అర్జున్ టెండూల్కర్ ప్రీ-వెడ్డింగ్ వేడుకలో హైలెట్‌గా నీతా అంబానీ స్పీచ్‌..! | Nita Ambani warm Speech At Arjun Tendulkar pre-wedding celebration | Sakshi
Sakshi News home page

అర్జున్ టెండూల్కర్ ప్రీ-వెడ్డింగ్ వేడుకలో హైలెట్‌గా నీతా అంబానీ స్పీచ్‌..!

Feb 26 2026 1:28 PM | Updated on Feb 26 2026 1:34 PM

Nita Ambani warm Speech At  Arjun Tendulkar pre-wedding celebration

క్రికెట్‌ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ మార్చి మొదటి వారంలో సానియా చందోక్ ను వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఈ జంట ప్రీ వెడ్డింగ్‌ వేడుకులు జామ్ నగర్‌లో అ‍ట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రీ-వెడ్డింగ్ వేడుకను అంబానీ కుటుంబమే నిర్మహిస్తుండటం విశేషం. 

ఈ కార్యక్రమంలో నీతా, ముఖేశ్‌ అంబానీ, ఆకాశ్‌-శ్లోకా అంబానీ, అనంత్‌-రాధికా అంబానీలతో సహా అనేకమంది ఇతర అంబానీ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో నీతా అంబానీ టెండ్యూల్కర్‌ కుటుంబాన్ని ఉద్దేశిస్తూ చేసిన ప్రసంగం అందర్నీ అమితంగా ఆకట్టుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

నీతా ఏం మాట్లాడారంటే..
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ, జామ్ నగర్‌లోని రిలయన్స్ టౌన్ షిప్‌కు అతిథులను స్వాగతిస్తూ సచిన్ టెండూల్కర్, అంజలిలతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

“అందరికీ నమస్కారం, జామ్‌నగర్‌కు స్వాగతం. ఈ రోజు, మనమందరం రెండేళ్ల క్రితం అనంత్ రాధిక ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో ఇదేచోట  సమావేశమయ్యాం. మళ్లీ ఇదే చోట సచిన్‌ అంజలీల కుమారుడి ప్రీ వెడ్డింగ్‌ వేడుకల కోసం మరోసారి సమావేశమయ్యాం. సచిన్‌ అంజలిలు మీరు ఎల్లప్పుడూ మా కుటుంబంలో భాగం. ఈ ఆనందంలో భాగమవ్వడంతో మా హృదంయ నిండిపోయింది. 

ఇక ప్రియమైన అర్జున్‌. మీరు మా పాఠశాలలో చిన్నపిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా. చూస్తుండగానే పెరిగి పెద్దవాడై ఈ ప్రదేశంలో మీ జీవిత భాగస్వామితో కొత్త జీవితాన్ని ప్రారభించడానికి సిద్దంగా ఉన్న కొత్త అర్జున్‌ని చూస్తున్నా. సానియా మీచుట్టూత చాలా వెచ్చని, సానుకూల శక్తి ఉంది. మీ ఇద్దరిని ఇలా చూడటం చాలా అద్భుతంగా ఉంది. మీ దంపతులను ఆ భగవంతుడు ఎల్లప్పుడూ ఆశ్వీరదించుగాక". అంటూ తన ప్రసంగాన్ని ముగించారు నీతా.

అంబానీల కుటుంబంతో సచిన్‌ బంధం..
సచిన్‌ టెండూల్కర్‌కి ముఖేశ్‌, నీతా అంబానీలతో చాలా సన్నిహిత, వ్యక్తిగత అనుబంధం ఉంది. వారి అనుబంధం దశాబ్దాల నాటిది. టెండూల్కర్కి తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో అత్యున్నత స్థాయిలో ఉన్న కాలం నుంచి అంబానీలతో బంధం ఉంది. ఇక టెండూల్కర్ ఐకాన్ ప్లేయర్‌గా నీతా అంబానీ యాజమాన్యంలోని ఐపీఎల్‌ జట్టు ముంబై ఇండియన్స్‌కు మెంటర్‌గా పనిచేశారు.

అతని కుమారుడు అర్జున్ టెండూల్కర్ కూడా ముంబై ఇండియన్స్ జట్టులో అనేక సీజన్లలో సభ్యుడిగా ఉన్నాడు. అలాగే నీతా అంబానీ చెప్పినట్లుగా..ముంబైలోని అంబానీ యాజమాన్యంలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లోనే అర్జున్‌ టెండూల్కర్‌ చదువుకున్నాడు.

(చదవండి: అలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తినే పెళ్లాడతా..!: రష్మిక మందన్న)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement