నాడు సచిన్.. నేడు వైభవ్! తొలి మ్యాచ్‌లో ఇద్దరూ ఒకేలా? | Vaibhav Sooryavanshi Fails in Debut After Replacing Sanju Samson | Sakshi
Sakshi News home page

ENG vs IND: నాడు సచిన్.. నేడు వైభవ్! తొలి మ్యాచ్‌లో ఇద్దరూ ఒకేలా?

Jul 4 2026 7:49 PM | Updated on Jul 4 2026 9:06 PM

Vaibhav Sooryavanshi Fails in Debut After Replacing Sanju Samson

టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అరంగేట్ర మ్యాచ్‌లో బ్యాట్ ఝళిపించలేకపోయాడు. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో డెబ్యూ చేసిన వైభవ్‌.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమయ్యాడు. 

సంజూ శాంసన్ స్థానంలో భారీ అంచనాల మధ్య తుది జట్టులోకి వచ్చిన ఈ వండర్ కిడ్, అంతర్జాతీయ క్రికెట్ ఒత్తిడిని తట్టుకోలేక భారత ఇన్నింగ్స్ ఆరంభంలోనే పెవిలియన్‌కు చేరాడు. ఇంగ్లండ్ స్పీడ్ స్టార్ జోఫ్రా ఆర్చర్‌ను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలచడంతో.. మాంచెస్టర్‌లో వైభవ్ షో ఖాయమని అంతా అనుకున్నారు.

కానీ స్పిన్నర్ విల్ జాక్స్ బౌలింగ్‌లో వైభవ్ అనవసర షాట్‌కు ప్రయత్నించి స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. మొత్తంగా 10 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. రెండు సిక్సర్ల సాయంతో కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు.

అయితే అరంగేట్రంలో వైభ‌వ్ రాణించ‌క‌పోయిన‌ప్ప‌టికి ఓ చారిత్ర‌త్మ‌క రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. భార‌త్ త‌ర‌పున అంత‌ర్జాతీయ అరంగేట్రం చేసిన అతి పిన్న వ‌య‌ష్కుడిగా లెజెండ‌రీ బ్యాట‌ర్ సచిన్ టెండూల్క‌ర్‌(16) రికార్డును సూర్య‌వంశీ బ్రేక్ చేశాడు. వైభ‌వ్ కేవ‌లం 15 ఏళ్ల వ‌య‌స్సులోనే అరంగేట్రం చేశాడు.

నాడు స‌చిన్‌.. నేడు వైభ‌వ్‌
కాగా ఈ మ్యాచ్‌లో విఫ‌ల‌మైన వైభ‌వ్‌కు నెటిజ‌న్లు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. స‌చిన్‌తో వైభ‌వ్‌ను పోలుస్తున్నారు. మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ కూడా త‌న అరంగేట్ర మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై కేవ‌లం 15 ప‌రుగులు చేసి.. వ‌కార్ యనిస్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 

ఇప్పుడు సూర్య‌వంశీ కూడా దాదాపు అదే స్కోర్ వ‌ద్ద అవుట్ కావ‌డంతో.. ఈ చిచ్చ‌ర పిడుగు కూడా సచిన్‌లా లెజెండ‌రీ క్రికెట‌ర్ అవుతాడ‌ని అభిమానులు జోస్యం చెబుతున్నారు.


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement