అండర్–19 ప్రపంచ కప్‌లో భారత జట్టును విజేతగా నిలిపిన కెపె్టన్ ఆయుశ్ మాత్రేకు అరుదైన ప్రత్యేక ప్రశంస లభించింది. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్వయంగా మాత్రేను అభినందించి అతని విజయంపై శుభాకాంక్షలు చెప్పాడు. 2013లో తాను ఆడిన ఆఖరి టెస్టు సిరీస్‌లో ధరించిన జెర్సీని కూడా సచిన్ బహుమతిగా అందజేశాడు. ముంబైకి చెందిన మాత్రే కెరీర్‌లో మరింత ఎత్తుకు ఎదగాలని, మరిన్ని విజయాలు సాధించాలని సచిన్ ఆకాంక్షించాడు. మాత్రే ఇప్పటికే రెండు సీజన్లలో కలిపి ముంబై తరఫున 13 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు.


