
చాలామంది ఉపాధి కోసం దుబాయ్, కువైట్ వంటి గల్ఫ్ దేశాలకు పయనమవుతుంటారు. అక్కడకు వెళ్లి బ్రోకర్ల చేతిలో మోసపోయిన వాళ్లు కొందరైతే..మరికొందరు సవ్యంగా ఆయా దేశాలకు వెళ్లి..మంచి స్థాయిలో స్థిరపడి..తమకంటూ మంచి గుర్తింపుని తెచ్చుకుని స్ఫూర్తిగా నిలుస్తారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే సతీష్ సన్పాల్. అతడి సక్సెస్ స్టోరీ ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తుంది. ఒక్కోమెట్టు ఎక్కుతూ..స్వయంకృషితో పైకి రావడం ఎలా అనేది నేర్పిస్తుంది అతడి కథ.
మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌కు చెందిన సతీష్ సన్పాల్ ఎనిమిదో తరగతితోనే చదువుకి స్వస్తి పలికాడు. తన తల్లి ఇచ్చిన రూ. 50 వేల రూపాయలతో తన వ్యాపార ప్రస్థానాన్ని ప్రారంభించాడు. జస్ట్ 15 ఏళ ప్రాయానికి భారత్‌లో చిన్న దుకాణం ప్రారంభించాడు. ఆ వ్యాపారం పెట్టిన రెండేళ్లకే మూతపడ్డప్పటికీ..అదే అతడికి ఎన్నో అమూల్యమైన పాఠాలను నేర్పించింది. అయితే సతీష్‌లో ఆ పరాజయం మరింత కసి, పట్టుదలను పెంచేశాయి.
ఏదో సాధించాలనే దృఢ సంకల్పంతో అవకాశాల కోసం అన్వేషిస్తూ..అలా దుబాయ్‌కి పయనమయ్యాడు. కనీసం డిగ్రీ చదువు కూడా లేకపోయినప్పటికీ..తన స్వీయ తెలివితేటలు, అభిరుచిలనే పెట్టుబడిగా పెట్టి..తనకంటూ ఒక సొంత మార్గాన్ని స్వయంగా నిర్మించుకోవాలని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యాడు.
అక్కడ తనకంటూ ఎలాంటి వ్యాపార సెటప్ లేకపోయినా..చిన్నగా క్లయింట్లు స్టాక్ మార్కెట్ బ్రోకర్లతో కనెక్ట్ అయ్యేందుకు హెల్ప్ అయ్యే అంశంతో తన ప్రస్థానం ప్రారంభించాడు. అది అతనికి మంచి అనుభవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. అలా నెమ్మదిగా వ్యాపార రంగంలోకి ప్రవేశిస్తూ..2018లో ఏఎన్‌ఏఎక్స్ హోల్డింగ్ నిర్మించడం ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ బృదంలో మూడు ప్రధాన వ్యాపార దిగ్గజాలు ఉన్నాయి. ఒకటి ఏఎన్‌ఏఎక్స్ డెవలప్‌మెంట్స్, ఏఎన్‌ఏఎక్స్ హాస్పిటాలిటీ, ఏఎన్‌ఏఎక్స్ క్యాపిటల్ తదితరాలు..
సంక్షోభాన్ని..లాభంగా మార్చేయడం..
కోవిడ్ సంక్షోభంలో చాలా తెలివిగా తక్కువ విలువ కలిగిన దుబాయ్ ఆస్తులలో పెట్టుబడులు పెట్టి..కోట్లకు పడగలెత్తాడు. వాటి విలువ ఇవాళ పది రెట్లు పెరిగాయి. ఆయన పొదుపు, ఖర్చులని చాలా తెలివిగా బ్యాలెన్స్ చేస్తాడట. సతీష్ ఎక్కువగా రియల్ ఎస్టేట్, లగ్జరీ గడియారాలు, బంగారం, కార్లపై పెట్టుబడులు పెడతాడట.
ఆయన సాహసోపేతమైన నిర్ణయాలకు నిదర్శనమే వెయ్యి కోట్ల హిల్స్‌భవనం. ప్రస్తుతం ఆయన తన కుటుంబంతో కలిసి బుర్జ్ ఖలీఫాలో నివసిస్తున్నాడు. సతీష్‌కు లగ్జరీ కార్ల గ్యారేజ్ ఉంది. అవి ఆయన హోదాకు నిదర్శనంగా కాకుండా తన ఆత్మవిశ్వాసానికి చిహ్నంగా చూస్తాడట. అంతేగాదు సతీష్ 2034 నాటికి ప్రపంచంలోని టాప్ 10 బిలియనీర్లలో ఒకరిగా ఉండాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని చెబుతున్నాడు.
ఇక ఈ ఏడాది అతని కంపెనీ దుబాయ్, యూకేల వెంచర్‌లతో సహా డీహెచ్3 వంటి బిలియన్లకు పైగా నాలుగు కొత్త రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను ప్రారంభించడం విశేషం. చివరగా యువతకు ఆయన ఇచ్చే అమూల్యమైన సందేశం ఏంటంటే.. "క్రమశిక్షణతో నేర్చుకుంటూ ఉండండి, ఎప్పుడూ ఆశను వదలుకోవద్దు, ఓడిపోయానని చేతులెత్తేయొద్దు" అని సూచిస్తున్నారు. మనం తినే ఎదురుదెబ్బలే విజయానికి దారితీస్తాయనే విషయం గుర్తురెగాలని చెబుతున్నాడు సతీస్ సన్పాల్.
(చదవండి: Success Story: ఐఏఎస్‌గా సెక్యూరిటీ గార్డు కుమార్తె..! హిందీ మాధ్యమంలో టాపర్‌గా..)