సాక్షి,బెంగళూరు: ఐటీ ఉద్యోగి వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. పంకజ్ తన్వర్ తన హెల్మెట్‌ను వినూత్నంగా మార్చారు. సాధారణ హెల్మెట్‌ను కృత్రిమ మేధస్సు ఆధారిత రోడ్ సేఫ్టీ టూల్‌గా మార్చేశారు.
పంకజ్ తన్వర్ ఆవిష్కరణ ఒక సాధారణ ఆలోచనతో మొదలైంది. ‘టెక్నాలజీని కేవలం సౌకర్యం కోసం కాకుండా, సమాజానికి ఉపయోగపడే విధంగా వినియోగించాలి’ అనే సదుద్దేశ్యంతో ఆయన ఈ హెల్మెట్‌ను రూపొందించారు.ఈ స్మార్ట్ హెల్మెట్ ద్వారా ట్రాఫిక్ పోలీసులకు నిర్ధారిత ఆధారాలు చేరుతాయి. ఫలితంగా, రోడ్లపై క్రమశిక్షణ పెరుగుతుంది. చిన్న ఆవిష్కరణ కూడా ప్రతిరోజు జీవనాన్ని మరింత సురక్షితంగా మార్చగలదని నమ్ముతున్నారు.
బెంగళూరులో పుట్టిన ఈ ఆవిష్కరణతో ఇన్నోవేషన్, టెక్నాలజీ కలిస్తే సమాజానికి ఎంతటి మేలు జరుగుతుందో స్పష్టంగా తెలుస్తోంది. ఒక సాధారణ హెల్మెట్‌ను ఏఐ ఆధారిత రోడ్ సేఫ్టీ సాధనంగా మార్చిన పంకజ్ తన్వర్ ఆవిష్కరణ, రోడ్లపై క్రమశిక్షణను పెంచుతూ, ప్రజల జీవనాన్ని మరింత సురక్షితంగా మార్చే దిశగా అడుగులు పడినట్లేనని పలువురు వాహనదారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
హెల్మెట్ ప్రత్యేకతలు
ఈ స్మార్ట్ హెల్మెట్ రియల్ టైమ్‌లోనే ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించగలదు
విజువల్స్‌ను క్యాప్చర్ చేయడం
లొకేషన్ వివరాలు నమోదు చేయడం
వాహన నంబర్ ప్లేట్‌ను గుర్తించడం
సమాచారాన్ని ధృవీకరించి ట్రాఫిక్ పోలీసులకు పంపించడం
విధంగా, రోడ్లపై జరుగుతున్న ఉల్లంఘనలకు తక్షణ సాక్ష్యాలు అందుబాటులోకి వస్తాయి


