మంత్రి పయ్యావుల కేశవ్‌కు బొత్స స్ట్రాంగ్ రిప్లై | Andhra Pradesh Legislative Council Sessions Updates | Sakshi
Sakshi News home page

మంత్రి పయ్యావుల కేశవ్‌కు బొత్స స్ట్రాంగ్ రిప్లై

Mar 6 2026 10:36 AM | Updated on Mar 6 2026 5:43 PM

Andhra Pradesh Legislative Council Sessions Updates

 06-03-2026

5.25PM
ఏపీ శాసనమండలి నిరవధిక వాయిదా

4:19 PM

మంత్రి పయ్యావుల కేశవ్‌కు బొత్స స్ట్రాంగ్ రిప్లై  

  • ఆదాయంలో ఏపీకి 22వ స్థానం ఎలా వచ్చిందో చూపించిన బొత్స
  • కాగ్ నివేదిక లింక్ ను పయ్యావులకు సభలో పంపిన బొత్స
  • మీకు డౌన్ లోడ్ చేయడం చేతకాకపోతే చేసి పంపిస్తానన్న బొత్స
  • గత ఐదేళ్లలో పంటల కొనుగోళ్ల వివరాలను ఇచ్చిన బొత్స
  • వైఎస్ జగన్ హయాంలో రూ. 7800 కోట్లతో పంటల కొనుగోలు చేశాం
  • పంటల వారీగా కొనుగోలు చేసిన వివరాలు ఇస్తున్నా చూస్కోండి
  • బొత్స డాక్యుమెంట్లు ఇవ్వడంతో ఖంగుతిన్న మంత్రి పయ్యావుల కేశవ్
  • రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు.. వారిని ఆదుకొండి
  • ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ అంతా అంకెల గారడీ

 

ఏపీ శాసనమండలి నుంచి వైఎస్సార్‌సీపీ సభ్యుల వాకౌట్‌
👉అంగన్‌వాడీలపై ప్రభుత్వ తీరుకు నిరసనగా వాకౌట్‌
👉అంగన్వాడీ కార్యకర్తల సంక్షేమంపై వైఎస్సార్‌సీపీ సభ్యుల ప్రశ్న

👉సభను తప్పుదోవ పట్టించకండి: విపక్షనేత బొత్స సత్యనారాయణ
ఆనాటి ప్రభుత్వం చాలా హామీలు నెరవేర్చింది
చాలా హామీలకు సంబంధించి అధికారులను పిలిపించి సమాచారం తీసుకోండి
లేనిపోని కల్లబొల్లి కబుర్లు చెప్పకండి
సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేస్తున్న వారిని అవమానించకండి
మంత్రి సమస్యల పరిష్కారం కోసం ఏ అగ్రిమెంట్ ఏమీ చేసుకోలేదంటున్నారు.
ముందు అంతకు ముందు ఏం జరిగిందో తెలుసుకోండి.
అంగన్వాడిల పట్ల సానుభూతితో ఈ ప్రశ్నకు సభ నుంచి వాకౌట్ చేస్తున్నాం

👉గీతం యూనివర్సిటీ రూ.5 వేల కోట్ల భూ దోపిడీపై సభలో చర్చించాలని కోరుతూ శాసనమండలి వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు కుంభా రవిబాబు, పండుల రవీంద్రబాబు, పాలవలస విక్రాంత్‌లు ప్రతిపాదించిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ మోషేన్ రాజు తిరస్కరించారు.

👉దీంతో వైఎస్సార్‌సీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గీతం యూనివర్సిటీపై చర్చించాల్సిందేనని సభలో వైఎస్సార్‌సీపీ సభ్యులు నినాదాలు చేశారు. వైఎస్సార్‌సీపీ సభ్యుల ఆందోళనకు దిగడంతో సభకు ఐదు నిమిషాల పాటు ఛైర్మన్‌ విరామం ప్రకటించారు. అనంతరం ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు.

👉తల్లికి వందనం పథకంపై చంద్రబాబు సర్కార్‌ను వైఎస్సార్‌సీపీ సభ్యులు నిలదీశారు. తల్లికి వందనం పథకం తల్లికి వంచనగా మారిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ భరత్‌ మండిపడ్డారు. ఎన్నికల ముందు ప్రతీ ఇంటి వెళ్లి నీకు 15 వేలు, నీకు 15 వేలు అని ప్రచారం చేశారంటూ దుయ్యబట్టారు.

ఇది పెద్ద భూ కుంభకోణం: కుంభ రవిబాబు 
మండలి మీడియా పాయింట్‌లో ఎమ్మెల్సీ కుంభ రవిబాబు మాట్లాడుతూ.. గీతంకి ప్రభుత్వ భూములు ఇవ్వడంపై వాయిదా తీర్మానం ఇచ్చామని.. ప్రభుత్వం తిరస్కరించిందన్నారు. రూ. 5 వేల కోట్ల భూములు గీతంకి ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించిందని.. ఇది పెద్ద భూ కుంభకోణమని  ఆయన అన్నారు.

‘‘గీతంకి భూములు ఇవ్వడంపై విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ ఇవ్వాలని తీర్మానం చేసినప్పుడు వ్యతిరేకత వచ్చింది. గీతం ఒక వ్యాపార సంస్థ. విద్యా వ్యాపారం చేస్తున్న సంస్థకి 5000 కోట్లు భూములు ఇవ్వడంపై వైఎస్సార్‌సీపీ అభ్యంతరం తెలిపింది. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చిన గీతంకి ఉచితంగా భూములు ఇవ్వడం పరిపాటిగా మారింది. గతంలో ఎకరం 15 లక్షలకు ఇచ్చారు.

..రుషికొండలో ప్రభుత్వ భవనాలను వైఎస్‌ జగన్‌ కడితే కూటమి గగ్గోలు పెట్టింది. ఎన్నికల్లో ప్రచారం చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారు.51 ఎకరాల 71 సెంట్లు కట్టబట్టేందుకు ప్రయత్నం చేస్తుంది. అనేక కంపెనీలకి 99 పైసలకే భూములు ఇస్తుంది. భూములు అప్పనంగా కట్టబెట్టడాన్ని వైఎస్సార్‌సీపీ వ్యతిరేకిస్తుంది. విలువైన భూములను కారు చౌకగా గీతంతో పాటు ఎన్నో సంస్థలకు ఇచ్చేందుకు ప్రభుత్వం పూనుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం’’ అని రవిబాబు తేల్చి చెప్పారు.

అంగన్‌వాడీలపై ప్రభుత్వ తీరుకు నిరసనగా వాకౌట్‌

గీతం కబ్జా చేసిన భూమిని స్వాధీనం చేసుకోవాలి: వరుదు కళ్యాణి
గీతం యూనివర్సిటీ కబ్జా చేసిన భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. రెగ్యులరైజేషన్ ఆపాలి. 99 పైసలకు తన బినామీలు అనుచరులకు చంద్రబాబు భూములు కట్టబడుతున్నారు. రూ.5 వేల కోట్ల విలువైన భూములు తన కుటుంబ సభ్యులకు కట్టబడుతున్నారు. విశాఖపట్నం ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటూ దోపిడీ క్యాపిటల్‌లా మార్చారు. బీసీ మహిళా మేయర్‌ని అడ్డగోలుగా పదవి నుంచి దించారు.

కబ్జా భూమిని రెగ్యులరైజ్ చేయడం కోసమే మేయర్ ని తప్పించారు. కబ్జా చేసిన భూములపై ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టాలి.. కానీ రెగ్యులరేజ్ చేస్తున్నారు. చిన్న చిన్న బడ్డీ కొట్లు పెట్టుకుంటే ప్రోక్లైన్లతో తొలగించారు. పేదలు చిన్న చిన్న గుడిసెలు వేసుకుంటే వాటిని తొలగించారు. కుటుంబ సభ్యులకు మాత్రం 5 వేల కోట్లు కట్టబెట్టారు. స్థానిక సంస్థల ఆధీనంలో ఉన్న భూములు ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకూడదంటూ కోర్టు తీర్పులు ఉన్నాయి. సుప్రీంకోర్టు అంటే కూటమి పెద్దలకు చంద్రబాబుకి భయం లేదు. గీతం కబ్జా చేసిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. అప్పటివరకు వైఎస్సార్‌సీపీ పోరాటం ఆగదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement