వైభవంగా పుష్పయాగం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా పుష్పయాగం

Mar 6 2026 9:05 AM | Updated on Mar 6 2026 9:05 AM

వైభవంగా పుష్పయాగం ఇఫ్తార్‌ సహరి (శుక్ర) (శని) గుంటూరు 6.21 5.05 నరసరావుపేట 6.23 5.07 బాపట్ల 6.21 5.05

న్యూస్‌రీల్‌

శుక్రవారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2026
ఇఫ్తార్‌ సహరి (శుక్ర) (శని) గుంటూరు 6.21 5.05 నరసరావుపేట 6.23 5.07 బాపట్ల 6.21 5.05

మంగళగిరి టౌన్‌: మంగళాద్రిలో వేంచేసి యున్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 11 రోజులుగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు గురువారంతో ముగిశాయి. చివరి రోజు కార్యక్రమంలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారికి వివిధ రకాల పుష్పాలతో యాగోత్సవం నిర్వహించారు. విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, అష్టదిక్పాలకారాధన, విశేష శ్రీ పుష్పయాగోత్సవం, దివ్యమంగళ హారతిని దేవస్థాన ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు, అర్చక బృందం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆస్థాన మండపంలో జరిగిన ఈ ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని పుష్పసేవ చేశారు. ఉత్సవ కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన నందం సాంబశివరావు, శాంతికుమారిలు వ్యవహరించారు. ఆలయ ఈవో కె. సునీల్‌కుమార్‌ ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement