అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా...
‘ఇప్పుడైతే క్రీస్తునందు’ అన్న దృష్టికోణంలో నుండి చూడగలిగితే అన్నీ సానుకూలంగానే దర్శనమిస్తాయి. బైబిలు గ్రంథం స్త్రీని చిన్నచూపు చూసింది. స్త్రీని తక్కువ చేసి మాట్లాడింది వంటివి కూడా అర్ధరహిత వ్యాఖ్యలే. ఆదామువలె స్త్రీ కూడా దేవుని సృష్టి. దేవుడు ఆమెను తన స్వహస్తాలతోనే నిర్మించాడు. సాటియైన సహాయం అన్న కీర్తి ఆమె సొంతం. ఈ మాట దేవుడే చెప్పాడు.
సమానత్వం అనేది అది నుండి ఇప్పటి వరకూ ఉంది. అది విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. చూసే దృష్టిలోనే అంతా ఉంది. ఆ లోపం చూసే విధానపు తీరుదే. అసాధారణ ఆధ్యాత్మిక భావజాలం అలవరచుకుంటే అన్నీ అనుకూలమే. దేవుని పట్ల భయంతో ఇట్టివారే స్త్రీని గౌరవిస్తారు. ఉత్సాహ, ప్రోత్సాహాలతో ఆమెను అందలం ఎక్కిస్తారు. మమ్మల్ని పూజించకున్నా... దయచేసి గుర్తించి గౌరవించండి మాకు అదే చాలు అన్న వేడుకోలు యవ్వన స్త్రీలది. రోజు రోజుకు ఇలాంటి విషమ పరిస్థితులు నేటి సమాజంలో నెలకొంటున్నాయి. నేటి పురుష జన్మ వైవిధ్యం ఏమంటే, తల్లిగా దయతలచి ఒక స్త్రీ పెట్టిన భిక్షే అతనికి ఈ జన్మ. తమదైన పురుషజన్మ స్త్రీ నుండే, స్త్రీకి మరో జన్మ అను మరణకర సంకట స్థితి నుండే ఈ నా జన్మ అన్న సత్యం ఎరిగిన పురుషోత్తములే దేవునికి ఎప్పుడూ భయపడుతూ మెరుగైన సమాజం కోసం కృషి చేస్తారు. స్త్రీ శిశు సంక్షేమాన్ని కోరేవారంతా సమాజ ఉద్ధారకులే.
చిన్న కుటుంబమైనా.. పెద్దదైన ఉమ్మడి కుటుంబమైనా... అందులోని వారంతా చేతులెత్తి మొక్కే విధంగా స్త్రీ సాధికారతను బైబిలు అద్భుతంగా వివరించింది (సామెతలు 31:10–31). తనలోని నైపుణ్యాన్ని గుర్తించి దానికి నిత్యం సానపెడుతూ శ్రమించే స్త్రీ విజయపథాన ఊరేగుతుంది అంటుంది బైబిలు. స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు దేవుడు. శిరస్సు అంటే ఏలుబడి లేదా పరి΄ాలన. ఇది దేవుని నియమం. భర్తను మినహాయించి యావత్తూ కుటుంబాన్ని ఆమె ఏలుతుంది.

స్త్రీ వినయ విధేయతలు, మరీ ముఖ్యంగా ఆమె వినమ్రత తగ్గింపు, అణుకువ వంటివి ఆకట్టుకొని ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తాయి. ఈ వినయ సంపన్నతతోనే యేసు ‘నన్ను ఎలా మంచివాడు అంటున్నావు? మంచివాడు, సత్పురుషుడు, సద్బోధకుడు ఒక్కడే. ఆయనే దేవుడు’ అంటూ తగ్గించుకోవడం చూస్తే స్త్రీలకు ఇది గొప్ప ్ర΄ోత్సాహకరమే. ఎప్పుడూ హెచ్చించుకోక తగ్గింపు స్వభావంతో క్రీస్తు తనకు శిరస్సైన దేవుని మెప్పించడం మాదిరిగానే స్త్రీలు కూడా తమ స్వపురుషులను మెప్పించవచ్చు.
– జేతమ్


