జీపీఎస్‌ దారి తప్పింది | Road Incident in Madanapalle | Sakshi
Sakshi News home page

జీపీఎస్‌ దారి తప్పింది

Mar 6 2026 10:50 AM | Updated on Mar 6 2026 11:50 AM

Road Incident in Madanapalle

 మదనపల్లెటౌన్‌: జీపీఎస్‌ లోకేషన్‌ చూస్తూ తిరుపతి నుంచి మదనపల్లెకు బైక్‌లో వస్తున్న దంపతులకు జీపీఎస్‌ దారి తప్పించడంతో ప్రమాదానికి గురైన ఘటన గురువారం మండలంలోని శానిటోరియం వద్ద జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు.  తిరుపతికి చెందిన దంపతులు ఆనంద్‌ (25), నాగలక్ష్మి (20) కుమారుడు అభి(5)తో కలసి మదనపల్లెలో జరుగుతున్న బంధువుల పెళ్లికి బైక్‌లో బయలుదేరారు. 

వీరు మదనపల్లె సమీపంలోని శానిటోరియం వద్దకు రాగానే రోడ్డు అభివృద్ధి పనులు సాగుతున్నాయి.దీంతో రోడ్‌ డైవర్షన్‌ ఉంది. జీపీఎస్‌ ఈ డైవర్షన్‌ను చూపకపోవడంతో నేరుగా చర్చి వైపు రోడ్డులోకి రావడంతో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని స్థానికులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్సలు అందించారు. తాలూక పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement