చేయడం సాధ్యం కాదు.

ఏఐ స్మార్ట్‌ క్లిప్పర్‌
Glyde Smart Hair Clipper అనేది ఏఐ ఆధారిత పనిచేసే హెయిర్‌కట్ పరికరం. ఇది తల ఆకారాన్ని గుర్తించి బ్లేడ్ యాంగిల్, స్పీడ్‌ను ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తుంది. మొబైల్ యాప్ ద్వారా విజువల్ గైడెన్స్ అందిస్తూ, ఇంట్లోనే సలూన్-క్వాలిటీ హెయిర్‌కట్ చేస్తుంది. ఈ ఎయిర్‌ క్లిప్పర్‌ను తాజా ఈవెంట్‌లో పరిచయం చేశారు. ఇది ప్రపంచంలోనే మొదటి ఏఐ ఆధారిత హెయిర్ క్లిప్పర్‌గా గుర్తింపు పొందింది. దీని లక్ష్యం ఒకటే  ఎవరైనా, ఎలాంటి అనుభవం లేకపోయినా, 10 నిమిషాల్లో ఇంట్లోనే  సెలూన్‌ క్వాలిటీ హెయిర్‌కట్ చేసేందుకు ఉపయోగపడటం. ఈ క్లిప్పర్‌లో ఎఐ స్టైలిస్ట్‌ అనే సిస్టమ్ ఉంటుంది. ఇది తల ఆకారాన్ని స్కాన్ చేసి, బ్లేడ్ యాంగిల్, స్పీడ్‌ను ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తుంది. కాబట్టి కత్తిరింపు సమయంలో పొరపాట్లు జరగకుండా, సాఫ్ట్‌గా, సమానంగా హెయిర్‌కట్ అవుతుంది.సాధారణ క్లిప్పర్ కంటే ఖరీదు ఎక్కువగా ఉంటుంది. యాప్ లేకుండా పూర్తి ఫీచర్లు ఉపయోగించలేరు. మొదటిసారి ఉపయోగించే వారికి కొంత సమయం పట్టవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement