గన్నవరం ఎయిర్‌పోర్టును కమ్మేసిన పొగమంచు | Dense Fog At Gannavaram Airport | Sakshi
Sakshi News home page

గన్నవరం ఎయిర్‌పోర్టును కమ్మేసిన పొగమంచు

Mar 6 2026 8:33 AM | Updated on Mar 6 2026 9:32 AM

Dense Fog At Gannavaram Airport

సాక్షి, కృష్ణా జిల్లా: గన్నవరం ఎయిర్‌పోర్టులో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. గాల్లో పలు విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. సేఫ్‌ ల్యాండింగ్‌కు క్లియరెన్స్‌ లేకపోవడంతో విమానాలు ల్యాండ్‌ అయ్యేందుకు అంతరాయం ఏర్పడింది. చెన్నై, హైదరాబాద్, సింగపూర్, ఢిల్లీ విమానాలు గాల్లో చక్కర్లు కొట్టాయి. ఈ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానం ల్యాండింగ్‌కి వీలులేకపోవడంతో అధికారులు.. రాజమండ్రికి దారి మళ్లించారు.

పొగమంచు ప్రభావం తగ్గే వరకు విమానాల రాకపోకల్లో అంతరాయం కొనసాగుతుందని ఎయిర్‌పోర్ట్‌ వర్గాలు తెలిపాయి. కొన్ని రోజులుగా గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగ మంచు అలుముకోవడంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నాలుగు రోజుల క్రితం పొగ మంచు కారణంగా ఇస్తాంబుల్ నుండి వచ్చిన ప్రత్యేక విమానం, ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం కాసేపు గాల్లో చక్కర్లు కొట్టాయి.

 

 

Advertisement
 
Advertisement
Advertisement