
వెయిట్‌లాస్ అనగానే ఈ మధ్య కాలంలో అందరికీ గుర్తొచ్చే ఔషధం ‘మౌంజారో’ (Mounjaro) అమెరికా ఫార్మా దిగ్గజమైన ఎలీ లిల్లీ కంపెనీకి చెందిన ఈ డ్రగ్ అమ్మకాల్లో దూసుకుపోతుంది. భారతదేశ ఔషధ మార్కెట్లో యాంటీ-ఒబెసిటీ, డయాబెటిస్ ఔషధం మౌంజారో రెండో అతిపెద్ద బ్రాండ్‌గా అవతరించింది. లాంచ్‌అయిన ఆరు నెలల్లోనే కోట్ల రూపాయల బిజినెస్ సాధించి మార్కెట్‌ను షేక్ చేస్తోంది.
ఇండియన్ ఫార్మాస్యూటికల్ మార్కెట్ (IPM) తాజా డేటా ప్రకారం, సెప్టెంబర్‌లో మౌంజారో రూ. 80 కోట్ల అమ్మకాలను నమోదు చేసింది. రూ. 85 కోట్లు నమోదు చేసిన GSK యాంటీబయాటిక్ ఆగ్మెంటిన్ మొదటి స్థానంలో ఉంది. ఫార్మా మార్కెట్లో మౌంజారో ఇంజెక్షన్ మొత్తం ఆదాయం రూ. 233 కోట్లకు చేరడం గమనార్హం.
మౌంజారో
సాధారణంగా టిర్జెపటైడ్ అని పిలువబడే మౌంజారో, టైప్ 2 డయాబెటిస్‌ను నివారణలో వారానికి ఒకసారి ఇంజెక్ట్ చేయగల ఔషధం.ఇది రక్తంలో చక్కెర స్థాయిలు, ఆకలిని నియంత్రించడంల సహాయపడే రెండు గట్ హార్మోన్లు-GLP-1, GIP-లను నియంత్రిస్తుంది. తద్వారా గ్లూకోజ్‌ను అదుపులో ఉంచడమే కాదు, బరువు తగ్గడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా సగటున 20-22 శాతం బరువు తగ్గుతున్నట్టు క్లినికల్ అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది మౌంజారో యాంటీ-ఒబెసిటీ , మెటబాలిక్ చికిత్సలలో ఎక్కువగా చర్చల్లో నిలుస్తున్న మందుగా మారిపోయింది. మౌంజారో ఇప్పటికే మధుమేహం ,ఊబకాయాన్ని తగ్గించుకోవడంలో లక్షలాదిమందికి ఉపయోగపడింది. ఈనేపథ్యంలోనే ముఖ్యంగా ఇండియాలో శరవేగంగా వినియోగంలోకి వస్తోంది. వెయిట్‌లాస్ చికిత్సలకు డిమాండ్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఔషధం ఏప్రిల్ 2024లో భారతదేశంలో లాంచ్ అయింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) వైద్యుల సలహా మీద మాత్రమే వాడే మాత్రమే ఇంజెక్షన్‌గా ఆమోదించింది. ఇది 2.5 mg , 5 mg మోతాదులలో లభిస్తుంది, వారానికి ఒక డోసు చొప్పున వాడే ఈ మదు ధర మోతాదును బట్టి. నెలకు రూ. 14,000 ,రూ. 17,500 మధ్య ఉంటుంది.
చదవండి : చిట్టిచేప.. చీరమీను... ఒక్కసారి తిన్నారంటే!
అధిక ధర ఉన్నప్పటికీ డిమాండ్‌మాత్రం అప్రతిహగంగా పెరుగుతూ వస్తోంది. దీఆగస్టు నుండి సెప్టెంబర్ వరకు బ్రాండ్ అమ్మకాలు 43 శాతం పెరిగాయి, రూ. 56 కోట్ల నుండి రూ. 80 కోట్లకు పెరిగాయి. ఫలితంగా మార్కెట్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న మందులలో ఒకటిగా నిలిచింది. సెప్టెంబర్‌లో మొత్తం భారతీయ ఫార్మా మార్కెట్ 7.3 శాతం విస్తరించింది. దీనికి తోడు సెప్టెంబర్ 22 నుండి అమలులోకి వచ్చేలా 18 శాతం నుండి 5 శాతానికి జీఎస్‌టీ తగ్గింపు కూడా కలిసి వచ్చింది. ఈదూకుడు కేవలం ప్రారంభం మాత్రమే అంటున్నారు పరిశ్రమ నిపుణులు అంటున్నారు.