జులై నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌ ఎవరంటే..? | ICC Declares Player Of The Month Winner For July 2026 | Sakshi
Sakshi News home page

జులై నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌ ఎవరంటే..?

Aug 18 2026 4:28 PM | Updated on Aug 18 2026 4:36 PM

ICC Declares Player Of The Month Winner For July 2026

source: ICC X

2026 జులై నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు విజేతలను ఐసీసీ ఇవాళ ప్రకటించింది. పురుషుల విభాగంలో ఈ అవార్డు కోసం ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ హ్యారీ బ్రూక్, బంగ్లాదేశ్ ఓపెనర్ తంజీద్ హసన్ పోటీపడగా.. విండీస్‌ ఆల్‌రౌండర్‌ జస్టిన్‌ గ్రీవ్స్‌ విజేతగా నిలిచాడు.

మహిళల విభాగంలోనూ ఈ అవార్డు వెస్టిండీస్‌ ప్లేయర్‌కే దక్కింది. ఇంగ్లండ్‌ నాట్‌ సీవర్‌ బ్రంట్‌, శ్రీలంక ప్లేయర్‌ హర్షిత సమరవిక్రమ పోటీని ఎదుర్కొని విండీస్‌ హేలీ మాథ్యూస్‌ ఈ అవార్డును కైవసం చేసుకుంది.

గ్రీవ్స్‌ జూలై నెలలో సొంతగడ్డపై శ్రీలంక, పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనలతో ఇరగదీశాడు. బ్యాటింగ్‌లో సెంచరీలు సాధించడంతో పాటు బౌలింగ్‌లో ఐదు వికెట్ల ఘనత నమోదు చేశాడు.

హేలీ మాథ్యూస్ కూడా జూలై నెలలో అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఐర్లాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో ఆమె అసాధారణంగా రాణించి వెస్టిండీస్‌ను 3-0తో సిరీస్ విజయానికి నడిపించింది. ఈ సిరీస్‌ తొలి రెండు వన్డేల్లో సెంచరీలు సహా 265 పరుగులు చేసిన మాథ్యూస్‌.. బంతితోనూ రాణించి ఏడు వికెట్లు పడగొట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement