జేఎన్‌టీయుహెచ్ వజ్రోత్సవ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఎస్‌ఎస్‌ఆర్. కృష్ణ త్రీడీ ఇల్యూషన్ ఆర్టిస్ట్. ఈయన నేలపై వేసే చిత్రాలు మనిషికి భ్రమ కల్పిస్తాయి. లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు.. భ్రమ కల్పించటమే ఈ 3డీ ఆర్ట్ ప్రత్యేకత. ఇలాంటి 3డీ ఆర్టిస్ట్‌లు దేశం మొత్తంలో తక్కువ మంది ఉన్నారు.
అమ్మ ప్రోత్సాహంతో..
చిన్నప్పటి నుంచి కృష్ణ బొమ్మలు గీస్తూ ఉండటంతో ఆసక్తిని గమనించి బొమ్మలు గీయడం నేరి్పంచారు ఆయన తల్లి. అక్కడి నుంచి బొమ్మలు వేయడం సాధన చేయడంతో 3డీ చిత్రాలు వేయడం అలవాటైంది. మిగతా ఆర్టిస్టులకు భిన్నంగా
బొమ్మలు గీయడంలో ప్రత్యేకత
ఉండాలనే కోరిక సింగారపు శివరామకృష్ణను 3డీ ఆర్టిస్టుగా నిలబెట్టింది. తెలంగాణ రాష్ట్రం కొండగట్టులో బీటెక్ అభ్యసించే సమయంలో మెకానికల్ విభాగం హెచ్‌ఓడీ ఎన్‌వీఎస్ రాజు మెకానికల్ విద్యకు సంబంధించి పాఠ్యపుస్తకం రాశారు. ఇందులో బొమ్మలు వేయడానికి అతడికి అవకాశం ఇచ్చారు. మంథని నుంచి అమెరికా వరకూ అతడి ప్రతిభకు ప్రశంసలు, అవార్డులు వచ్చాయి.
రాహుల్ గాంధీ జోడో యాత్రలో 3డీ ఆర్ట్స్ గీశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నుంచి ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు. ప్రతి సంవత్సరం అమెరికా ఆర్ట్ ఫెస్టివల్‌కు ఆయనను ఆహా్వనిస్తారు. ప్రస్తుతం జేఎన్‌టీయులో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా సేవలు అందిస్తున్నారు. యూనివర్సిటీ వజ్రోత్సవ వేడుకల్లో ఆయనకు యంగ్ అచీవర్ అవార్డును ప్రదానం చేశారు.
(చదవండి: ఇంజనీర్ కమ్ డాక్టర్..! విజయవంతమై స్టార్టప్ ఇంజనీర్ కానీ..)


