ఫిక్సింగ్ ఆరోపణలు.. రింకూ సింగ్‌ సహచరుడి తొలగింపు | UPT20 Player Removed After BCCI Anti Corruption Tightens Grip On Match Fixing | Sakshi
Sakshi News home page

ఫిక్సింగ్ ఆరోపణలు.. రింకూ సింగ్‌ సహచరుడి తొలగింపు

Sep 23 2026 1:38 PM | Updated on Sep 23 2026 1:38 PM

UPT20 Player Removed After BCCI Anti Corruption Tightens Grip On Match Fixing

source: X

భారత క్రికెట్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలపై బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) కొరడా ఝులిపించింది. ఉత్తరప్రదేశ్‌ టీ20 లీగ్‌ (UPT20)లో ఫిక్సింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న మీరట్‌ మావెరిక్స్‌ మాజీ ఆటగాడు రితిక్‌ వాత్స్‌ను లీగ్‌ నుంచి తొలగించాల్సిందిగా ఉత్తరప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (UPCA)ను అదేశించింది. 

ఈ మేరకు UPCA వాత్స్‌ను లీగ్‌ నుంచి తప్పించింది. వాత్స్‌ ప్రాతినిథ్యం వహించిన మీరట్‌ మావెరిక్స్‌కు టీమిండియా విధ్వంసకర బ్యాటర్‌ రింకూ సింగ్‌ సారధిగా వ్యవహరిస్తున్నాడు.

మరోవైపు ఢిల్లీ ప్రీమియర్‌ లీగ్‌ (DPL)లోనూ ఫిక్సింగ్ కలకలం రేగింది. సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ ఆటగాడు వంశ్ బేడీ స్పాట్ ఫిక్సింగ్ ఉచ్చులో చిక్కుకున్న‌ట్లు సమాచారం. అయితే, తనపై వచ్చిన ఫిక్సింగ్‌ ఆరోపణలను వంశ్ బేడీ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా ఖండించాడు. తనపై సోష‌ల్ మీడియాతో పాటు కొన్ని వెబ్‌సైట్లు త‌ప్పుడు క‌థ‌నాలు రాశారంటూ ఫైరయ్యాడు.

కాగా, ఇటీవల మాజీ రంజీ క్రికెటర్‌ రచిత్‌ భాటియా  భారత దేశవాళీ, ఫ్రాంచైజీ క్రికెట్‌లో అవినీతి జరుగుతోందంటూ సంచలన ఆరోపణలు చేశాడు. ఐపీఎల్‌ 2025 సమయంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK)కు సంబంధించిన కీలక సమాచారం బుకీలకు చేరిందని బాంబు పేల్చాడు. ఢిల్లీకి చెందిన ఓ యువ ఆటగాడు తనకు ఈ సమాచారం ఇచ్చినట్లు తెలిపాడు. 

ఇదీ చదవండి: స్పాట్‌ ఫిక్సింగ్ ఆరోపణలు.. ‘నన్ను ఇరికించే ప్రయత్నం’


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement