Photo Credit: X
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా విడుదల చేసిన టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ స్టార్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న అఫ్గానిస్తాన్ స్టార్ రషీద్ ఖాన్‌ను వెనక్కి నెట్టి అబ్రార్ తొలిసారి టాప్ ర్యాంక్‌కు చేరుకున్నాడు.
ఇటీవల భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో రషీద్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో 736 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. దీంతో సెకండ్ ప్లేస్‌లో ఉన్న అబ్రార్ (737 పాయింట్లు) కేవలం ఒక్క పాయింట్ తేడాతో అగ్రపీఠాన్ని దక్కించుకున్నాడు.
ఇక బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ వైట్‌బాల్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అదరగొట్టాడు. శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 237 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన కనబరిచిన బ్రూక్.. ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి 4వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇదే సిరీస్‌లో రాణించిన మరో ఇంగ్లండ్ ఆటగాడు జోస్ బట్లర్ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 5వ ర్యాంక్ సాధించాడు.
మరోవైపు టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఏడు స్థానాలు పుంజుకుని 22వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. కాగా టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ ఓపెనర్లు ఇషాన్ కిషన్ (904 పాయింట్లు), అభిషేక్ శర్మ (893 పాయింట్లు) మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.
చదవండి: ‘రెస్టాఫ్ ఇండియా’ జట్టు ప్రకటన.. వైస్ కెప్టెన్‌గా కేకేఆర్ స్టార్


